ETV Bharat / sukhibhava

కొవ్వును సులభంగా కరిగించేందుకు ఆరు సూత్రాలు! - కొవ్వు

fat burning techniques: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆచరణలో వెనకబడిపోతుంటారు. కొవ్వును సులభంగా కరిగించేందుకు ఈ ఆరు సూత్రాలను పాటించి చూడండి.

fat burning techniques
కొవ్వును కరిగించే ఆరు సూత్రాలు
author img

By

Published : Apr 2, 2022, 5:46 PM IST

fat burning techniques: బరువు పెరగడం సులువే. కానీ తగ్గించుకోవడమే చాలా కష్టం. ఇందుకోసం చాలా శ్రమపడాలి. ఆహారంతో పాటు శారీరక శ్రమ చేయాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించేందుకు సాయపడే ఈ సూత్రాలను పాటించండి.

  • తక్కువ కెలొరీలుండే కూరగాయలను రోజువారీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
  • అలాగని మాంసకృత్తులను మరవకూడదు. అందుకోసం మాంసం, పాలు, పప్పుదినుసులను తీసుకోవాలి.
  • చిరుతిళ్ల పేరుతో కనిపించిన వాటినల్లా తినేయొద్దు. నూనెలో వేయించినవి, మసాలాలను తగ్గించి తాజాపండ్లను తినాలి.
  • వ్యాయామం తప్పనిసరి. వారంలో కనీసం మూడుసార్లు బరువులెత్తే వ్యాయామాలను చేయాలి. చిన్న వాటితో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి.
  • అతి తక్కువ/జీరో కెలొరీలుండే శీతలపానీయాలను తీసుకోవాలి. లేదంటే తాజా పండ్ల రసాలను తాగితే సరి.
  • రోజూ ఎనిమిది వేల అడుగులు వేయాలి. నడక వల్ల శరీరం మొత్తం కదులుతుంది.

ఇదీ చూడండి: మీరు కూడా అలా నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.