ETV Bharat / sukhibhava

గ్లోయింగ్ స్కిన్​ కావాలా? మీ డైట్​లో ఈ చిన్న మార్పులు చేస్తే సరి! - good food for glass skin

చర్మ సమస్యలు మన అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. అన్ని పోషకాలు సమతుల్యంలో ఉండే ఆహారం తినాలి. చాలా మంది చర్మ సౌందర్యం కోసం పైపై లేపనాలు రాస్తూ ఉంటారు. కానీ మనం లోపలకు తీసుకునే ఆహారమే చాలా ముఖ్యం. మరి ఆ పోషకాహారాలు ఏంటో తెలుసుకుందాం.

good foods gor healthy skin
మంచి చర్మ ఆరోగ్యానికి న్యూట్రియెంట్స్
author img

By

Published : Feb 3, 2023, 6:56 AM IST

చర్మ ఆరోగ్యానికి మంచి ఆహారం

చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం చాలా ముఖ్యం. ఆహారంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉంటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. గింజలు, విత్తనాలు, అవకాడో, చేపల నుంచి మనకు లభించే కొవ్వులు మనకు ఆరోగ్యకరమైనవి. వీటిని తినడం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా ఉంటుంది. ఈ కొవ్వులు గుండె కూడా మేలు చేస్తాయి. చర్మ క్యాన్సర్ పెరుగుదలను, వ్యాప్తిని నివారిస్తాయి. ఈ రకం కొవ్వులు శరీరంలో వాపు, మంట లక్షణాలతో కూడిన ఇన్​ఫ్లమేషన్​ను ఆపుతాయి. మన శరీరం మనం తీసుకునే ప్రోటీన్లను అమైనో ఆసిడ్లుగా మార్చుతుంది. వీటి ద్వారా మన చర్మ నిర్మాణానికి అవసరమైన కొల్లాజిన్, కెరోటిన్ అనే ప్రోటీన్లు తయారవుతాయి. చేపలు, గుడ్లు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, చికెన్, పప్పులు మొదలైన ఆహారాల ద్వారా మనం ప్రోటీన్లను పొందవచ్చు.

"సూర్య కిరణాల వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అల్ట్రా వైలెట్​ రేస్​ పడినప్పుడు చాలా వరకు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దీని నుంచి కాపాడుకోవడానికి మనం మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ 'ఏ', 'ఈ', 'సీ', ప్రొటీన్ ఉన్న ఆహారం తినాలి. వీటితో పాటు 'జింక్' , 'సెలీనియం' ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. జింక్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే.. స్కిన్ హీలింగ్ ప్రాసెస్ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఎండ వల్ల డ్యామేజ్​ అయిన చర్మం హీల్ అవ్వాలంటే 'జింక్'​ ఎంతో ముఖ్యం. నట్స్, కూరగాయలు, ఆర్గాన్ మీట్​లో జింక్ ఉంటుంది. గుడ్డు తెల్ల సొనలో ఎక్కువగా ప్రొటీన్స్ ఉంటాయి." అని చెప్పారు డాక్టర్ మధులిక ఆరుట్ల.

Nutrients For Healthy Skin
చర్మ ఆరోగ్యానికి మొలకెత్తిన విత్తనాలు

చర్మ ఆరోగ్యానికి 'విటమిన్ ఏ'
మన చర్మంలో పైన, కింద ఉండే పొరలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్​ ఏ తగినంత ఉండాలి. మనం ఎండలోకి వెళ్లినప్పుడు చర్మానికి హాని కలగకుండా 'ఏ' విటమిన్ కాపాడుతుంది. చర్మంపైన కోతలు, గాయాలు వంటివి మానాలన్నా విటమిన్ 'ఏ' అవసరం. తగినంత 'విటమిన్ ఏ' లేకపోతే మనం చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.

'విటమిన్ సీ' తక్కువగా ఉంటే పళ్ల నుంచి రక్తం కారడం, చిగుర్లు ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తాయి. 'విటమిన్ ఈ' కూడా సీ విటమిన్ తో కలిసి మన కణాల గోడలకు బలాన్నిస్తుంది. జింక్ అనే ఖనిజం మన చర్మంపై ఏదైనా గాయం అయినప్పుడు త్వరగా మానేందుకు సహాయం చేస్తుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మన చర్మానికి ఎండ వేడి వలన కలిగిన హానిని తగ్గిస్తుంది. జింక్ తక్కువైతే చర్మంపై దురద, దద్దుర్ల వంటి సమస్యలొస్తాయి.

Nutrients For Healthy Skin
చర్మ ఆరోగ్యానికి కాయగూరలు, పండ్లు

చర్మ ఆరోగ్యానికి 'విటమిన్ ఈ'
చర్మం డ్రై అయినట్టు కనిపించకుడా ఉండాలంటే మనం 'విటమిన్ ఈ' ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ఈ.. నట్స్, ఆయిల్ సీడ్స్​(పిస్తా,బాదం, క్రోట్ , పల్లీలు)లో ఉంటుంది. స్ప్రౌట్స్​ను మనం ప్రతిరోజూ తీసుకుంటే విటమిన్ ఈ లభిస్తుంది. మన శరీరంలో కొవ్వు తగ్గినప్పుడు మన చర్మం ఏజ్డ్​డా, డ్రై అయినట్లుగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులను మనం తీసుకుంటే చర్మం మాయిశ్చరైజ్డ్​గా, మృదువుగా ఉంటుంది. చేపల నుంచి లభించే ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్​ను తీసుకుంటే మన చర్మం మృదువుగా అవుతుంది. చేపలు, అవిసగింజలు లాంటి ఆహారాన్ని తీసుకుంటే మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చర్మ ఆరోగ్యానికి సెలీనియం
చర్మానికి మేలు చేసే పోషకాలలో సెలీనియం ఒకటి. ఇది ఎండ వల్ల కలిగిన డ్యామేజ్​ను తగ్గిస్తుంది. శరీరంలో సెలీనియం తగ్గితే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మానికి కావాల్సిన పోషకాలు అందాలంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మంచిది. వీటిలో చర్మానికి అవసరమైన విటమిన్లు, చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వుతో కూడిన చేపలలో సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హెచ్చుగా ఉంటాయి.

Nutrients For Healthy Skin
చర్మ ఆరోగ్యానికి పాలు, గుడ్లు

ఆకుకూరల్లో 'విటమిన్ ఏ, సీ, ఈ,' 'ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు' పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో సెలీనియం ఉంటుంది. గుడ్లలో విటమిన్ ఏ, ఈ, సెలీనియం ఉంటాయి. అవిస గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటే.. పప్పులు, బఠాణీల ద్వారా జింక్, ప్రోటీన్లు హెచ్చుగా పొందవచ్చు. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ సీ, ఈ దొరుకుతాయి. పోషకాలను ఆహారాల ద్వారానే పొందటం మంచిది.

Nutrients For Healthy Skin
చర్మ ఆరోగ్యానికి కూరగాయలు, పండ్లు

చర్మ ఆరోగ్యం కోసం సరైన పోషకాహారం తీసుకోలేనివారు వైద్యుల సలహామేరకు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే అవి తమ ఆరోగ్యం పైన, తాము తీసుకుంటున్న ఇతర మెడిసిన్స్ పైన చెడు ప్రభావం పడకుండా చూసుకోవాలి. చర్మ ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా చర్మ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మంచి ఆహారమే చర్మానికి అందం, ఆరోగ్యాలను ఇస్తుందని మరిచిపోకూడదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.