హస్తప్రయోగం వల్ల కండరాలు, నరాల బలహీనత సమస్యలొస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హస్తప్రయోగం వల్ల ఎలాంటి అనర్థం కలగదని.. ఒక వీర్యపు బొట్టు వంద రక్తపు చుక్కలతో సమానం అనడంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. మనం తీసుకునే ఆహారంలో అతిసారవంతమైన పదార్థం వీర్యంగా మారుతుందని చెప్పే వార్తలు కూడా పూర్తిగా అశాస్త్రీయమని, అలా జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
'హస్తప్రయోగం వల్ల నరాలలో బలహీనత కలుగుతుందనేది నిజమే అయితే.. శృంగారంలో పాల్గొనే వారందరికీ ఈ సమస్యను వచ్చేది కదా?' అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ మానసికంగా ఏర్పడిన భయాలే అని.. వాటిని అధిగమిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : క్రికెట్ బాల్ అక్కడ తగిలితే సంతానానికి పనికిరారా?