ETV Bharat / sukhibhava

శనగలతో బరువు తగ్గుతారు.. ఇమ్యూనిటీ పెరుగుతుంది! - weight loss food

ఇలా ఉడకబెట్టి... అలా తాలింపు వేస్తే రుచికరమైన సాయంత్రం స్నాక్స్​‌ రెడీ! పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినే శనగలు తేలిగ్గా తయారుచేసుకోవచ్చు. రుచికే కాదు, శనగలు రోగ నిరోధక శక్తిని పెంచి, బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయట! మరి.. అవి ఎప్పుడు, ఎలా తింటే ఫలితాలుంటాయో తెలుసుకుందాం రండి..

FOR HEALTH
శనగలతో బరువు తగ్గుతారు
author img

By

Published : Jul 17, 2020, 10:30 AM IST

Updated : Jul 17, 2020, 10:54 AM IST

శనగల్లో(సెనగలు) పోషకాలు నిండుగా ఉంటాయి... పైగా రుచిగానూ ఉంటాయి. మరి, శనగలతో ఏం లాభాలున్నాయో ఓ లుక్కేయండి...

ఉత్తమ టిఫిన్‌..

మిగతా పప్పుగింజలతో పోలిస్తే సెనగల నుంచి అధిక మొత్తంలో మాంసకృత్తులు లభిస్తాయి. ఇవి ఆహారాన్ని నిదానంగా జీర్ణమయ్యేలా చేసి పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని అల్పాహారంగా తీసుకోవచ్చు.

వీటితో కలిపితే..

సెనగలను బియ్యం, గోధుమలు... ఇలా ఇతర ధాన్యాలతో కలిపి తీసుకుంటే మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి.

తిని నీళ్లు తాగితేనే..

వీటిలో పీచు ఎక్కువ. అందుకే సెనగలను క్రమం తప్పకుండా తీసుకునేవారిలో మలబద్ధకం సమస్య ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. కాకపోతే సెనగలు తిని నీళ్లు కూడా బాగా తాగినప్పుడే ఈ ఫలితం కనిపిస్తుంది. వీటిలోని పీచు పేగుల ఆరోగ్యాన్ని కాపాడి కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. అలాగే పీచు రక్తంలో చక్కెర స్థాయులను కూడా బాగా నియంత్రిస్తుంది.

ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే..

సెనగల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజాలుంటాయి. సెలీనియం అనే సూక్ష్మపోషకంతోపాటు ఫోలేట్‌, బీటా కెరొటిన్‌ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉండి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గుండెజబ్బులు ఉన్నవారు..

ఈ పప్పుల్లో కొద్దిమొత్తంలో కొవ్వులుంటాయి. అవి కూడా శరీరానికి మేలు చేసే అన్‌శాచురేటెడ్‌ రూపంలో లభిస్తాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే హృద్రోగులకు పోషకాహార నిపుణులు వీటిని తినమని చెబుతారు. వీటిలోని బయోయాక్టివ్‌ సమ్మేళనాలు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

జాగ్రత్త..

సెనగలను పచ్చిగా తినొద్దు. బాగా నానబెట్టి ఉడికించి మాత్రమే తినాలి. నానబెట్టి మొలకల్లా తీసుకోవచ్చు. నానబెట్టి, వేయించి తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: అరటికాయ పిండితో ఎన్నో లాభాలున్నాయండి!

Last Updated : Jul 17, 2020, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.