ETV Bharat / sukhibhava

'మెదడు'లోకి వాయు గరళం.. ఇళ్లలో మొక్కలు మస్ట్​.. బయటకు వెళ్తే 'మాస్క్'​ ఉండాల్సిందే! - మెదడుపై వాయు కాలుష్యం ప్రభావం

అదృశ్య గరళంలా వాయు కాలుష్యం నానాటికీ సమస్యలను పెంచుతోంది. దీనివల్ల శారీరక రుగ్మతలకు తోడు మానసిక ఇబ్బందులూ అధికమవుతున్నట్లు వెల్లడి కావడం కలవరపెడుతోంది. బాధితుల జీవితాల్లో ఆనందం ఆవిరవుతోందని, కుంగుబాటు పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిపై దృష్టిపెట్టి సురక్షిత జీవన మార్గాలను అనుసరించాలంటున్నారు.

effects-of-air-pollution-on-the-brain-causes-and-solutions

author img

By

Published : Jan 4, 2023, 7:07 AM IST

వాయు కాలుష్యంతో శ్వాస - గుండె - ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్లు.. అంతిమంగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని దశాబ్దాలుగా అనేక పరిశోధనలు ఘోషించాయి. కలుషిత గాలితో కలిగే నష్టాల్లో ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఇది శరీరమంతటా తన కోరలను చాస్తూ చివరికి మెదడులోకీ పాకుతున్నట్లు ఇటీవల అనేక పరిశోధనలు వెల్లడించాయి.

  • వాయు కాలుష్యం తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్య భావనలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల బాధితుల రోజువారీ జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. భావోద్వేగ, సామాజిక అంశాలపరంగా ఇబ్బందులు పెరుగుతున్నాయి.
  • బాధితుల ఆలోచన, ఏకాగ్రత, అప్రమత్తత, జ్ఞాపకశక్తి, మేధస్సుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వారిలో అలసట, చికాకు పెరుగుతోంది.
  • బాధితుల్లో సంతృప్తి స్థాయి తగ్గిపోతోంది. నలతకు గురయ్యామనే భావన పెరుగుతోంది.
  • మెదడు ఎదుగుదల దశలో ఉన్న చిన్నారులపై ఈ ప్రభావం ఎక్కువ.
  • వాయు కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లో మానసిక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధనలో తేలింది.
.

ఇలా జరుగుతోంది..
కలుషిత గాలి పీల్చేవారి మెదడులో మార్పులు జరుగుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా భావోద్వేగాలను నియంత్రించే భాగాల్లో ఈ వైరుధ్యాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. మెదడులో సంకేతాలను చేరవేసే న్యూరోట్రాన్స్‌మిటర్ల తీరుతెన్నుల్లో తేడాలొస్తున్నాయని వెల్లడించారు.

ప్రత్యక్షంగా..
వాహనాల నుంచి వచ్చే పొగలోని అత్యంత సూక్ష్మ రేణువులు, గాల్లోని ఇతర కాలుష్యకారకాలు.. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, నేరుగా మెదడులోకి చొరబడుతుంటాయి.
పరోక్షంగా..
గాల్లోని కాలుష్య రేణువుల వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ కలగొచ్చు. శరీరంలో రోగ నిరోధక స్పందనల తీరును మార్చేయవచ్చు. ఆ ప్రభావం అంతిమంగా మెదడుకూ పాకవచ్చు.

ఇలా చేయాలి..
వాయు కాలుష్యం ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఇప్పటికిప్పుడు ఉన్న ప్రాంతాల నుంచి వేరే చోటుకు తరలిపోవడం కుదరకపోవచ్చు. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కలుషిత గాలితో కలిగే మానసిక సమస్యలను తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కంగారొద్దు..
వాయు కాలుష్యంతో కలిగే నష్టాల గురించిన సమాచారాన్ని నిత్యం చదువుతూ అదేపనిగా హైరానా పడొద్దు. దీనివల్ల ఆదుర్దా, కుంగుబాటు మరింత పెరగొచ్చు. కలుషిత గాలి తీవ్ర సమస్య అని, దాన్ని అధిగమించాలని మనకు తెలిసుంటే చాలు.

.

మొక్కలు.. మాస్కులు..

  • ఇళ్లలో మొక్కలు పెంచాలి. బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలి. ఇవి మన ఆలోచనతీరులో పెద్ద మార్పును కలిగిస్తాయి.
  • అభిరుచులకు సమయమివ్వాలి..
  • మనసును నిమగ్నం చేసే పనులు చేయాలి. ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది
.

స్వీయ రక్షణ..
వ్యాయామాల తరహా స్వీయ సంరక్షణ చర్యల్లో నిమగ్నం కావాలి. ఆరుబయట రన్నింగ్‌కు వెళ్లలేకపోతే ఇంట్లోనే దాన్ని చేయాలి.

విశ్రాంతి..
సరిపడా విశ్రాంతి, నిద్ర అవసరం. దీనివల్ల.. ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి శరీరానికి వీలుకలుగుతుంది. మరుసటి రోజు లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి సమకూరుతుంది.

.

కాలుష్యం తాకిడికి గురికావొద్దు..
ఎక్కువ సమయం పాటు వాయు కాలుష్యానికి గురికాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరంలో ఆక్సిడేటివ్‌ ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్‌ ప్రభావాలు తగ్గుతాయి.
అన్నింటికీ చోటుండాలి..
ఏరోబిక్స్‌, యోగా, ధ్యానంతో కూడిన మిశ్రమ వ్యాయామ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇవి శరీరంతోపాటు మనసును తేలికపరుస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది

.

ఆత్మీయబంధాలు..
స్నేహితులు, కుటుంబ సభ్యులతో సాగించే మంచి బంధాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మన వ్యవహారశైలిలో మార్పును గుర్తిస్తే మానసిక నిపుణులను సంప్రదించడానికి సంకోచించకూడదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.