ETV Bharat / sukhibhava

ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తెలుసా..?

మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనాను ఎదుర్కోవాలంటే.. అన్నిటికన్నా ముఖ్యమైనది రోగ నిరోధకశక్తి. పుట్టుకతో సహజంగా వచ్చే శక్తిని పెంపొందించుకోడంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని రోగాలు వచ్చి మనకు తెలియకుండానే నయమైపోతుంటాయి. ఇందుకు కారణం మనలో ఉన్న రోగ నిరోధశక్తే. దీన్ని ఎక్కడినుంచో ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వైద్యులు సూచించిన నియామాలు పాటిస్తూ.. మన వంటింట్లో దొరికే వస్తువులతోనే పెంపొందించుకునే అవకాశాలున్నాయి. ఆహార నియమావళి, వ్యక్తిగత అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే కరోనాను దరి చేరకుండా చూసుకోవచ్చు.

corona
corona
author img

By

Published : Jul 11, 2020, 9:57 PM IST

ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తెలుసా..?

ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా కేసుల తీవ్రత కనిపిస్తోంది. ఇంట్లో ఒకరికి వచ్చినా.. మిగతా కుటుంబసభ్యులూ వైరస్‌ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఎవరికి వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధుల్ని తరిమికొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

రోగ నిరోధక శక్తిలో వీటిదే కీలక పాత్ర

రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఏ, ఈ, డీ, సీ, బీ విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనోఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలది కీలకపాత్ర. హానికారక సూక్ష్మక్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి విటమిన్‌ సీ, విటమిన్‌ డీ3, జింకు తదితర మాత్రలు వాడుతున్నారు. నెలపాటు ఇవి వేసుకోవాలంటే ప్రతి వ్యక్తికి 600-650 వరకు ఖర్చవుతోంది. అయితే వంటింట్లో దొరికే పదార్థాలతోపాటు పౌష్టికాహారంతో వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవచ్చని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

నిత్యం ఉదయం ఇలా చేయడం ఉత్తమం

ఇంట్లో ఉండే చాలా వస్తువులే మనలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఉదయం లేవగానే నీళ్లలో తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు కలిపి వేడి చేసుకొని వడబోసుకోవాలని చెబుతున్నారు. తేనీటికి బదులు నిత్యం ఒక కప్పు దీనిని తీసుకుంటే.. గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం దొరుకుతుంది. తర్వాత 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలని చెబుతున్నారు. యోగా వంటివి చేయడం మరింత ఉత్తమం.

అల్పాహారం ఉదయం 8 గంటల లోపు పూర్తి చేయాలని.. మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. వాటిలో క్యారెట్‌, ఆకుకూరలు తురిమి వేసుకుంటే ఇంకా మంచిదని వివరిస్తున్నారు. మొలకలతో కూడిన ధాన్యాలు, పప్పులు తీసుకోవడం ద్వారా సీ, ఈ, బీ విటమిన్లు అందుతాయని చెబుతున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో సీజన్ల వారీగా దొరికే పండ్లు విరివిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

మధ్యాహ్న భోజనంలో...

మధ్యాహ్న భోజనంలో నిత్యం తీసుకునే పదార్థాలతోపాటు ఏదైనా ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ తదితర కూరలు తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. ప్రొటీన్ల కోసం చికెన్‌ ఒక్కొక్కరు 150-200 గ్రాములు, మటన్‌ 75 గ్రాములు, చేపలు 100 గ్రాములు, పన్నీరు 50 గ్రాములు తీసుకోవచ్చని చెబుతున్నారు. శాకాహారులైతే శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్‌ తీసుకోవాలని అంటున్నారు.

సాయంత్రం...

సాయంత్రం ఎండు ఫలాలు తీసుకోవాలని.. బొబ్బర్లు, అలసందలు, సెనగలు, పుచ్చకాయ, గుమ్మడి గింజలు తీసుకుంటే జింక్‌, సెలీనియం, ఐరన్‌ పుష్కలంగా అందుతాయని అంటున్నారు. వీటితోపాటు కాయగూరలు ఉడకబెట్టి దానిలో కాస్త మిరియాల పొడి వేసి సూప్‌ కింద తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. రాత్రి 7.30- 8 గంటలలోపు భోజనం పూర్తిచేయటం మంచిది. దీనివల్ల ఆహరం త్వరగా జీర్ణమయ్యేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో జొన్న, గోధుమ రొట్టెలు పరిమితంగా తీసుకోవాలని.. నిద్రించే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు చేస్తుందని సూచిస్తున్నారు.

విటమిన్‌ మాత్రల వల్ల కరోనా తగ్గదు. కానీ దానిని ఎదుర్కొనే రోగ శక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారిలో రోగనిరోధక శక్తి పెరగడానికి జింక్‌ మాత్ర రోజుకు ఒకటి వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే 500 మిల్లీ గ్రాముల విటమిన్‌ సీ మాత్రలు రోజుకు రెండు.. విటమిన్‌ డీ మాత్ర 60 వేల యూనిట్లు కలిగినది వారానికి ఒకటి చొప్పున వేసుకోవాలని అంటున్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఏ దోహదపడుతుంది. ఈ, బీటా కెరోటిన్, సీ, బీ విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని వివరిస్తున్నారు.

బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సీ, బీ విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో సాయపడతాయి. నారింజ, నిమ్మ కాయలు, బత్తాయి, బెర్రీ తదితర వాటిలో విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. ఆకు కూరల్లో బీటా కెరోటీన్, విటమిన్ సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దండిగా దొరుకుతాయి.

కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, అన్ని పోషకాలూ సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. తాజాపండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.

మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఈ పోషకాలన్నీ సమతులంగా ఉండేలా చూసుకుంటే, రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు మనపై కొవిడ్ లాంటి వ్యాధులు దాడి చేసినా… ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అందుకే, కరోనావైరస్ బాధితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బలవర్థకమైన ఆహారం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ పోషకాలన్నీ నిరు పేదలకు లభించటం కష్టం. అలాంటి వారు వంటింట్లో లభించేవాటినే వాడుకుంటే మంచిది. అది కూడా కష్టమైతే భౌతికదూరం పాటించి చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అతి ఉత్తమం.

ఇదీ చదవండి : ప్రగతి భవన్​కు చేరుకున్న సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.