- మోకాళ్ల నొప్పులు, భుజాలు పట్టేయడం, వెన్నులో నొప్పి... లాంమనం చేసే వ్యాయామాలు ఆరోగ్యాన్ని ఇవ్వాలి తప్ప హానికరం కాకూడదు. అలా ప్రమాదకరం ఎప్పుడవుతుందో తెలుసుకోవాలనుకుంటే... ఈ స్టోరీ చదవాల్సిందే! టివి వస్తున్నాయంటే మీరు ఒకే రకం వ్యాయామాలను తరచూ చేస్తున్నారని అర్థం. వ్యాయామం చేయడానికి మీరు మీ శరీరాన్ని ఒత్తిడికి గురిచేసినప్పుడు, దానికి తగినంత విశ్రాంతి ఇవ్వనప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కండరాలు, కీళ్ల నొప్పులూ మొదలవుతాయి. అవి ఎదురుకాకుండా ఉండాలంటే మీరు చేసే వ్యాయామాలను తరచూ మార్చండి. తగినంత విశ్రాంతి తీసుకోండి.
- వ్యాయామం అవసరానికి మించి చేస్తోంటే ఆ మార్పు మీలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ నడకలో వేగం తగ్గుతుంది. బరువులను ఎత్తలేరు. మీ శక్తిసామర్థ్యాలు తగ్గుతాయి. కండరాలూ దృఢంగా ఉండలేవు. మీకు ఎంత అవసరమో అంతే చేయడం మంచిది.
- వ్యాయాయం చేయడం వల్ల ఆ సమయంలో అలసిపోవడం సహజం. అయితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మితిమీరి కష్టపడితే ఆ నిస్తేజం, నిస్సత్తువ రోజంతా కనిపిస్తుంది. ఈ సంకేతాలు కనిపిస్తోంటే వ్యాయాయం చేసే సమయాన్ని కొంత తగ్గించి చూడండి.
- బరువులెత్తే కసరత్తులు చేయడం వల్ల.... కండరాల నొప్పులు మామూలే. అవి తాత్కాలికంగా కాకుండా... రోజుల తరబడి ఇబ్బంది పెడుతోంటే మాత్రం మీరు వ్యాయామాలు అనుకున్నదానికంటే ఎక్కువ చేస్తున్నారని అర్థం.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు