Health Benefits With Coconut Husk : కొబ్బరి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ.. కొబ్బరి పీచుతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడం నుంచి వంటింట్లో అవసరాల వరకు.. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలిస్తే.. ఇకపై మీరు కొబ్బరి పీచును బయట పడేయరని అంటున్నారు. మరి, ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్థరైటిస్ తగ్గిస్తుంది : అర్థరైటిస్ కారణంగా బాధపడుతున్నవారికి కొబ్బరి పీచు గొప్ప ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీరు గనక అర్థరైటిస్ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే.. కొబ్బరి పీచుతో టీ తయారుచేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు. కొబ్బరి పీచులో ఉండే.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పులకు చెక్ పెడతాయట.
రోజుకో నారికేళం- అందం, ఆరోగ్యం పదిలం!
Coconut Health Benefits In Telugu : అధిక బరువు, జుట్టు సమస్యలకు కొబ్బరితో చెక్!
దంతాలను మెరిపిస్తుంది : మీ దంతాలు పసుపు పచ్చగా మారితే.. వాటిని తిరిగి మిలమిల మెరిపించడానికి ఈ కొబ్బరి పీచు ఎంతో సహాయపడుతుంది. దీనికోసం.. కొబ్బరి పొట్టును ఓ గిన్నెలో వేసి మీడియం మంట మీద ఫ్రై చేయాలి. అది నల్లగా మారిన తర్వాత దానిని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని రోజూ దంతాలు శుభ్రం చేయడానికి వాడుకుంటే.. తెల్లగా మెరిసిపోతాయట.
విరేచనాలు తగ్గిస్తుంది : విరేచనాలు, జీర్ణక్రియ సమస్యలకు కొబ్బరి పీచు దివ్య ఔషధంలా పనిచేస్తుందట. ఒకవేళ మీరు విరేచనాలతో బాధపడుతున్నట్లయితే.. కొబ్బరి పీచు వాటర్ తాగితే.. ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కొబ్బరి పీచు వాటర్ తయారు చేయడానికి.. ముందుగా దాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం ద్వారా పై ప్రయోజనాలు పొందుతారు.
Hair Growth Tips : మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా?.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు!
వంట పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు : పాత కాలంలో వంట పాత్రలు తోముకునేందుకు ఇప్పుడు వినియోగిస్తున్న స్క్రబ్బర్స్ ఉండేవి కాదు. అప్పుడు వంటపాత్రలను శుభ్రం చేసుకోవడానికి ఎక్కువగా కొబ్బరి పీచునే వినియోగించేవారు. బొగ్గుపొడి, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో కొబ్బరి పీచు వేసి వంట గిన్నెలు శుభ్రం చేసుకుంటే మీ పాత్రలు తళతళ మెరిసిపోతాయి.
దోమలు తరిమి కొడుతుంది : ఇత్తడి పాత్రలో కొబ్బరి పీచు వేసి అందులో కొద్దిగా కర్పూరం వేసి మండిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు వాసన పోతుంది. అలాగే ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లోని దోమలు కూడా పారిపోతాయట.
జుట్టుకు రంగేసేయండి : ఈ కొబ్బరి పీచును తెల్ల జుట్టుకు రంగు వేయడానికీ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం మీరు ఒక ఇనుప పాత్రలో కొబ్బరి పీచు ప్రై చేసుకోవాలి. అది నల్లగా మారిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పొడి చేసుకోవాలి. అనంతరం ఆ పొడిలో కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె వేసి స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని డ్రైలా జుట్టుకు అప్లై చేసి కొంతసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే.. మీ జుట్టు నల్లగా మారుతుందట. అంతేకాదు.. దీని ద్వారా మీ జుట్టుకు ఎలాంటి హానీ కలగదని చెబుతున్నారు.