ETV Bharat / sukhibhava

ప్రతి మనిషిలో ఎన్నో వ్యక్తిత్వాలు.. మీరెలాంటివారో తెలుసా? - different personalities in a human being was explained in telugu

ఓ మనిషిలో ప్రస్ఫుటంగా కనిపించే గుణాలను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించటంలో ఒక అంచనాకు వస్తాం. ఆయా పరిస్థితులు, తారసపడే వ్యక్తులు, సందర్భాలను బట్టి మన ఆలోచనలు, భావనలు, ప్రవర్తన మారిపోతుంటాయి. అయితే చాలావరకు ఆయా పరిస్థితుల్లో మనం కూడా అందరిలాగానే నడచుకుంటుంటాం. ఇలా మనకు గానీ మన నుంచి ఇతరులకు గానీ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడతాం.

explaining different kinds of personality a human being has
ప్రతి మనిషిలో ఎన్నో వ్యక్తిత్వాలు.. మీరెలాంటివారో తెలుసా?
author img

By

Published : Sep 2, 2020, 5:52 PM IST

ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. ప్రతి ఆలోచనా విభిన్నమే. ప్రతి చేష్టా వైవిధ్యమే. ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. ఒకేలా ఆలోచించరు. ఒకేలా ప్రవర్తించరు. ఇదే వ్యక్తిత్వం గొప్పతనం. నడిచే నడవడి, మాట్లాడే తీరు, ఎదుటి వ్యక్తులకు ఇచ్చే గౌరవం వంటివన్నీ దీనిలోని భాగాలే. అనేకానేక విశిష్టతలతో సమాజం వర్ధిల్లుతుండటానికి మూలం ఇదే. నిజానికి ఇది మంచి వ్యక్తిత్వం, ఇది చెడ్డ వ్యక్తిత్వమని ఖరాఖండిగా విడదీసి చెప్పటం కష్టం. కొందరిలో మంచి గుణాలు ఉండొచ్చు, కొందరిలో చెడు గుణాలు ఉండొచ్చు. ఒక వ్యక్తిలోనే మంచీ చెడు రెండు గుణాలూ కలగలసి ఉండొచ్చు.

అయితే ప్రస్ఫుటంగా కనిపించే గుణాలను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించటంలో ఒక అంచనాకు వస్తాం. మంచి పనులు చేస్తే మంచి వాడంటాం. చెడ్డ పనులు చేస్తే చెడ్డవాడంటాం. ఆయా పరిస్థితులు, తారసపడే వ్యక్తులు, సందర్భాలను బట్టి మన ఆలోచనలు, భావనలు, ప్రవర్తన మారిపోతుంటాయి. అయితే చాలావరకు ఆయా పరిస్థితుల్లో మనం కూడా అందరిలాగానే నడచుకుంటుంటాం. ఇలా మనకు గానీ మన నుంచి ఇతరులకు గానీ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడతాం. గత అనుభవాలను బేరీజు వేసుకుంటూ.. సందర్భాలకు తగ్గట్టుగా ప్రవర్తిస్తూ.. పనులు పూర్తి చేసుకుంటాం. అయితే కొందరు చుట్టుపక్కల పరిస్థితులను, వ్యక్తులను ఏమాత్రం పట్టించుకోకుండా తమకు తోచినట్టుగా నడచుకుంటుంటారు. ‘ఎవరెలా పోతే నాకేం?’ అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. 'నాకెందుకొచ్చిన గొడవ?' అని దేన్నీ పట్టించుకోకుండా తప్పించుకు తిరిగేవారు మరికొందరు. ఇలాంటి గుణగణాలతోనే ఇబ్బందుల్లో పడిపోతుంటారు. ఇతరులకూ చిక్కులు కలిగిస్తుంటారు.

వ్యక్తిత్వం-సమస్యలు

కొన్ని సమస్యలు సమస్యలుగా కనిపించవు. ఇవీ ఓ సమస్యలేనా? అనీ అనిపిస్తుంటుంది. ముఖ్యంగా వాటితో బాధపడేవారికి. మొదట్లో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు కూడా. కానీ రాన్రానూ చిక్కులు మొదలవుతాయి. తమతో పాటు చుట్టుపక్కల వాళ్లకూ తిప్పలు తెచ్చిపెడతాయి. వ్యక్తిత్వ సమస్యలు అలాంటివే. ఆలోచనా తీరు, ప్రవర్తనా పద్ధతులతో ముడిపడిన ఇవి మనకు తెలియకుండానే దీర్ఘకాలం పాటు వెంటాడుతూ వస్తుంటాయి. శ్రుతిమించితే నలుగురితో కలవలేకపోవటం, సంబంధాలు దెబ్బతినటం, వృత్తుల్లో రాణించలేకపోవటం వంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయి.

