ETV Bharat / sukhibhava

చుండ్రు సమస్య వేధిస్తుందా? డాక్టర్లు చెప్పే ఈ చిట్కాలతో చెక్! - salicylic acid for dandruff

Dandruff Treatment: సీజన్​ మారుతున్న కొద్దీ.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ వల్ల చుండ్రు సమస్య తలెత్తడం సహజం. మరికొందరిని సీజన్​తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంది. మరి దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? ఎలాంటి చికిత్స అవసరం? తెలుసుకోండి.

Dandruff problem in the head Doctors treatment

author img

By

Published : Jun 29, 2022, 4:10 PM IST

Dandruff Treatment: వర్షాకాలంలో తరచూ మీ జుట్టు తడుస్తుంటుంది. అలాంటప్పుడు ఆ నెత్తిని సరిగా శుభ్రం చేసుకోకుంటే.. చాలా సమస్యలు తలెత్తుతాయి. వాటిల్లో చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, శరీరంలో హార్మోన్ల స్థాయులు, ఆయిల్​ ఫుడ్​ వంటివి వీటికి కారణమవుతాయి. చుండ్రు జిగటలా ఏర్పడితే.. అది జుట్టు రాలిపోవడం, నిర్జీవంగా మారిపోవడం వంటి పరిణామాలకు దారితీస్తుంది. కొందరు ఇది తగ్గించుకోవడానికి లైట్​ గ్లైకోలిక్​ యాసిడ్​ పిల్స్​, రకరకాల షాంపూలు వాడుతుంటారు. అయినా పరిష్కారం లభించదు. మరి దీనిపై డాక్టర్లు ఏమంటున్నారో చూడండి.

చుండ్రు సమస్యకు వైద్యుల పరిష్కారం
జుట్టు, ముఖం​ వంటివి చుండ్రు చేరి జిడ్డుగా మారాయంటే.. దానికి కారణం సెబోరిక్​ డర్మటైటిస్​ అని చెబుతున్నారు వైద్యులు. శరీరంలో ఆయిల్​, ఫంగస్​ ఎక్కువ కావడం వల్ల డెడ్​ స్కిన్​ ఏర్పడి.. చుండ్రు వస్తుందని అంటున్నారు. దీనికి కొన్ని రకాల షాంపూలు, ఓరల్​ ట్యాబ్లెట్లతో పరిష్కారం లభిస్తుందని వివరిస్తున్నారు.

''క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఆయిల్​ ఫుడ్​ తగ్గించుకోవాలి. వీటికి అదనంగా ఓవర్​నైట్​ యాంటీఫంగల్​ లోషన్స్​ ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు రోజువారీగా లేదా.. రోజువిడిచి రోజు వాడాల్సి ఉంటుంది. ఇంకా.. కోల్​ థార్​ యాసిడ్​, సాల్సిలిక్​ యాసిడ్​, జింక్​ పైరిథ్రోన్​ షాంపూలు చుండ్రును తగ్గిస్తాయి. వీటిని మాడుకు 5-10 నిమిషాల సేపు ఉంచి తలస్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తగ్గకుంటే ఓరల్ యాంటీ ఫంగల్స్, ఓరల్​ ట్యాబ్లెట్స్​ ఉంటాయి. మొహం మీద జిడ్డు తగ్గడానికి కూడా ఈ ట్యాబ్లెట్లు వాడొచ్చు. అసిలిక్​ యాసిడ్​తో మొహం మెరుస్తుంది.''

- డాక్టర్ స్వప్న ప్రియ, డెర్మటాలజిస్ట్

ఇవీ చూడండి: జుట్టు, చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేద చిట్కాలు

ఇవి పాటిస్తే జుట్టుకు ఉండదు ఏ ఢోకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.