ETV Bharat / sukhibhava

అధిక వ్యాయామంతో గుండెపోటు వస్తుందా?.. రోజుకు ఎంతసేపు చేయాలి?

అధిక వ్యాయామం శరీరానికి మంచిది కాదా? ఎక్కువగా వ్యాయామం చేస్తే గుండెపోటు సమస్యలు వస్తాయా? రోజుకు ఎంతసేపు వ్యాయామం చేయాలి? అనే విషయాలపై డాక్టర్లు ఏమంటున్నారంటే..?

exercise time in a day
రోజుకు ఎంతసేపు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది
author img

By

Published : Nov 17, 2022, 7:32 AM IST

శారీరకంగా ఫిట్​గా, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు చాలా మంది ఈ మధ్య హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో సాధారణ ప్రజలు కొందరైతే, పేరుగాంచిన సెలబ్రిటీలు మరికొందరు. వీరిలో అధికంగా గుండెపోటు కారణంగానే చనిపోతున్నారు. అదీ వ్యాయామం చేస్తూనే కుప్పకూలుతున్నారు. సాధారణంగా ఎటువంటి వ్యాయామం, శారీరక శ్రమ లేని వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని చెబుతారు వైద్యులు. మరి మంచి ఫిట్​నెస్​ ఉన్నవాళ్లు ఎందుకు చనిపోతున్నారు? దీనికి ప్రధానం కారణం అధికంగా వ్యాయామం చేయడమేనా? ఎంతసేపు వ్యాయామం చేయాలి అనే అంశాలపై వైద్యులు ఏమంటున్నారంటే..

వ్యాయామాలపై వైద్యుల సూచనలు
కేవలం అధిక వ్యాయామం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. స్థాయికి మించిన వ్యాయామం కీడు చేస్తుందని పేర్కొంటున్నారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చని అంటున్నారు. ఇంకా వైద్యులు ఏం సూచిస్తున్నారంటే..

  • రోజుకు కనీసం ముప్పై నిమిషాలు తగ్గకుండా శరీరానికి శ్రమ కలిగించాలి. వారంలో కనీసం ఐదు రోజులైన ఇలా చేయాలి.
  • ప్రాణాయామం, ఆసనాలు వంటి కూర్చొని చేసే శ్వాసకు వ్యాయామాలు గుండె ఆరోగ్యంపై చాలా తక్కువ ప్రభావం చూపిస్తాయి.
  • గుండె ఆరోగ్యంగా ఉంచుకొని, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుకోవాలంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి ఉత్తమం.
  • అధిక వ్యాయామాలు, ఒకేసారి ఎక్కువగా బరువులు ఎత్తడం వంటివీ అంతగా గుండెకు మంచివి కావు.
  • కొత్తగా వ్యాయామం చేసేవారు ఒకేసారి స్థాయికి మించి చేయకుండా నిదానంగా రోజుకు కొంచెం కొంచెం పెంచుతూ పోవాలి.

అతి వ్యాయామం అందరికీ ఇబ్బందికరం కాకపోయినప్పటికీ.. పలు జబ్బు ఉన్నవారికి సమస్యాత్మకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. 'హెచ్ఓసీఎం అనే వ్యాధి ఉన్న వారిలో గుండె కండరం ఉండాల్సిన దానికంటే చాలా మందంగా ఉంటుంది. ఇలాంటి వారికి అధిక వ్యాయామం ప్రాణాంతకం అవుతుంద'ని డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా హార్ట్​బీట్​ సంబంధ వ్యాధులు ఉన్నవారికి అధిక వ్యాయామం అనర్ధమని అంటున్నారు. అయితే, కేవలం వ్యాయామం వల్ల గుండెపోటు రావడం చాలా అరుదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.