ETV Bharat / sukhibhava

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే సెట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2023, 7:53 AM IST

Dark Circles Under Eyes : జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా కొంతమందికి కళ్ల కింద నల్లని వలయాలు(డార్క్​ సర్కిల్స్​) వస్తున్నాయి. మరికొంతమందికి కళ్ల కింద ఉబ్బినట్లుగా ఉంటాయి. అయితే ఈ డార్క్​ సర్కిల్స్​​ ఎందువల్ల ఏర్పడతాయి? వాటిని అతి సులభంగా ఏ విధంగా నివారించుకోవచ్చు? అనే వివరాలు మీ కోసం.

how to remove dark circles under eyes
natural way to cure dark circles

Dark Circles Under Eyes : ఉరుకుల పరుగుల జీవనంలో వ్యక్తిగత అందాన్ని గురించి మర్చిపోతున్నాం. జీవనశైలిలో మార్పుల కారణంగా కొంతమంది కళ్ల కింద నల్లటి వలయాలు(డార్క్ సర్కిల్స్) వస్తున్నాయి. మరికొంతమందికి కళ్ల కింద ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యతో మీరూ చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సింపుల్ హోమ్ రెమిడీస్​తో వాటి నుంచి ఉపశమనం పొందండి.

అదే ప్రధాన కారణం!
కళ్ల కింద నల్లని వలయాలు(డార్క్ సర్కిల్స్) ఏర్పడటానికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన్యుసంబంధమైన కారణాలు, నిద్రలేమి, ఒత్తిడి వంటివి కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ రావడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. కళ్ల కింద నల్లని వలయాల నుంచి ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర
మన సౌందర్యంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తగిన నిద్ర ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం. రోజుకు సుమారు 7-9 గంటల నిద్ర తప్పనిసరి అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల సమయానికి నిద్రించండి. దీనివల్ల మీరు కంటి వలయాల సమస్య నుంచి కొంత వరకు బయట పడవచ్చు.

ఆహారం
మీరు తీసుకునే ఆహారంలో పళ్లు, కూరగాయలు, విటమిన్-సి, ఐరన్​ లాంటి పోషకాలు చాలా అవసరం. దీనినే సమతుల్య ఆహారం అంటారు. తద్వారా మీరు కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​ నుంచి ఉపశమనం పొందటం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు.

క్రీమ్స్​
కళ్ల కింద నల్లని వలయాలు(డార్క్ సర్కిల్స్) నుంచి విముక్తి పొందటానికి మార్కెట్​లో కొన్నిరకాల క్రీములు విక్రయిస్తుంటారు. ముఖ్యంగా విటమిన్ కె, రెటినాల్​, పెప్టిసైడ్స్ మీ కంటి చర్మానికి మరింత అందాన్ని ఇస్తాయి. దీంతో పాటు దోసకాయ ముక్కలను కనుబొమ్మలపై పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.

అలెర్జీకి మందులు
అలెర్జీలు కూడా డార్క్ ​సర్కిల్స్​కు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి తగిన మందుల ద్వారా నివారించండి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన విధానాలు పాటించడం ద్వారా చాలా సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఇంటి చిట్కాలు
మన వంటింట్లో ఉండేటువంటి బంగాళదుంపను పలుచని ముక్కలుగా కట్​ చేసి, వాటిని కాసేపు కనుబొమ్మలపై ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఆల్మండ్ ఆయిల్ లాంటి కొన్ని సహజమైన పదార్థాల ద్వారా డార్క్​ సర్కిల్స్​ను నివారించుకోవచ్చు. పైన వివరించినవన్నీ అతి సులభమైన పద్ధతులు. వీటన్నింటినీ పాటించడం ద్వారా మీ కళ్ల కింద ఉన్న నల్లని వలయాలు కొద్ది రోజుల్లోనే మటు మాయం అవుతాయి!

Health Benefits Of Honey : 'తేనె'తో ఎన్నో లాభాలు.. చిన్న పిల్లలు, షుగర్ ఉన్నవాళ్లు తీసుకోవచ్చా?

Pimples Removal Tips : మొటిమల సమస్యా?.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.