ETV Bharat / sukhibhava

మహిళలకు గర్భకోశంలో కాకుండా మరో చోట గర్భం వస్తుందని తెలుసా? - ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీకి గల కారణాలు

మహిళలు మాతృత్వాన్ని ఓ వరంగా భావిస్తారు. గర్భం నిర్ధరణ అయిన నాటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ గర్భం అనేది కేవలం గర్భాశయంలోనే కాకుండా.. శరీరంలోని మరో భాగంలో (Ectopic Pregnancy Causes) కూడా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఏ భాగంలో వస్తుంది? అలా రావడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అనేది తెలుసుకుందాం.

Ectopic Pregnancy
ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ
author img

By

Published : Oct 29, 2021, 7:59 PM IST

సాధారణంగా గర్భం అనేది గర్భకోశం మాత్రమే వస్తుందని అందరికీ తెలుసు. కానీ.. మహిళల శరీరంలోని వేరే భాగంలో కూడా పిండం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే శరీరంలో ఆ భాగం ఏంటి? ఎక్కడ వస్తుంది? అనే విషయాన్ని తెలుసుకుందాం.

మహిళలకు గర్భాశయం కాకుండా దాని పక్కన ఉన్న ట్యూబ్​లో గర్భం రావడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. దీనిని ఎక్టోపిక్​ ప్రెగ్నెన్సీ (Ectopic Pregnancy Causes) అంటారు. సాధారణంగా అండం విడుదలైన తరువాత గర్భాశయం చేరుకునేందుకు రెండు రోజులు వరకు పడుతుంది. ఈ సమయంలో అండం గర్భాశయం వరకు వ్యాపించి ఉన్న అండవాహికల్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మహిళల అండాలు, పురుష వీర్యకణాలు కలుసుకుంటాయి. ఇలా రెండు కలిసిన తరువాత అది జైగోట్​గా మారుతుంది. ఈ జైగోట్​ గర్భాశయానికి చేరడానికి కొన్నిసార్లు సమయం పడుతుంది. మరికొన్నిసార్లు చేరకపోవచ్చు. ఇలా జరిగినప్పుడు అది అండవాహికల్లోనే ఉండిపోయి ఫలదీకరణం చెందుతుంది. ఇన్​ఫెక్షన్​ల కారణంగా గర్భాశయం మూసుకుపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఈ సమయంలో అండం అండవాహికలు దాటకపోవడంతో గర్భాశయం చేరలేదు. దీంతో ఆగిన ప్రాంతంలోనే వృద్ధి చెందడం ప్రారంభమౌతుంది. కానీ ఈ దశ నిజానికి చాలా కష్టమైంది. గర్భశయానికి సాగే గుణం ఉంటుంది. కానీ అండవాహికలకు అలాంటి గుణం ఉండదు. ఈ కారణంగా ట్యూబ్​లో ఉండే పిండం పెరిగే కొద్ది విచ్ఛినం అవుతుంది. దీంతో మహిళలకు గర్భస్రావం అవుతుంది.

అందుకే పీరియడ్స్​ మిస్​ అయినప్పుడు అండం ఎక్కడ ఉంది అని చెకప్​ చేయించుకోవాలి. ఒక వేళ అండవాహికల్లో ఉంటే.. చికిత్స ద్వారా గర్భాశయంలో అమర్చే వీలుంటుంది.

  • పిల్లల తాగాల్సిన పాలు.. భర్త తాగితే వక్షోజాల్లో పాలు ఇంకిపోతాయా?
  • హోమో సెక్సు​వల్స్​ పెళ్లికి పనికి వస్తారా?
  • అనాకారి అయిన పురుషుడు.. అందమైన భార్య కావాలని కోరుకుంటాడు. ఎందుకు?
  • శీఘ్రస్కలన సమస్య ఉంటే జీవితాంతం బాధపడాల్సిందేనా?
  • ఇతరులు రతిలో పాల్గొన్నప్పుడు పదే పదే చూడాలి అనిపించడం తప్పా? తప్పు అయితే ఏం చేయాలి?
  • హోమోసెక్సువల్​​ మారే అవకాశం ఉంటుందా?
  • హస్తప్రయోగం కాకుండా భార్యతోనే సుఖాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి?
  • ఇలాంటి మరిన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చివరి వరకూ చూడండి.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శృంగారం.. ఓ అత్యద్భుత కార్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.