తిన్న ఆహారం సరిగా జీర్ణం కావటం, మలబద్ధకం దరిజేరకుండా చూడటం వంటి వాటికే కాదు.. బరువు తగ్గటానికీ నీరు తోడ్పడుతుంది. కేలరీలు మరింత ఎక్కువగా ఖర్చు కావటంలో ఇది బాగా తోడ్పడుతుంది. తగినంత నీరు తాగటం వల్ల సుమారు గంటన్నర వ్యవధిలో జీవక్రియల వేగం 24-30% వరకు పెరుగుతున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. అంటే ఇది అదనంగా మరో 96 కేలరీలు ఖర్చు అవటంతో సమానమన్నమాట. భోజనం చేయటానికి అరగంట ముందు నీరు తాగటం మరీ మంచిది. ఇది బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది.
ఇవీ చూడండి: కనిపించని గణేశ్ చతుర్థి శోభ.. ఆలయాల్లోనే పూజలు!