ETV Bharat / sukhibhava

ఊబకాయంతో మరిన్ని జబ్బులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - obesity causes

కొవిడ్‌-19 అనర్థాలను, దుష్ప్రభావాలను తప్పించుకోవటమెలా? కరోనా జబ్బు బారినపడ్డా, పడకపోయినా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. చాలామందికి కొవిడ్‌-19 తేలికగానే తగ్గిపోతున్నప్పటికీ కొందరికి తీవ్రంగానూ, ప్రాణాంతకంగానూ పరిణమిస్తోంది మరి. అప్పటికే మధుమేహం, గుండెజబ్బుల వంటి సమస్యలతో బాధపడేవారికైతే పెను శాపంగానే మారుతోంది. ఇలాంటి సమస్త దీర్ఘకాల జబ్బులకు వలమేంటో తెలుసా? ఒంట్లో నిరంతరం స్వల్ప స్థాయిలో సాగే వాపు ప్రక్రియ (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌). ఇది పైకేమీ తెలియకుండా లోలోపలే దహించివేస్తుంటుంది. కాబట్టే ఇప్పుడంతా దీన్ని నివారించే జీవనశైలి మీదే దృష్టి సారిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది ఊబకాయాన్ని తగ్గించుకోవటం. ఆహార, వ్యాయామ పద్ధతులతో ముడిపడిన ఇది దీర్ఘకాల వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడుతుంది.

health problems of obesity
ఊబకాయంతో మరిన్ని జబ్బులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
author img

By

Published : Jan 21, 2022, 7:00 AM IST

వాపు ప్రక్రియ రెండు వైపులా పదునైన కత్తి. అవసరమైన సమయాల్లో శరీరాన్ని సంరక్షిస్తుంది. అనవసరంగా ప్రేరేపితమైతే అవయవాలను దెబ్బతీస్తుంది. వాపు ప్రక్రియ మన రక్షణ వ్యవస్థలో అంతర్భాగం. ఏదైనా గాయమైందనుకోండి. లేదూ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తిందనుకోండి. వెంటనే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి వాపు ప్రక్రియను ప్రేరేపించే సైటోకైన్లను విడుదల చేస్తుంది. జ్వరం, నొప్పి, ఎరుపు, ఉబ్బు వంటివన్నీ దీని ఫలితాలే. దీన్నే అక్యూట్‌ ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు.

గాయం, ఇన్‌ఫెక్షన్‌ తగ్గుముఖం పడుతున్నకొద్దీ వాపు ప్రక్రియను అదుపుచేసే సైటోకైన్లు పుట్టుకొస్తాయి. క్రమంగా వాపు ప్రక్రియ సైతం నెమ్మదిస్తూ వస్తుంది, పూర్తిగా కనుమరుగైపోతుంది. కానీ చిక్కంతా దీర్ఘకాల (క్రానిక్‌) వాపు ప్రక్రియతోనే. ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లేకపోయినా ఇది కణస్థాయిలో, స్వల్పంగా నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది.

ఒంట్లో ఏదో ముప్పు తలెత్తిందనే భావనతో అవసరం లేకపోయినా రోగనిరోధక ప్రతిస్పందన ప్రేరేపితం కావటం దీనికి వలం. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివేవీ లేకపోవటం వల్ల సైటోకైన్లు మన కణాలు, అవయవాల మీదే దాడి చేస్తాయి. అంటే మన రక్షణ వ్యవస్థే మనకు శత్రువుగా మారుతుందన్నమాట. గుండెజబ్బులు, కీళ్లవాతం, మధుమేహం, అల్జీమర్స్‌, కొన్ని రకాల క్యాన్సర్లకు ఇదే కారణమవుతోంది. కొవిడ్‌-19 బాధితుల్లోనూ గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థ, సైటోకైన్లే ప్రమాదకరంగా మారుతుండటం చూస్తున్నదే. అప్పటికే దీర్ఘకాల వాపు ప్రక్రియ ప్రేరేపితమై ఉన్నవారికిది మరింత విషమంగానూ పరిణమిస్తోంది.

