ETV Bharat / sukhibhava

హెపటైటిస్​తో లివర్​కు ముప్పు​.. జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే!

కాలేయం.. శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఈ అవయవానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్ వైరస్​లు. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది హెపటైటిస్ వల్ల చనిపోతున్నారు. వ్యాధి బారినపడ్డవారిలో నూటికి 70 మందికి వ్యాధి సోకిన విషయం తెలియకపోవడమే పెద్ద సమస్యగా మారింది. అందుకే హెపటైటిస్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

liver
కాలేయం
author img

By

Published : Jul 26, 2022, 7:24 AM IST

కాలేయానికి ప్రధాన శత్రువులు హెపటైటిస్‌ వైరస్‌లు. వీటిల్లో ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలున్నాయి. హెపటైటిస్‌ ఎ, ఇ ఇన్‌ఫెక్షన్లు చాలావరకు వాటంతటవే తగ్గిపోతాయి. మామూలు కామెర్లు వీటితో వచ్చేవే. కానీ బి, సి వైరస్‌లు ప్రమాదకరమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా 30 లక్షల మంది హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండగా.. 11 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే- హెపటైటిస్‌ బారినపడ్డవారిలో నూటికి 70 మందికి ఆ విషయమే తెలియకపోవటం. జబ్బు బాగా ముదిరిన తర్వాతే బయట పడటం. ఈ నేపథ్యంలో హెపటైటిస్‌పై అవగాహన కలిగుండటం మంచిది.

హెపటైటిస్‌ ఎ: దీని బారినపడ్డవారిలో జ్వరం, అస్వస్థత, ఆకలి లేకపోవటం, విరేచనాలు, వికారం, కడుపులో ఇబ్బంది, మూత్రం ముదురు రంగులో రావటం.. చర్మం, కళ్లు పసుపురంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హెపటైటిస్‌ మళ్లీ తిరగబెట్టొచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో నివసించేవారికి, సురక్షిత నీరు అందుబాటులో లేనివారికి, హెపటైటిస్‌ ఎ ఇన్‌ఫెక్షన్‌ గలవారితో జీవించేవారికి, స్వలింగ సంపర్కులకు దీని ముప్పు ఎక్కువ.

హెపైటిస్‌ బి: దీని బారినపడ్డవారిలో మొదట్లో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. కొందరిలో కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపించొచ్చు. అక్యూట్‌ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పోషకాహారం, తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. వాంతులు, తీవ్రమైన నిస్సత్తువ, ఆకలి లేకపోవటం వంటివి గలవారికి రక్తనాళం ద్వారా ద్రవాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోనే 99.5% మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమస్య తగ్గుతుంది. దాదాపు 90% మందిలో వైరస్‌ కూడా దానంతటదే తొలగిపోతుంది. అయితే కొందరిలో దీర్ఘకాల (క్రానిక్‌) సమస్యగా మారొచ్చు. ఇన్‌ఫెక్షన్‌ ఆరు నెలల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్‌ హెపటైటిస్‌ బిగా భావిస్తారు. వైరస్‌ నిద్రాణంగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వీరి నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదముంది.

హెపటైటిస్‌ సి: తొలిదశలో అంతగా లక్షణాలేవీ ఉండవు. హెపటైటిస్‌ బిలో మాదిరిగానే ఫ్లూ జ్వర లక్షణాలు, అలసట, వికారం, కామెర్ల లక్షణాలు, కీళ్ల నొప్పులు, ఆందోళన, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం వంటివి ఉండొచ్చు. ఇది చాలామందిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. కొందరిలో ఐదేళ్లలోనే కాలేయ సమస్యలు తలెత్తొచ్చు. కొందరికి కాలేయం గట్టి పడటం వంటి తీవ్ర సమస్యలు తలెత్తటానికి 20 ఏళ్లకు పైగా పట్టొచ్చు కూడా. హెపటైటిస్‌ సితో హెపటైటిస్‌ బి కూడా ఉండటం, మద్యం అలవాటు, ఊబకాయం వంటివి సమస్య త్వరగా ముదిరేలా చేస్తాయి. దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టయితే కాలేయ పనితీరు, వైరస్‌ ఉపరకాలను తెలిపే పరీక్షలు అవసరమవుతాయి. వైరస్‌ ఉపరకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

హెపైటిస్‌ డి: ఇది హెపటైటిస్‌ బి వైరస్‌ ఉన్నప్పుడే వృద్ధి చెందుతుంది. చాలావరకు ఈ రెండు ఇన్‌ఫెక్షన్లు కలిసే ఉంటాయి. చాలామంది దీన్నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఇది ప్రధానంగా కాన్పు ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుంది. హెపటైటిస్‌ బి మాదిరిగానే ఇన్‌ఫెక్షన్‌ గలవారితో లైంగిక సంపర్కం, శరీర స్రావాలు, ఒకరు వాడిని సూదులను మరొకరకు వాడటం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది.

హెపటైటిస్‌ ఇ: ఈ ఇన్‌ఫెక్షన్‌ గలవారి మలంతో కలుషితమైన నీటితో వైరస్‌ వ్యాపిస్తుంది. మొదట్లో కొద్దిగా జ్వరం, ఆకలి తగ్గటం, వికారం, వాంతి వంటివి కనిపిస్తాయి. కొందరికి కడుపునొప్పి, దురద, దద్దు, కీళ్ల నొప్పులూ తలెత్తొచ్చు. క్రమంగా చర్మం, కళ్లు, మూత్రం పచ్చ బడుతుంటాయి. మలం తెల్లగా వస్తుంది. కొద్దిగా కాలేయం ఉబ్బొచ్చు. హెపటైటిస్‌ ఇ ఇన్‌ఫెక్షన్‌ చాలావరకు 2-6 వారాల్లో అదే తగ్గిపోతుంది. అరుదుగా తీవ్రం కావొచ్చు.

నివారణ ముఖ్యం

  • కలుషిత ఆహారం, నీటికి దూరంగా ఉంటే హెపటైటిస్‌ ఎ, ఇ సోకకుండా చూసుకోవచ్చు.
  • హెపటైటిస్‌ బి గలవారి రక్తం, శారీరక స్రావాల ద్వారా వైరస్‌ సోకుతుంది. కాబట్టి అసురక్షిత శృంగారానికి దూరంగా ఉండాలి. ఇతరులు ఉపయోగించిన సూదులు, ఇంజెక్షన్లు, బ్లేడ్లు, టూత్‌బ్రష్షుల వంటివి వాడుకోకూడదు. హెపటైటిస్‌ బికి టీకా అందుబాటులో ఉంది. దీని నివారణకు ఇదే అత్యుత్తమ మార్గం.
  • హెపటైటిస్‌ సి ప్రధానంగా రక్తం ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి రక్తమార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల బ్లేడ్లు, బ్రష్షుల వటివి వాడుకోవద్దు. పచ్చబొట్లు పొడిచేందుకు, చెవులు, శరీర భాగాలు కుట్టేందుకు ఉపయోగించే సూదులు, పరికరాలు ఒకరికి వాడినవి మరొకరికి వాడకూడదు.

ఇవీ చదవండి: పొట్ట కొవ్వు తగ్గేదెలా? ఏం తినాలి? ఏం తినకూడదు?

శృంగార కోరికలు ఎవరికి ఎక్కువ?.. ఏ వయసులో సెక్స్ చేస్తే మేలు?

మీ పిల్లల్ని తరచూ తలనొప్పి వేధిస్తుందా.. చెక్​ పెట్టేయండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.