ETV Bharat / sukhibhava

చురుగ్గా, ప్రశాంతంగా బతికేయండిలా..! - etv bharat sukhibhava

ఒక్కోసారి ఏం చేసినా విసుగ్గా అనిపిస్తుంది. ఏ పని ఎంతకీ ముందుకు కదలదు. దీనికి కారణం ఒత్తిడే కావొచ్చు. దాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అవి ఎంటో తెలుసుకుందాం.

get-rid-of-mood-swings-with-these-tips
చురుగ్గా, ప్రశాంతంగా బతికేయండిలా..!
author img

By

Published : Sep 24, 2020, 10:58 AM IST

మెదడు చురుగ్గా, ప్రశాంతంగా ఉండాలంటే ఒత్తిడిగా ఉన్నప్పుడు ఓ పావుగంటైనా సరే! ఒంటరిగా కూర్చోవాలి. చక్కని ఆలోచనలు వస్తాయట. ఆ సందర్భంలోనే కాదు...రోజూ ఓ అరగంట సమయాన్ని ధ్యానం కోసం కేటాయించి చూడండి. మీతో మీరు మాట్లాడుకోండి.మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. పనిలో చురుగ్గానూ ఉంటారు.

ఆలస్యంగా నిద్రలేవడం, హడావుడిగా వంటింట్లోకి పరుగులు తీయడం మనలో చాలామందికి అలవాటే. దీనివల్ల మెదడూ, శరీరం యాంత్రికంగా పనిచేయడానికి అలవాటు పడిపోతాయి. అందుకే మీరు మీ పని మొదలుపెట్టడానికి కనీసం గంట ముందైనా నిద్రలేవండి. చిన్నచిన్న స్ట్రెచింగ్‌ వ్యాయామాలు, నడక, జాగింగ్‌, యోగా వంటివేవైనాసరే కాసేపైనా చేయాలి. ఇవి మెదడునీ, శరీరాన్ని సమన్వయం చేస్తాయి. అలాగే గ్రీన్‌ టీ అలవాటు చేసుకుంటే ఒత్తిడి దరిచేరదు. శరీరం ఉత్సాహంగా ఉంటుంది.

శరీరం చురుగ్గా పనిచేయాలన్నా, మెదడు సరిగ్గా ఆలోచించాలన్నా కూడా అవసరమైన శక్తి ఆహారం ద్వారా అందాలి. ముందు అల్పాహారం ఎట్టిపరిస్థితుల్లోనూ మానేయకూడదు. గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ఎక్కువ మొత్తంలో పీచు, సమపాళ్లలో కొవ్వు, మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలూ, కూరగాయలూ, చేపలూ, పాలూ, పెరుగూ, పప్పుధాన్యాలు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. మానసిక శారీరక ఆరోగ్యానికి కారణం అవుతాయి. రాత్రిపూట తినే ఆహారం తేలికగా, స్వల్పంగా ఉండేలా చూసుకుంటే నిద్రలేమి బాధించదు. ఈ జాగ్రత్తలూ మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి.

ఇదీ చదవండి: ఆరోగ్య సంజీవని.. సుఖీభవ వెల్​నెస్​ సెంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.