మనం సగటున రోజుకు 1-2 లీటర్ల నీళ్లు తాగుతామని అంచనా. ఇది రోజు మొత్తమ్మీద తాగే ద్రవాలలో 30% మాత్రమే. మిగతాదంతా కాఫీ, టీ, పండ్ల రసాల వంటి వాటి రూపంలోనూ.. ఆహారంలోని నీటి ద్వారానూ లభిస్తుంది.
సాధారణంగా అదనంగా రోజుకు పావు లీటరు నుంచి ముప్పావు లీటరు నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటుండటం గమనార్హం. అలాగే సోడియం 78-235 మిల్లీగ్రాములు, చక్కెర 5-17 గ్రాములు, కొలెస్ట్రాల్ 7-21 మిల్లీగ్రాములు తక్కువగా తీసుకుంటున్నట్టూ బయటపడింది. దీనికి కారణం లేకపోలేదు. అదనంగా తీసుకునే నీటితో కడుపు నిండిన భావన కలుగుతుంది.
తినేటప్పుడు నీరు అధికంగా తాగినట్లయితే ఎక్కువెక్కువగా తినటం తగ్గటమే కాదు.. కేలరీలు అధికంగా ఉండే తీపి పానీయాలు తాగటమూ తగ్గుతుంది. కేలరీలు, చక్కెర, కొవ్వులు తీసుకోవటం తగ్గితే బరువూ అదుపులో ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే, మూత్ర విసర్జన అనంతరం.. ఇలా వీలైనప్పుడల్లా ఒక గ్లాసు నీరు తాగటం అలవాటు చేసుకుంటే బరువు తగ్గటంతో పాటు ఇతరత్రా సమస్యలనూ నివారించుకునే వీలుంటుంది.
ఇదీ చదవండి: బాపూజీ స్వహస్తాలతో లిఖించిన లేఖ వేలం