ఎక్కడిదీ వ్యక్తిత్వం?

చిన్నప్పట్నుంచీ మనం పెరిగిన తీరుతెన్నులు.. మన చుట్టూరా పరిసరాలు, వాతావరణం.. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారితో ఎదురయ్యే అనుభవాలు.. ఉపాధ్యాయులు, పెద్దవాళ్లు చెప్పే మాటలు.. ఇలాంటివన్నీ మన ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దుతూ వస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని నైతిక విలువలు ఒంట బట్టొచ్చు. కొన్ని అలవాట్లు అలవడొచ్చు. రకరకాల అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు. ఇవన్నీ మన వ్యక్తిత్వంలో భాగమై వస్తుంటాయి. అలాగే వంశపారంపర్యంగానూ కొన్ని స్వభావాలు, గుణాలు అబ్బుతుంటాయి. 'వీడికి అచ్చం వాళ్ల నాన్న బుద్ధులే వచ్చాయి'.. 'తను అచ్చం ఆమె అమ్మలాగే మాట్లాడుతుంది. అలాంటి అలవాట్లే అబ్బాయి' అని చాలామంది అంటుండటం తెలిసిందే. ఇలా వంశపారంపర్యగా వచ్చే గుణాలు, చుట్టుపక్కల పరిసరాలు వ్యక్తుల ప్రభావంతో నేర్చుకునే అలవాట్లు, ఆలోచనలు ఇవన్నీ గూడుకట్టుకుంటూ.. 18, 20 ఏళ్లు వచ్చేసరికి వ్యక్తిత్వంగా రూపుదాల్చుతాయి.

సమస్యలు రకరకాలు

వ్యక్తిత్వ సమస్యలను పోల్చుకోవటం, గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే వీటికి దారితీసే గుణాలు చాలామందిలో సర్వసాధారణంగా కనబడుతూనే ఉంటాయి. అయితే ఎక్కువమందిలో తరచుగా, స్పష్టంగా కనబడే కొన్ని భిన్నమైన గుణాల ఆధారంగా వ్యక్తిత్వ సమస్యలను పట్టుకోవచ్చు. ఇవి ప్రధానంగా 3 వర్గాలుగా కనబడుతుంటాయి.

మొదటి వర్గం

  1. అనుమానం (పారానాయిడ్‌): ఇతరుల సహాయం పొందాలన్నా, వారితో కలిసి జీవించాలన్నా విశ్వాసం అవసరం. కానీ కొందరు ఎవరినీ నమ్మరు. ప్రతి ఒక్కరినీ శంకిస్తుంటారు. ప్రతిదాన్నీ అనుమానాస్పద దృష్టితో చూస్తుంటారు. ఇతరులను నమ్మితే తమను వాడుకుంటారని భావిస్తుంటారు. దీంతో విరోధం, శత్రుత్వం పెరుగుతాయి. ఇది సన్నిహిత సంబంధాల విషయంలో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. చిత్రమేంటంటే- అనుమానాన్ని పక్కనపెడితే మిగతా విషయాల్లో బాగానే ఉంటారు. మామూలుగానే ఉద్యోగం చేసుకుంటారు. తెలివి తేటలు బాగానే ఉంటాయి. అందువల్ల చాలామంది దీన్నో సమస్యగా భావించరు. ‘వీడో అనుమానం పురుగు’ అని వదిలేస్తుంటారు. మొదట్లో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ గొడవలు, తగాదాలు మొదలైతే మాత్రం తలనొప్పిగా పరిణమిస్తుంది.
  2. మనో వికారం (స్కిజాయిడ్‌): ఒంటిరితనాన్ని ఇష్టపడటం దీని ప్రత్యేకత. ఇలాంటి గుణం గలవారు విడిగా ఉండాలని చూస్తుంటారు. కొందరు కుటుంబ సభ్యులతోనూ అంతగా కలవరు. కొత్తవారితో కలవటానికి అసలే ఇష్టపడరు. ఇతరులతో సంబంధం ఏర్పరచుకుంటే అది తమ స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, సమస్యలు సృష్టిస్తుందని భావిస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే ఆనందాలనూ ఆస్వాదించలేరు. కొందరు శృంగారం మీదా అంత ఆసక్తి చూపరు. వీరిలో భావోద్వేగాలు కూడా తక్కువగానే ఉంటాయి. నలుగురిలో, బహిరంగ సభల్లో మాట్లాడటానికి జంకుతారు. దీంతో వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి.
  3. కొట్టొచ్చే తేడా (ఎక్సెంట్రెడ్‌): ఊరందరిదీ ఒకదారి, ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా ఉంటుంది వీరి ప్రవర్తన. నలుగురితో కలిసి ఉన్నప్పుడు ‘అందరిలాగే ఎందుకుండాలి?’ అనుకుంటుంటారు. దుస్తులు కావొచ్చు, చేష్టలు కావొచ్చు, హావభావాలు కావొచ్చు, వ్యక్తిగత అంశాలపై తీసుకునే శ్రద్ధ కావొచ్చు.. ఇలా అన్నింట్లోనూ ప్రస్ఫుటంగా తేడా కనిపిస్తుంటుంది. కొందరు తమకు అతీత శక్తులు ఉన్నాయనీ నమ్ముతుంటారు. దీని మూలంగా ఇతరులతో కలవలేకపోవటం, సాన్నిహిత్యం దెబ్బతినటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

