మనం రోజూ తినే ఆహారంలో బొప్పాయిని భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు.. చర్మం నిగారింపు మీ సొంతమవుతుంది.
బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు
* అరుగుదల సమస్యలు ఉన్నవారు...బొప్పాయిని తింటే సరి. ఇందులోని పపెయిన్ అనే ఎంజైమ్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి ముక్కలను వేస్తారు. ఇందులో పీచు శాతమూ ఎక్కువే ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లి...చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.
* రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎడిమా వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఎ, సి విటమిన్లు, కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల పోషకాహారలోపమూ తగ్గుతుంది.
* గుండె వ్యాధులు ఉన్నవారు తరచూ బొప్పాయి తీసుకోవడం మంచిది. మధుమేహమూ అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
* బొప్పాయి ముక్కలను పాలతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే...బాలింతల్లో పాలు పడతాయి. ఇందులోని పోషకాలు నెలసరి క్రమంగా వచ్చేలా చేస్తాయి. పచ్చిబొప్పాయిని రుతురోజుల్లో మినహా మిగిలిన సమయంలో తింటే...గర్భాశయం ఆరోగ్యంగానూ ఉంటుంది.
ఇదీ చదవండి: Hashish Oil: హైదరాబాద్లో 'హాషీష్ ఆయిల్'... పోలీసులకు సవాల్!