Drinks For Digestion and Fast Metabolism: చాలా మంది తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితికి టైమ్‌కి తినకపోవడం ఒక కారణమైతే.. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, మోతాదుకు మించి తినడం మరో కారణం. వీటితోపాటు మానసిక ఒత్తిడి కూడా మరో రీజన్. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే.. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్య ఎదుర్కొనేవారు.. తిన్న తర్వాత కొన్ని డ్రింక్స్ తాగాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వంటింట్లో లభించే వాటితోనే వీటిని తయారు చేయొచ్చట! మరి అవేంటో చూడండి. నచ్చితే ఫాలో అయిపోండి.
జీరా వాటర్: జీలకర్రలో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి, పాస్ఫరస్, సోడియం వంటివి అధికంగా ఉంటాయి. కాలేయంలో పైత్యరసం తయారవటానికి జీలకర్ర ప్రోత్సహిస్తుంది.
- ఓ టేబుల్‌స్పూను జీలకర్రను శుభ్రంగా కడిగి.. 150మి.లీ. నీటిలో రాత్రంతా నానబెట్టాలి.
- ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, జీలకర్రను తినాలి.
- క్రమం తప్పకుండా నెల రోజులపాటు ఇలా చేయడం వల్ల అజీర్తి, మలబద్ధకం పూర్తిగా నయమవుతాయి.
తులసి కషాయం తాగితే జలుబు, దగ్గులతోపాటు 'ఒత్తిడి' మటుమాయం!
అల్లం టీ: అల్లంలోని ఫినోలిక్ సమ్మేళనం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది లాలాజలం, పైత్యరస ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అల్లం జీర్ణక్రియను, లైపేస్ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇంకా పేగు కండరాలను సడలించడం ద్వారా పేగు సంకోచాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణమైన ఆహారాన్ని సులభంగా బయటకు పంపడంలో తోడ్పడుతుంది.
- ఓ చిన్న అల్లం ముక్కను తురిమి అర గ్లాసు నీటిలో వేయాలి.
- నీరు సగానికి వచ్చే వరకూ మరిగించాలి.
- కాస్త చల్లారిన తర్వాత వడగట్టి ఈ కషాయాన్ని తాగితే అజీర్తి, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు.
తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!
బటర్‌మిల్క్: మజ్జిగను సాధారణంగా అందరూ తీసుకుంటారు. మజ్జిగలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేసి.. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఉసిరి రసం: ఆయుర్వేదం ప్రకారం.. ఉసిరి అన్ని సమస్యలకూ నివారిణిగా ఉపయోగిస్తారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరికాయ జ్యూస్ ఆరోగ్యకరమైన కాలేయ పనితీరును ప్రోత్సహిస్తుంది. అలాగే జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
- ఒక కప్పు ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి.. గింజలను తొలగించాలి.
- ఆ తర్వాత ఉసిరికాయలను మెత్తగా నూరి.. దానికి అరకప్పు నీరు, కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు కలపాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక జల్లెడలో వడగట్టి, రసాన్ని వేరే గ్లాసులోకి తీసుకుని తాగాలి.
Viral Infection Remedies : ఇంటి చిట్కాలతో.. వైరల్ ఇన్ఫెక్షన్స్కు చెక్!
తులసి టీ: తులసిలోని ఔషధ గుణాలు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి.
- తులసి ఆకులు శుభ్రంగా కడిగి.. పావు లీటరు నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి మరిగిన తర్వాత.. స్టౌ ఆఫ్ చేయాలి.
- ఆ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత వడకట్టకుండా ఆకులతో సహా తాగాలి.
- ఇలా తరచు తాగితే జీర్ణ సమస్యలు తగ్గడమే కాదు.. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. రోగ నిరోధకశక్తి మెరుగుపడుతుంది.
- కావాలంటే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు.
నిద్ర రావట్లేదా? - అల్లం, అశ్వగంధతో డీప్ స్లీప్!
తిన్న తర్వాత కూల్‌డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!