ఊబకాయంతో పెను ప్రమాదం

ఊబకాయుల్లో కొవ్వు కణజాలం (అడిపోస్‌ టిష్యూ) ఎక్కువగా ఉంటుంది. వాపు ప్రక్రియ అంతా ఇలాంటి కొవ్వు చుట్టూ తిరుగుతోంది. ఇది పైకి కనిపించేది కాదు. పేగుల మధ్యలో లేదా అవయవాల్లో పరచుకొని ఉంటుంది. ఇది రెండు రకాలు. ఊదా రంగు కొవ్వు కణజాలం శక్తి ఖర్చయ్యేలా, అవయవాల్లో పోగుపడిన కొవ్వు బయటకు వచ్చేలా చేస్తుంది. అదే తెలుపు రంగు కొవ్వు కణజాలం శక్తిని నిల్వ చేసుకుంటుంది. మరింత ఎక్కువ కొవ్వు పోగుపడేలా చేస్తుంది. ఇది అంతటితోనే ఆగదు. థైరాయిడ్‌, క్లోమం వంటి గ్రంథుల మాదిరిగానూ పనిచేస్తుంది. హార్మోన్లు అస్తవ్యస్తమయ్యేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థనూ దెబ్బతీస్తుంది.

ఊబకాయుల్లో ఇలాంటి తెల్ల కొవ్వు కణజాలం పెద్ద మొత్తంలో ఉంటుంది. వీరిలో కొవ్వు కణాల సంఖ్య, పరిమాణం కూడా పెరుగుతూ వస్తుంటుంది. కొవ్వు కణాలు పెద్దగా అవటం వల్ల ఆయా భాగాలకు రక్త సరఫరా దెబ్బతింటుంది. దీంతో ఆక్సిజన్‌ సరఫరా తగ్గి, కణాలు చనిపోవటం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి, లోపల ఏదో ముప్పు తలెత్తిందని భావించి లెప్టిన్‌, ఐఎల్‌6, ఐఎల్‌10, టీఎన్‌ఎఫ్‌ ఆల్ఫా, సీ రియాక్టివ్‌ ప్రొటీన్‌ వంటి సైటోకైన్లు పుట్టుకొచ్చేలా చేస్తుంది.

ఇవి శరీరంలో వాపు ప్రక్రియను ప్రేరేపితం చేస్తుంటాయి. మరోవైపు- ఊబకాయుల్లో వాపుప్రక్రియను అదుపులో పెట్టే అడిపోనెక్టిన్‌ వంటి సైటోకైన్ల ఉత్పత్తీ తగ్గిపోతుంది. ఇలా అనవసరంగా వాపు ప్రక్రియను ప్రేరేపించటంతో పాటు అది నిరంతరం కొనసాగేలానూ చేస్తుంది. అంటే రెండిందాలా చేటు చేస్తుందన్నమాట.

జీవనశైలి మార్పు ప్రధానం

దీర్ఘకాల వాపు ప్రక్రియను తగ్గించుకునే మార్గమేది? మితాహారం, సమతులాహారం, వ్యాయామం ద్వారా దీన్ని అదుపులో పెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ బరువు, ఊబకాయం తగ్గేలా చేసేవే. ఊబకాయం తగ్గటానికి బేరియాట్రిక్‌ సర్జరీల వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ముందుగా జీవనశైలి మార్పుల మీద దృష్టి పెట్టటమే మేలు. ఒకప్పుడు బరువు తగ్గితే చాలని అనుకునేవారు. ఇప్పుడు అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గటమే ప్రధానమని గుర్తిస్తున్నారు. దీన్ని సీటీ, ఎంఆర్‌ఐ ద్వారా దీన్ని గుర్తించొచ్ఛు దీన్ని తగ్గించటమే ప్రధానం. బరువు తగ్గినా అవయవాల చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఉన్నట్టయితే వాపు ప్రక్రియ కొనసాగుతూనే వస్తుంటుంది.

