ETV Bharat / sukhibhava

అంగస్తంభన సమస్యకు తొలి ఔషధం!.. ఈ జెల్ వాడితే 10నిమిషాల్లోనే పరిష్కారం! ప్రిస్క్రిప్షన్ లేకుండానే కొనొచ్చట! - అంగస్తంభన కాలాన్ని పెంచే జెల్

Eroxon stim gel : పది నిమిషాల్లో అంగస్తంభన చేసే ఓ జెల్​ను.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయించేలా అనుమతులు ఇచ్చింది అమెరికా ఎఫ్​డీఏ. అసలేంటీ ఈ జెల్? ఎలా ఉపయోగించాలి? ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారో తెలుసా?

eroxon-stim-gel-futura-medical
eroxon-stim-gel-futura-medical
author img

By

Published : Jun 13, 2023, 2:19 PM IST

Eroxon stim gel : అంగస్తంభన లోపానికి సంబంధించిన ఓ జెల్​ను వైద్యుల సిఫార్సు లేకుండానే నేరుగా మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ) అనుమతులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ జెల్ తయారీ సంస్థ ఫ్యూటురా మెడికల్ వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన 'ఎరోక్సాన్' అనే జెల్​కు ఎఫ్​డీఏ ఈ మేరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. వైద్య ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన 'డి నోవో' వర్గీకరణలో ఈ ఔషధాన్ని ఎఫ్​డీఏ చేర్చినట్లు ఫ్యుటురా మెడికల్ సోమవారం వెల్లడించింది. ఉన్నతస్థాయి నిపుణులతో కూడిన ఎఫ్​డీఏ బృందం ఔషధాన్ని పరిశీలించినట్లు తెలిపింది. అంగస్తంభన లోపానికి సంబంధించి వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న తొలి ఔషధం/ చికిత్స ఇదేనని పేర్కొంది. తమ ఉత్పత్తులు ఎఫ్​డీఏ ప్రమాణాలను అందుకోవడం సంతోషంగా ఉందని ఫ్యుటురా మెడికల్ సీఈఓ జేమ్స్ బార్డర్ పేర్కొన్నారు.

ఏంటీ ఎరోక్సాన్?
Eroxon cream reviews : అంగస్తంభన లోపం ఉన్నవారి కోసం ఈ జెల్​ను తయారు చేసింది ఫ్యూటురా మెడికల్. ఈ జెల్​ను ట్యూబ్​లలో పెట్టి విక్రయిస్తోంది. ఒక్కో ట్యూబ్.. ఒక డోసులా పనిచేస్తుంది. సంభోగంలో పాల్గొనాలని అనుకున్నప్పుడు దీన్ని ఉపయోగించాలి. పురుషాంగం కొనకు ఈ జెల్​ను రాసుకోవాలని కంపెనీ చెబుతోంది. దీన్ని వాడితే పది నిమిషాల్లోనే అంగం స్తంభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ జెల్ వాడిన 65 శాతం మంది వినియోగదారులు సుదీర్ఘ సెక్స్​ను విజయవంతంగా ఆస్వాదించారని తెలిపింది. జెల్ ప్రభావం దానికదే తగ్గుతుందని స్పష్టం చేసింది.

eroxon-stim-gel-futura-medical
ఎరోక్సాన్ జెల్

Erectile dysfunction medicine : ఎరోక్సాన్​ జెల్ ఇప్పటికే బెల్జియం, యూకేలో అందుబాటులో ఉంది. యూకేలో నాలుగు ప్యాకెట్ల ఎరోక్సాన్​ బాక్స్ ధర 24.99 పౌండ్లు (సుమారు రూ.2,600)గా ఉంది. అమెరికాలో జెల్ ధర ఎంతో ఇంకా నిర్ణయించలేదని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. దేశంలో సరఫరా చేసే తమ భాగస్వామ్య సంస్థే ధరను నిర్ణయిస్తుందని చెప్పారు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం కూడా ఆ సంస్థపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అయితే, 2025లో ఈ జెల్ అమెరికా మార్కెట్లో అడుగుపెట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Erectile dysfunction causes : అమెరికాలో మూడు కోట్ల మంది పురుషులకు అంగస్తంభన లోపం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. లైంగిక కోరికలు ఉన్నప్పటికీ.. అంగం స్తంభించకపోవడం, సంభోగం సంతృప్తికరంగా సాగేంతవరకు అంగం నిలవకపోవడం వంటి సమస్యలను ఈ లోపం కిందకు పరిగణిస్తారు. టైప్ 2 డయాబెటిస్ వంటి రోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నవారితో పాటు.. పొగ తాగటం, ఆల్కహాల్ అధికంగా సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్నవారికి అంగస్తంభన లోపం వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్నవారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.