రెండో వర్గం

  1. నేర స్వభావం (యాంటీసోషల్‌): ఇలాంటి గుణం గలవారు తమకు, ఇతరులకు ఎదురయ్యే పర్యవసానాలను పట్టించుకోకుండా ఏది తోస్తే అది చేసేస్తుంటారు. నీతి నియమాలను, కట్టుబాట్లను పట్టించుకోరు. క్రమశిక్షణ ఉండదు. తేలికగా తగాదాలకు దిగుతుంటారు. దొంగతనాలు, నేరాలకు పాల్పడి కేసుల్లో చిక్కుకుంటారు. కొందరు మాదకద్రవ్యాల వ్యసనానికీ లోనవ్వొచ్చు.
  2. ఊగిసలాట (బార్డర్‌లైన్‌): ఉన్నట్టుండి భావోద్వేగాలు మారిపోతుండటం దీని ప్రత్యేకత. ఇప్పుడీ క్షణంలో ఎంతో ప్రేమ ప్రదర్శించొచ్చు, మరుక్షణంలోనే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయొచ్చు. తరచుగా కుంగుబాటుకు (డిప్రెషన్‌) కూడా లోనవుతుంటారు. అలాగే ఉద్యోగం, వృత్తుల్లో స్థిరపడక ఇబ్బందులు పడుతుంటారు. గాఢమైన సంబంధాలు లేకపోవటం వల్ల ఆత్మీయ అనుబంధాలకు దూరమవుతుంటారు.
  3. దురభిమానం (నార్సిసిస్టిక్‌): తమను తాను గొప్పగా ఊహించుకోవటం దీని నైజం. ఇలాంటి వ్యక్తిత్వం గలవారు మిగతావారి కన్నా విలక్షణమైనవాళ్లమని అనుకుంటుంటారు. తోటివారిని వాడుకొని ప్రయోజనం పొందాలని చూస్తుంటారు. దీంతో తెలివితేటలున్నా, నైపుణ్యమున్నా ఆదరాభిమానాలకు దూరమవుతుంటారు.
  4. ప్రదర్శించుకోవటం (హిస్ట్రియానిక్‌): బయటకు గొప్పగా, ఆడంబరంగా కనిపించాలనే తపన పడుతుంటే హిస్ట్రియానిక్‌ గుణంగా భావించొచ్చు. ఇలాంటివాళ్లు నలుగురిలో ఉన్నప్పుడు తాము కొట్టొచ్చినట్టు కనబడాలని, అందరూ తమను పొగడాలని, మెచ్చుకోవాలని కోరుకుంటుంటారు. ఒకవేళ మెచ్చుకోకపోతే నిరాశకు లోనవుతుంటారు. గోరంతలు కొండంతలు చేసి చెబుతుంటారు.

