బేకింగ్ సోడా.. వంటింట్లో కనిపించే ఈ పదార్థం(Baking Soda Uses).. అందాన్ని కాపాడటం సహా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు సహాయ పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. బేకింగ్ సోడా (Baking Soda Uses) ప్రయోజనాల గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే..
- గ్లాసు నీళ్లలో బేకింగ్ సోడా వేసుకుని రోజు నోరు పుక్కిలిస్తే.. పంటికి ఉన్న టాటర్ అనేది క్రమంగా తొలగిపోతుంది. అంతేకాదు నోటి దుర్వాసన కూడా పోతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనకు బేకింగ్ సోడా వాడటం ద్వారా చెక్ పెట్టొచ్చు.
- కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ బేకింగ్ సోడాలోని సోడియమ్ బైకార్బొనేట్ ఉపకరిస్తుంది.
- కిమోథెరపీ చికిత్సలో వాడే మందుల ఆమ్ల లక్షణాలను ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. తక్కువ ఆమ్లస్థాయి ట్యూమర్స్ పెరగకుండా వ్యాప్తి చెందకుండా బేకింగ్ సోడా నియంత్రించగలదు.
- దోమకుట్టిన ప్రాంతంలో దద్దుర్లు, దురద, ఎర్రదనం పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దాలి. మూడు వంతుల బేకింగ్ సోడాను ఒకవంతు నీటిలో కలిసి దోమకుట్టిన ప్రదేశంలో రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- నొప్పిని, మంటను తగ్గించే గుణం కూడా బేకింగ్ సోడాకు ఉంది.
- ముఖంపై మచ్చలు ఉన్న వారు.. ముఖాన్ని బాగా కడిగి, మూడు వంతుల బేకింగ్ సోడా, ఒక వంతు నీటితో చేసిన మిశ్రమాన్ని రాసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- ముఖానికే కాదు కేశాలనూ కాపాడుతుంది బేకింగ్ సోడా! మీ షాంపూలో టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వెంట్రుకలకు పట్టిస్తే.. ఇతర స్పేయర్లు, జెల్స్, కండీషనర్లు చేయలేని అద్భుతాన్ని చేసి చూపిస్తుంది.
అయితే పిల్లలకు ఇది వాడే ముందు డాక్టర్లను సంప్రదించడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : ఎక్కువ సార్లు టీ తాగడం మంచిదేనా? గుండెపై ప్రభావం ఎంత?