ETV Bharat / sukhibhava

మూర్ఛ వ్యాధి - ఎవరికైనా రావొచ్చు! ఎందుకు వస్తుంది?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 12:17 PM IST

Epilepsy Symptoms: కొద్దిమంది పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నా కారణం లేకుండానే ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మూర్ఛ ఒకటి. అసలు ఇది ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..

Epilepsy Symptoms
Epilepsy Symptoms

Epilepsy Symptoms and Precautions: నడుస్తూ.. నడుస్తూ సడన్ గా కిందపడిపోవడం, కాళ్లు, చేతులు బిగుతుగా మారడం.. ఈ లక్షణాలు చూస్తుంటే ఏ వ్యాధో గుర్తొస్తోందా. మీరు అనుకున్నది నిజమే ఈ లక్షణాలు అన్ని మూర్ఛకు సంబంధించినవే. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మూర్ఛ వ్యాధి వేధిస్తుంది. దీన్నే ఫిట్స్​, ఎపిలెప్సీ అంటారు. ఇది మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే పోదు. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారిపోతుంది. నియంత్రణే కానీ నివారణ ఉండదు. అసలు ఇది ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం..

ఎందుకు వస్తుంది?: మూర్ఛ రావడానికి ఇది కారణం అని ఎవరూ చెప్పలేరు. కానీ మెదడుకు గాయం, హైఫీవర్​ వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, మెదడులో కణితి ఏర్పడడం, అల్జీమర్స్ వ్యాధి ఉండడం, పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం, ఎయిడ్స్, మెనింజైటిస్ వ్యాధి ఉండడం వంటి పరిస్థితుల్లో మూర్ఛ వ్యాధి వస్తుంది.

మగాళ్లకన్నా మహిళల్లోనే తలనొప్పి ఎక్కువ! - ఎందుకో తెలుసా?- రీసెర్చ్​లో విస్తుపోయే నిజాలు!

ఎప్పుడు వస్తుంది?: మూర్ఛ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మూర్ఛ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. జ్వరం అధికంగా ఉన్నప్పుడు, శరీరంలో షుగర్​ లెవల్స్​ తగ్గినప్పుడు, తలకు దెబ్బలు తగిలినప్పుడు ఫిట్స్​ వస్తుంది.

లక్షణాలు: మెదడులో ప్రభావితమైన భాగంపై ఆధారపడి మూర్ఛ లక్షణాలు ఉంటాయి. అవయవాలు వణకడం, ఆకస్మికంగా పడిపోవడం, తదేకంగా చూడటం, ఆందోళన, స్పృహ కోల్పోవడం, స్ట్రేంజ్‌ ఎమోషనల్ ఫీలింగ్‌, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జనరేషన్​ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!

మూర్ఛ రకాలు: మూర్ఛల్లో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫోకల్​ ఫిట్స్​. బ్రెయిన్​లోని ఒక భాగంలో అసాధారణ కార్యకలాపాల వల్ల ఇది వస్తుంది. ఇది ప్రమాదకరం. ఇందులో కూడా రెండు ఉంటాయి.

  • స్పృహ కోల్పోవటం: ఈ సమయంలో మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకునే స్థితిలో మీరు ఉండరు. మీకు అంతా అయోమయంగా ఉంటుంది లేదా నమలడం, చేతులు రుద్దడం లేదా గుండ్రంగా తిరగడం లాంటివి చేస్తారు.
  • స్పృహ కోల్పోకుండా ఉండటం: ఈ మూర్ఛలు మీ భావోద్వేగాలను మార్చుతాయి. అంతేకాకుండా.. మీ దృష్టి, వాసన, రుచి లేదా వినికిడిపై ప్రభావం చూపుతాయి.

రెండోది సాధారణ మూర్ఛలు: ఈ రకమైన మూర్ఛ మీ మెదడులోని అన్ని భాగాలను నిర్బంధిస్తుంది. ఇందులో ఆరు రకాలు ఉన్నాయి.

  • ఆబ్సెన్స్ మూర్ఛలు: ఈ మూర్ఛలు పిల్లలలో ఎక్కువగా వస్తాయి. ఇందులో పెదవి విరచడం లేదా కన్ను ఆర్పడం వంటి చిన్న కదలికలను కలిగి ఉంటాయి.

కళ్లలో ఈ లక్షణాలు - చూపు కోల్పోవడం ఖాయం - బీకేర్​ ఫుల్!

  • టానిక్ మూర్ఛలు: ఈ రకం ఫిట్స్​ మీ చేతులు, కాళ్లు, వీపులోని కండరాలను గట్టిపడేలా చేస్తాయి. దానివల్ల కొన్నిసార్లు అవి పనిచేయవు.
  • అటోనిక్ మూర్ఛలు: ఇందులో మీ కండరాలు నియంత్రణను కోల్పోతాయి. వీటిని డ్రాప్ మూర్ఛలు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇవి మిమ్మల్ని స్పృహ తప్పి పడిపోయేలా చేస్తాయి.
  • క్లోనిక్ మూర్ఛలు: తరచుగా మీ మెడ, ముఖం, చేతుల్లో జెర్కింగ్ కదలికలు మళ్లీ మళ్లీ వచ్చేలా చేస్తాయి.
  • మయోక్లోనిక్ మూర్ఛలు: మీ చేతులు మరియు కాళ్లలో చిన్నగా మెలితిప్పిన, జెర్కింగ్ కదలికలు వస్తాయి.
  • టానిక్-క్లోనిక్ మూర్ఛలు: దీనిని గ్రాండ్-మాల్ మూర్ఛలు అని పిలుస్తారు. ఇది మీకు స్పృహ కోల్పోయేలా చేస్తుంది. మీ శరీరమంతా గట్టిపడి వణుకుతుంది.

చలికాలంలో పిల్లలకు న్యూమోనియా ప్రమాదం - ఇలా చేయండి - లేకపోతే ఇబ్బందే!

వ్యాధిని గుర్తించడం ఎలా: రక్త పరీక్ష, న్యూరోలాజికల్​ టెస్ట్​​, EEG, న్యూరోసైకోలాజికల్​ టెస్ట్​, CT స్కాన్​, ఫంక్షనల్​ MRI, PET(postive Emission Tomography) ఇలా పలు రకాల పరీక్షల ద్వారా దీనిని గుర్తించవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • పూర్తి నివారణ చర్యలు లేవు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీన్నుంచి రక్షణ పొందవచ్చు.
  • పోషకాహారాలను అధికంగా తీసుకోవాలి.
  • వ్యాయామం చేయాలి. ప్రెజర్​ను తట్టుకోవాలి. తగినంత రెస్ట్​ కావాలి.
  • స్మోకింగ్​ అండ్​ డ్రింకింగ్​కు దూరంగా ఉండాలి.
  • డ్రైవింగ్​ సమయంలో సీట్​ బెల్ట్​, హెల్మెట్​ తప్పనిసరి.

మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్​ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

అధిక కొలెస్ట్రాల్​తో బాధపడుతున్నారా? - కరివేపాకుతో ఊహించని మార్పు - తేల్చిన రీసెర్చ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.