ETV Bharat / sukhibhava

స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, బ్ల‌డ్ షుగ‌ర్ నియంత్రణ! క‌రివేపాకుతో ప్ర‌యోజ‌నాలెన్నో - కరివేపాకు ఉపయోగాలు ఏంటి

Curry Leaves Benefits in Telugu : క‌రివేపాకు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. సాధార‌ణంగా దీన్ని కూర‌ల్లో రుచి కోసం వాడ‌తారు. కానీ దీన్ని తిన‌టం వ‌ల్ల ఇంకా అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

curry leaves benefits in telugu
curry leaves benefits in telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 8:01 AM IST

Curry Leaves Benefits in Telugu : భార‌తీయ వంట‌కాల్లో క‌రివేపాకుకు ఉన్న ప్రాధాన్యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ముఖ్యంగా మ‌న సౌత్ఇండియాలో దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఇవి సిట్రస్ ఫ్లేవర్​ను క‌లిగి ఉండి రుచిని పెంచుతాయి. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా వాడ‌తారు. బీటా-కెరోటిన్, విటమిన్ - సి వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

ఆరోగ్య నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టడంలో సహాయపడతాయి. శరీర కణాలకు పోషణ అందించ‌డ‌మే కాకుండా టైప్ -2 డయాబెటిస్‌ను నివారిస్తాయి. కరివేపాకులో పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవి జీర్ణ క్రియ‌ను నెమ్మ‌దింప‌చేస్తాయి. అదే స‌మ‌యంలో రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తాయి. ఇన్సులిన్ చర్యను అనుకరించే ఫైటోకెమికల్స్ కూడా వీటిల్లో ఉంటాయి.

కరివేపాకు రోటీ.. గర్భిణీల అమృతాహారం

DiePharmazie అనే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్ర‌చురిత‌మైన ఒక అధ్య‌య‌నం ప్రకారం కరివేపాకులో యాంటీ-హైపర్ గ్లైస‌మిక్ లక్షణాలున్నాయి. ఇవి ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయుల్ని నియంత్రించ‌డంలో బాగా ప‌నిచేస్తాయ‌ని తేలింది. దీనికోసం వివిధ మోతాదుల (5, 10, 15 శాతం) క‌రివేపాకుతో కూడిన ప‌దార్థాలు తిన్న ఎలుక‌ల‌పై శాస్త్రవేత్త‌లు ప‌రీక్ష‌లు చేశారు.

మీరు వంటల్లో వాడుతున్న పసుపు కల్తీ కావొచ్చు - ఇప్పుడే చెక్ చేసుకోండిలా!

ఆరోగ్య‌క‌ర‌మైన ఎలుక‌లకు ఏడురోజులు, ర‌క్తంలో 175 mg/dl కంటే తక్కువ గ్లూకోజ్ స్థాయిలు కలిగిన డ‌యాబెటిక్ ఎలుక‌ల‌కు అయిదు వారాల పాటు ఆ ప‌దార్థాల్ని పెట్టారు. అప్పుడు వాటిల్లో హైపర్ గ్లైస‌మిక్, యాంటీ-హైపర్ గ్లైస‌మిక్ ల‌క్ష‌ణాల్లో తేడా క‌నిపించింది. అందులో తేలిన విష‌యం ఏంటంటే సాధారణ ఎలుకల్లో, రక్తంలోని గ్లూకోజ్ స్థాయుల్లో పెద్దగా మార్పు లేదు కానీ, డయాబెటిక్ ఉన్న ఎలుక‌ల‌ రక్తంలో చక్కెర స్థాయులు గ‌రిష్ఠంగా 13.1, 16.3, 21.4 శాతం త‌గ్గాయి.

  • కరివేపాకును ఇలా తీసుకోవ‌చ్చు!
  • కరివేపాకు ఆకులు ఒక ర‌క‌మైన చేదు, ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. అయినా కూడా వాటిని వివిధ మార్గాల ద్వారా రోజూ మీ దిన చ‌ర్య‌లో చేర్చుకోవ‌చ్చు.
  • ఉదయం టీ లేదా కాఫీకి ముందు కొన్ని ఆకులను తీసుకుని వాటిని నమలండి.
  • వాటిలోని చేదును పోగొట్టడానికి ఆకుల్ని బ్లెండర్‌లో కొద్దిగా నీరు, ఉప్పు క‌లిపి గ్రైండ్ చేయండి.
  • వంట‌ల్లో రుచి పెంచ‌డానికి కరివేపాకులను పొడి చేసి అందులో వేయొచ్చు.
  • కరివేపాకులను వేడినీటిలో 3-4 నిమిషాలు ఉంచి టీ తయారు చేసి తీసుకోవ‌చ్చు.

ఎలా త‌యారు చేయాలి?
ఒక పాత్ర‌లో కొంచెం నీరు తీసుకుని, అందులో తాజా క‌రివేపాకు రెబ్బ‌లు, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి 5-6 నిమిషాలు మ‌రగ‌నివ్వండి. తర్వాత మంట ఆర్పేసి ఆ మొత్తం మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టండి. దానికి ఒక చుక్క నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలపండి. అయితే.. ఈ రసాన్ని ఎప్పుడూ వేడిగా ఉన్నప్పుడే తాగాలి.

నోట్ :
పైన పేర్కొన్న చిట్కాలు, సూచనలు పాటించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు మీ వైద్యుడ్ని లేదా డైటీషియన్‌ను సంప్రదించండి.

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.