ETV Bharat / sukhibhava

మీ పిల్లలు ఏడ్చినప్పుడు చాక్లెట్స్ కొనిపిస్తున్నారా? - అయితే వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నట్టే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 2:57 PM IST

Chocolates Disadvantages : మీ పిల్లలు ఏడ్చినప్పుడు లేదా బయటికి వెళ్లినప్పుడు ఇబ్బంది పెడితే చాక్లెట్స్ ఇప్పిస్తున్నారా? అయితే ఈ విషయాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. అది అప్పటివరకు వారిని ఒప్పించడానికి బాగానే ఉన్నా.. తర్వాత వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలకు ఉన్న చాక్లెట్స్ తినే అలవాటును ఈజీగా ఇలా మాన్పించండి.

Chocolates
Chocolates

Do You Giving Chocolates for Children : సాధారణంగా చాక్లెట్స్ వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తింటుంటారు. ముఖ్యంగా వీటిని చిన్నపిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. ఇకపోతే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడ్చినప్పుడు లేదా ఇబ్బంది పెట్టినప్పుడు వారిని సముదాయించడం కోసం ఎక్కువగా చాక్లెట్స్(Chocolates) ఇప్పిస్తుంటారు. అలాగే బయటకి వెళ్లినప్పుడు రోడ్డు మీద ఏదైనా తినేది కనిపించగానే దానిని కొనియమని మారాం చేస్తుంటారు. ఇక కొందరైతే వారు కోరుకున్నది ఇప్పించినదాకా.. ఒక్కరాగాన ఏడుపు ఆపరు. ఈ క్రమంలో చాలా మంది పేరెంట్స్ వారిని ఒప్పించడానికి పిల్లలకు ఎక్కువగా చాక్లెట్స్, చిప్స్ లాంటివి కొనిస్తుంటారు.

Chocolates Disadvantages : అయితే ఇక్కడ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇలా మీరు పిల్లలు ఇబ్బందిపెట్టినప్పుడల్లా చాక్లెట్స్ ఇప్పించడం ద్వారా ఓ చెడు అలవాటును వారికి నేర్పిస్తున్నారని గుర్తుంచుకోవాలి. తరచుగా మీరు అవి కొనిపించడం వల్ల తర్వాత కొన్ని రోజులకూ చాక్లెట్స్ ఇప్పించాలంటారు. అయితే అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అప్పటివరకు చిన్నారులు ఏడవకుండా ఆపవచ్చేమో కానీ, తర్వాత వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చిరుతిళ్లు తినడం అలవాటయితే సరైన పోషకాహారాన్ని దూరంగా ఉంటూ బలహీనంగా తయారవుతారు. ఇకపోతే.. మీ పిల్లలు బయటకు వెళ్లినప్పుడు చాక్లెట్స్​, కేకులు, ఫాస్ట్​పుడ్ కావాలని ఇబ్బంది పెడుతున్నారా? ఈ చెడు అలావాటును ఎలా దూరం చేయాలని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసం పిల్లలను ఈజీగా చాక్లెట్స్ తినడం మాన్పించే కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చలికాలంలో పిల్లలకు ఏ ఆహారం మంచిది?

మీ పిల్లలు ఇలా చేస్తుంటే ముందు పేరెంట్స్ కొన్ని సానుకూల మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిని వారు చూస్తుంటారు. అలాగే దానిని ఫాలో అవుతుంటారు. కాబట్టి ముందు తల్లిదండ్రులు పిల్లల ముందు చాక్లెట్స్, ఐస్​క్రీ తినడం లాంటివి చేయకూడదు. అలాగే పిల్లలు ఏడుస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో చాక్లెట్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ పుడ్ వంటివి కొనిపించే ప్రయత్నం చేయకూడదు. దానికి బదులు ఏవైనా మంచి ఆరోగ్యకరమైన పండ్లు ఇప్పించాలి. అలాగే వారు తీసుకునే ఫుడ్​లో ఆకుకూరలు, పప్పులు, వివిధ పండ్లు వంటి పౌష్టికాహారంతో కూడిన వాటిని చేర్చాలి. ఇలా చేయడం ద్వారా వారి శారీరక, మానసిక ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది.

ఇకపోతే చాక్లెట్స్ తినడం ద్వారా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అవి వారికి వివరించాలి. ముఖ్యంగా వాటిని తింటే కలిగే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి పిల్లలకు తెలియజేయాలి. అవసరమైతే దానికి సంబంధించిన విషయాలను వీడియో రూపంలో చూపించండి. ఎందుకంటే చెప్పినదానికంటే చూసినది ఎక్కువగా గుర్తు ఉంటుంది. అలాగే చాక్లెట్స్ తింటే అవి దంతాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని.. ఫ్యూచర్​లో దంతక్షయం లాంటి సమస్యలు వస్తాయని చెప్పండి. వీటిని తినడం కారణంగా నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుందని వారికి చెప్పాలి. అదేవిధంగా చాక్లెట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి.. బరువు పెరుగుతారు. కాబట్టి మీ పిల్లలకు ఇప్పటినుంచైనా ఏడ్చినప్పుడు చాక్లెట్స్ ఇప్పించడం మానేయండి.

CHOCOLATES : చాక్లెట్లు తింటే ముడతలు రావట!

చలికాలంలో అనేక ఆరోగ్య సమస్యలు- ఈ జాగ్రత్తలతో చెక్​ పెట్టండిలా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.