మూడో వర్గం

  1. అతి భయం (యాంగ్జియస్‌ అవాడ్‌నెస్‌): ఇలాంటి గుణం గలవారు ప్రతి పనికీ వెనకాడుతుంటారు. సరిగా పని చేస్తామో లేదో, చేసినా తప్పు పడతారేమో అనే దిగులు లోలోపల వేధిస్తుంటుంది. తిరస్కరిస్తారేమోననే భయం ఎక్కువ. దీంతో స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండిపోతుంటారు. దీంతో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితంగా పనులను పూర్తి చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త పనులు చేయటానికి మొగ్గు చూపరు. ఉద్యోగాల్లో రాణించలేక వాపోతుంటారు.
  2. అతి చాదస్తం (అబ్సెసివ్‌): చేసిందే చేయటం, చెప్పిందే చెప్పటం దీని ప్రత్యేకత. ప్రతిదీ పక్కాగా ఉండాలని భావిస్తుంటారు. అసాధ్యమైన ప్రమాణాలను ఏర్పరచుకుంటారు. తాము గానీ ఇతరులు గానీ పొరపాటు చేస్తే తెగ బాధపడిపోతుంటారు. తమ అవసరాలకైనా డబ్బు ఖర్చు చేయాలంటే తటపటాయిస్తుంటారు. ఇలాంటి లక్షణాలు శ్రుతిమించితే చుట్టుపక్కల వాళ్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.

జాగ్రత్తలు అవసరం

  • వ్యక్తిత్వ సమస్యలకు చికిత్స తీసుకుంటున్నా కొన్ని జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం.
  • సమస్య గురించి, దాన్నుంచి బయటపడటం గురించి అవగతం చేసుకోవటం చాలా ముఖ్యం.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా కుంగిపోవటం, ఆందోళన, ఒత్తిడి, భయం వంటి లక్షణాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
  • యోగా, ధ్యానం కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఒత్తిడి తగ్గటానికి, మానసిక ప్రశాంతత చేకూరటానికి తోడ్పడతాయి.
  • మద్యం, మాదక ద్రవ్యాల వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి లక్షణాలను తీవ్రం చేయొచ్చు, మందుల ప్రభావాన్నీ తగ్గించొచ్చని తెలుసుకోవాలి.
  • ఒంటరి తనం పనికిరాదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సన్నిహితంగా ఉండటం ఎంతైనా మంచిది.

చికిత్స

వ్యక్తిత్వ సమస్యలకు ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు. నిజానికి వ్యక్తిత్వ సమస్యలతో సతమతమవుతున్నా చాలామంది పెద్దగా పట్టించుకోరు కూడా. సాధ్యమైనంతవరకు ఎలాగోలా నెట్టుకు రావటానికే ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో వాళ్లు కూడా ‘వీళ్లు ఇంతేలే’ అని సర్దుకుపోతుంటారు. అయితే సమస్య మితిమీరి.. ఇంటా బయటా తగాదాలు, గొడవల వంటివి పెరుగుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. వీరికి ఆలోచనా ధోరణిని, ప్రవర్తనను మార్చుకోవటానికి తోడ్పడే సైకోథెరపీ, బిహేవియర్‌ థెరపీ, కౌన్సెలింగ్‌ వంటివి బాగా ఉపయోగపడతాయి. ఆందోళన, అతి చాదస్తం వంటివి ఉంటే అవసరాన్ని బట్టి మందులు ఇవ్వాల్సి రావొచ్చు.

ముప్పు ఎవరికి?

  • బాల్యంలో నిరాదరణకు గురైనవారికి. తల్లిదండ్రుల పర్యవేక్షణ, క్రమశిక్షణ లోపించినవారికి.
  • చిన్నతనంలో తీవ్రమైన ప్రమాదాల వంటివి ఎదుర్కొన్నవారికి.
  • చిన్నప్పుడు కుటుంబంలో తగాదాలు, ఘర్షణలతో కూడిన వాతావరణంలో పెరిగినవారికి. వేధింపులకు గురైనవారికి.
  • ఇంట్లో ఎవరైనా మానసిక సమస్యలు, వ్యక్తిత్వ సమస్యలతో బాధపడుతున్నవారికి
  • మెదడులో లోపాలు గలవారికి, రసాయనాల సమతుల్యత దెబ్బతిన్నవారికి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.