శృంగారంలో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గడం సహా ఎన్నో లాభాలు ఉంటాయంటారు. ముఖంపై మొటిమలతో బాధపడుతున్నవారిలో పలువురు.. ఈ సమస్యకు శృంగారం ఒక మంచి పరిష్కారమని భావిస్తుంటారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెక్స్‌లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోవని.. శృంగారానికి, మొటిమలు తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మొటిమలు రావడానికి కారణం యాండ్రోజెన్స్ ఎక్కువ ఉండటమని నిపుణులు చెప్పుకొచ్చారు. యాండ్రోజెన్స్ అనే ఈ సెక్స్ హార్మోన్స్ మగవారిలోను, ఆడవారిలోనూ కూడా వస్తుంటాయని.. ముఖ్యంగా యుక్త వయస్సు వచ్చిన వారు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటారని తెలిపారు. ఈ సమస్యకు అవసరం బట్టీ మందులు వాడితే తగ్గిపోతుందని స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం సెక్స్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : శృంగారంతో జలుబు మాయం!