ETV Bharat / sukhibhava

తరచూ కడుపునొప్పి రావడం.. దానికి సంకేతమేనా? - abdominal pain causes

కొందరిలో కడుపునొప్పి భరించరాని సమస్యగా మారుతుంది. తరచూ నొప్పి రావడం తీవ్ర అస్వస్థతకు దారితీస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏంటి? ఈ సమస్యపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

కడుపునొప్పి
కడుపునొప్పి
author img

By

Published : Jul 16, 2022, 11:40 AM IST

తరచూ కడుపునొప్పి రావడం.. దానికి సంకేతమేనా?

కడుపునొప్పి తరచూ వస్తే దానిని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరిపడా నిద్ర, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కూడా కడుపునొప్పికి కారణం అవొచ్చు అని వెల్లడించారు. రోజుకు కనీసం 5-6 గంటలు నిద్ర ఉండాలని స్పష్టం చేశారు. ఇవి కాకుండా విటమిన్​ లోపాలు.. విటమిన్​ బీ12, బీ9, డీ వీటిల్లో ఏమైనా లోపాలు ఉన్నా.. ఐరన్ డెఫీషియన్సీ ఉన్నా.. కడుపు ఉబ్బుతుంది. దీని వల్ల బొడ్డుకు పైభాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఈ లోపాల వల్ల ఒక్కోసారి భుజం నొప్పి కూడా రావొచ్చని .. ఛాతీ మంట కూడా ఉంటుందన్నారు. అయితే ఇవన్నీ గుండెకు సంబంధించి సమస్యలని భావిస్తారని కానీ అలాంటిదేమీ ఉండదని అది కేవలం గ్యాస్​ట్రైటిస్ అని స్పష్టం చేశారు. అప్పర్​జీ ఎండోస్కోపీ చేయించుకుంటే పరీక్షతో కడుపులో అల్సర్స్​, గ్యాస్ట్రోపతి వంటి సమస్యలు ఏమున్నా తెలుస్తాయని సూచిస్తున్నారు. అల్ట్రాసౌండ్​ అబ్డామిన్​ చేయించుకుంటే గనుక గాల్​బ్లాడర్​లో స్టోన్స్​ ఉన్నాయో లేదో కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. వీటిలో ఏ సమస్య ఉన్నా ఇలా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఇదీ చూడండి : ఈ భయాల్ని పక్కనపెడితేనే.. మీ 'శృంగార జీవితం' మరింత మధురం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.