Diabetes Problems On Foots: చిన్న వయసు వారి నుంచి పెద్దల వరకూ మధుమేహం సమస్య అందరికీ సాధారణమైపోయింది. ఈ వ్యాధి ఉన్నవారి పాదాలకు వచ్చే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో చూద్దాం.
మధుమేహం(షుగర్) ఉందని తెలిస్తే వెంటనే అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటిలో నరాల బలహీనత ప్రధాన సమస్య. షుగర్ అధికమైతే అరికాలుతో పాటు అరచేతిలో మంటలు వస్తాయి.. తిమ్మిర్లు అధికమవుతాయి. పాదాల నుంచి మొదలుకొని కాళ్లలోకి, ఆ పైభాగానికి తిమ్మిర్లు వ్యాపిస్తాయి. దీర్ఘకాలికంగా మూత్రపిండాలు విఫలమై డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటితోపాటు కళ్లపై, గుండెపై కూడా మధుమేహం ప్రభావం పడుతుంది. గాయాలు తగిలనపుడు నిర్లక్ష్యం వహిస్తే అవి మానకపోగా.. చివరకు కాళ్లు, వేళ్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జాగ్రత్తలు:
- సాధారణ మధుమేహ పరీక్షలో షుగర్ స్థాయి 180 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.
- మూడు నెలలకు ఒకసారి చేసే హెచ్‌బీఏ1సీ పరీక్షలో షుగర్ 7 కంటే తక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి
- నరాల్లో ఉండే మైలిన్ షీత్ తగ్గడం వల్ల నరాల బలహీనత లాంటివి అధికమవుతాయి. విటమిన్ బీ12 తీసుకుంటే ఈ సమస్య అదుపులోకి వస్తుంది.
- చెప్పులు ఎల్లప్పుడు వేసుకోని తిరగాలి.
- గాయాలు తగిలినపుడు జాగ్రత్తగా ఉండాలి.
నరాల బలహీనత పెరిగి.. నొప్పులు అధికమైతే వెంటనే డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు స్వీకరించాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: మతిమరుపు సమస్యా? ఈ చిట్కాలు ట్రై చేయండి!