ETV Bharat / sukhibhava

ఇంట్లో వ్యాయామం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కరోనా లాక్​డౌన్​తో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో చాలామంది ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నారు. ఇలాంటి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా!

Don't get injure at home workout
ఇంట్లో వ్యాయామం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
author img

By

Published : Apr 24, 2020, 10:03 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

లాక్​డౌన్​ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చాాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇంటి దగ్గర చేసే వ్యాయామాలు వల్ల గాయపడే ప్రమాదం ఎక్కువ ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

బార్బెల్​ బాస్​ వ్యవస్థాపకుడు, జాతీయ వెయిట్​ లిఫ్టర్​, వ్యాయామ నిపుణుడు ప్రదీప్​ మౌర్య సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం..

అనువైన స్థలం

వ్యాయామం చేసేందుకు మీరు ఎంచుకునే స్థలం అనుకూలంగా ఉండాలి. ఇందుకు మీరు ఎంచుకున్న గది, అంతస్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పరిసరాలు ఇరుకుగా ఉండకూడదు. అక్కడ పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు, ఫర్నిచర్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.

పరిమితులు తెలుసుకోవాలి

వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం నుంచి వచ్చే కొన్ని సంకేతాలను తప్పక గమనించాలి. అలా ఎందుకు జరుగుతుందో గుర్తించాలి. దీని వల్ల మీరు మీ శరీరానికి తగ్గట్టు వ్యాయామం చేస్తున్నారా లేదా మోతాదు పెంచుతున్నారా అనేది తెలుస్తుంది. మీ సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం అంత మంచిది కాదు. అందుకు కచ్చితంగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఒక్కొక్కరి శరీరతత్వం వేరువేరుగా ఉంటుంది. అందువల్ల మన శరీరానికి తగ్గట్టు వ్యాయామం చేయాలి.

తగినంత వార్మ్ అప్ చేయాలి

కండరాలు ధృడంగా ఉండటం వల్ల గాయాలు అధికంగా అవుతాయి. అందుకు తగిన వార్మ్​ అప్​ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీని వల్ల గాయాలపాలయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఎంత ఎక్కువ వార్మ్​ అప్​ చేస్తే అంత మంచిది. అందుకు వీలైనంత ఎక్కువగా వార్మ్ అప్​ చేస్తూ ఉండండి. ఇందుకు నిపుణులు సూచించే పలు బర్పీలు చేయండి.

వర్క్ అవుట్స్​

ప్రతి రోజూ వర్క్​ అవుట్స్ చేయడం సులభమే. కానీ ప్రస్తుత లాక్​డౌన్​ వల్ల నిపుణులు అందుబాటులో ఉండరు కాబట్టి మీ శరీరం సామర్థ్యాన్ని బట్టి వర్క్​ అవుట్స్​ చేయాలి. ఏ స్థాయి వరకు మీరు కష్టమైన వర్క్​ అవుట్స్ చేయగలరో గుర్తించండి. మీకు ఈ సమయంలో కష్టంగా అనిపించే వాటిని బలవంతంగా చేయకుండా వాటి ప్రత్యమ్నాయంగా వేరే వాటిని ఎంచుకోండి. కొంతమందికి రెగ్యులర్ పుష్​ అప్స్​ కష్టంగా అనిపిస్తాయి. అలాంటి వారు వాల్ పుష్​ అప్స్​, మోకాలి పుష్​ అప్స్​ సాధన చేయొచ్చు.

సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం

వ్యాయామం అనేది ఎల్లప్పుడూ సరైన పద్ధతిలో చేయాలి. కరెక్టుగా చేయడం వస్తేనే కొత్త పద్ధతులు ప్రారంభించాలి. కొత్త కొత్త వ్యాయామాలు అనుసరించాలి అనుకుంటే ఆన్​లైన్​ తరగతుల ద్వారా శిక్షకుడి పర్యవేక్షణలో తెలుసుకోండి.

మధ్యమధ్యలో నీరు తాగుతూ ఉండండి

వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట అధికంగా వస్తుంది. దీని వల్ల మన శరీరంలో కొన్ని ముఖ్యమైన లవణాలు చెమటతో పాటు బయటకు వచ్చేస్తాయి. అందువల్ల వ్యాయామం ప్రారంభానికి ముందు గ్లాసు నీరు తప్పక తాగాలి. ఆపై వ్యాయామం చేస్తున్నంత సమయం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నీరు తాగుతూ ఉండాలి. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం చేకూరుతుంది.

ఇష్టపడి చేయడమే అన్నింటికన్నా ప్రధానం

ఏ పని చేసినా దాన్ని ఇష్టపడి చేస్తేనే వంద శాతం ఫలితం దక్కుతుంది. వ్యాయామంలోనూ అంతే అన్నింటి కన్నా ముఖ్యంగా మీరు చేసే వ్యాయామం ఏదైనా సరే దాన్ని ఆస్వాదిస్తూ చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల చేస్తున్న పనిపై మీకు ఆసక్తి పెరుగుతుంది. అందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేసినా మనస్ఫూర్తిగా చేయండి.

ఇదీ చదవండి: జాతీయ రహదారులపై 'వడ్డనలు' షురూ

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.