ఎవరికీ చెప్పుకోలేం.. అలాగని భరించనూలేం. కానీ ఎన్ని రోజులని ఈ సమస్యను గోప్యంగానే ఉంచుకొనే ప్రయత్నం చేస్తారు? అవును ప్రతి 10 మందిలో 8 మంది మహిళలు జననేంద్రియాల ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తున్న వారే అని అధ్యయనాలు చెబుతున్నాయి..
శరీరంలో ప్రతి అవయవమూ కీలకమే అని తెలిసినా కొన్నింటి పట్ల ఉదాసీనంగా ఉంటాం. నిర్లక్ష్యం వహిస్తాం. ముఖ్యంగా జననేంద్రియాలకు వచ్చే సమస్యల గురించి బయటకు చెప్పడానికి బిడియపడతాం. మన దేశంలో నూటికి 80 శాతం మహిళలు పరిశుభ్రత విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. ఫలితంగా పదిలో ఎనిమిది మందిపై వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆ ప్రాంతంలో దురద, దద్దుర్లు, అసౌకర్యం వంటివి కలుగుతున్నాయంటే దానర్థం అక్కడ పీహెచ్ స్థాయిలు మారుతున్నాయని. దీన్నుంచి ఉపశమనానికి తక్షణమే వైద్య సాయం తీసుకోవాలి. మనం పాటించాల్సిన జాగ్రత్తలూ కొన్నున్నాయి. మూత్రానికి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా శుభ్రపరుచుకోవాలి. తడిలేకుండా జాగ్రత్తపడాలి. సింథటిక్ కాకుండా.. కాటన్ బ్లెండ్ చేసిన లోదుస్తులను మాత్రమే ధరించాలి. సమతులాహారం తీసుకోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్లను నివారించగలుగుతాం.
ఇదీ చూడండి.. ఇన్‌ఫెక్షన్లు- ప్రకృతి వైద్యం