  • ఆరోగ్యకరమైన ఆహారం తినటం ముఖ్యం. అదీ పిండి పదార్థాలు, ప్రొటీన్‌, కొవ్వు, సూక్ష్మ పోషకాలు తగు పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగానూ ప్రొటీన్‌ ఎక్కువగానూ తీసుకోవాలి. ఒక గ్రాము పిండి పదార్థంతో 4 కేలరీలు, గ్రాము కొవ్వుతో 9 కేలరీలు, గ్రాము ప్రొటీన్‌తో 4 కేలరీల శక్తి లభిస్తుంది. మనకు రోజుకు 1500-2000 కేలరీల శక్తి అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం ఎంచుకోవాలి. కచ్చితంగా కొలిచి తీసుకోవటం సాధ్యం కాకపోవచ్చు గానీ తినేటప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలి. అలాగే వేళకు భోజనం చేయాలి.
  • తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు, తీపి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌.. మాంసం, వెన్న వంటి సంతృప్త కొవ్వులు వాపు ప్రక్రియ ప్రేరేపితమయ్యేలా చేస్తాయి. వీటికి దూరంగా ఉండాలి. ఆలస్యంగా జీర్ణమయ్యే పొట్టుతీయని ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి.
  • తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. వీటిల్లోని వర్ణద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ వాపు ప్రక్రియ తగ్గేలా చేస్తాయి. ఒమేగా కొవ్వు ఆమ్లాలు వాపు ప్రక్రియను అదుపులో పెట్టే రసాయనాలు పుట్టుకురావటానికి తోడ్పడతాయి. ఇవి బాదం, అక్రోట్లు, పిస్తా వంటి గింజపప్పుల్లో.. చేపల్లో దండిగా ఉంటాయి.
  • వ్యాయామం చాలా చాలా ముఖ్యం. ఇది వాపు ప్రక్రియను నిరోధించే రసాయనాలు పుట్టుకొచ్చేలా చేస్తుంది. ఈ రసాయనాలు కొవ్వును ఖర్చు చేసేలా కాలేయాన్ని పురికొల్పుతాయి. వ్యాయామంతో కండరాల సామర్థ్యవ ఇనుమడిస్తుంది. కండరాలు సాగినప్పుడు వాపు ప్రక్రియను తగ్గించే సైటోకైన్లు కూడా విడుదలవుతాయి.
  • జంక్‌ఫుడ్‌, కొన్నిరకాల మందులతో మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా పేగుల్లోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిన్నా వాపు ప్రక్రియ ప్రేరేపితం కావొచ్ఛు పెరుగు, మజ్జిగ మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి.
  • ఉప్పు పరోక్షంగా వాపు ప్రక్రియ ప్రేరేపితమయ్యేలా చేస్తుంది కాబట్టి తక్కువగానే తినాలి.

సమస్యల ఊబి

ఊబకాయంతో దీర్ఘకాల వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటం రకరకాల సమస్యలకు దారితీస్తుంది.

మధుమేహం: కాలేయం, కొవ్వు కణాల్లో ఇన్సులిన్‌ పనితీరును దెబ్బతీసే ప్రొటీన్‌ ఉత్పత్తి కావటం మధుమేహానికి దారితీస్తుంది.

గుండెజబ్బులు: అదేపనిగా వాపు ప్రక్రియ కొనసాగుతోంటే గుండె మరింత ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇది క్రమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. రక్తనాళాల లోపలి గోడల్లో కొవ్వు, కొలెస్ట్రాల్‌ పేరుకుపోవటం వల్ల రక్త సరఫరా సైతం దెబ్బతింటుంది. రక్తపోటు పెరగటం వల్ల గుండె పనితీరూ అస్తవ్యస్తమవుతుంది.

క్యాన్సర్లు: దీర్ఘకాల వాపు ప్రక్రియతో కణాల డీఎన్‌ఏ దెబ్బతినొచ్ఛు ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీయొచ్ఛు

ఇన్‌ఫెక్షన్ల ముప్పు: దీర్ఘకాల వాపు ప్రక్రియ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్నీ తగ్గిస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. తీవ్రత కూడా ఎక్కువే. దీనికి కారణం సైటోకైన్లు పెద్దఎత్తున ఉత్పత్తి కావటం. ప్రస్తుతం ఊబకాయులకు కొవిడ్‌-19 ముప్పు పెరగటానికి, తీవ్రంగా పరిణమిస్తుండటానికి కారణం ఇదే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.