Health Benefits Of Curry Leaves : భారతీయుల వంటింట్లో ఉండే అనేక పదార్థాల్లో కరివేపాకు ఒకటి. ప్రాంతాలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా దాదాపుగా అందరూ దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇది వంటలకు అదనపు రుచిని కలిగిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ధరకే లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగానే దొరకుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కరివేపాకును తమ వంటల్లో వాడతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజువారీ వంటల్లోనే కాకుండా పండగలప్పుడు చేసే గారెలు వంటి పలు రకాల పిండి వంటకాల్లోనూ ఉపయోగిస్తారు.
Curry leaves medicinal uses : చాలా మంది కరివేపాకు లేకుండా వంట గదిని అసంపూర్ణంగా పరిగణిస్తారు. భారతీయ వంటల్లో అదనపు రుచుల కోసం దీన్ని వాడతారు. ఇది మన దేశంతో పాటు శ్రీలంక, ఆగ్నేసియా దేశాల్లో లభిస్తుంది. ఇవి వంటల్లో సుగంధ రుచులను మెరుగు పర్చడమే కాకుండా.. భోజనంలో పోషక విలువలను సైతం పెంచుతాయి. కరివేపాకులో ఆల్కలాయిడ్లు, గ్లైకో సైడ్లు, ఫినోలిక్ కంపౌడ్లు పుష్కలంగా ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకి 8 నుంచి 10 తాజా కరివేపాకులు తినవచ్చు.
Curry leaves benefits and side effects : దీన్ని ఆయా కూరల్లో వాడటం మాత్రమే కాకుండా పొడిగా చేసి కూడా తింటారు. జుట్టు సంబంధిత సమస్యల నివారణకు కరివేపాకును వాడతారు. ముఖ్యంగా మహిళలు వీటి ఆకుల్ని గోరింటాకులా చేసుకుని జుట్టుకు అప్లై చేసుకుంటారు. తెల్ల వెంట్రుకలు ఉన్నవారు కూడా జుట్టు రంగు మారటం కోసం వాడతారు. ఇలాంటి కరివేపాకు ఉపయోగించడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి, ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
1. లాభాలు
curry leaves uses :
- కరివేపాకు రసం యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావాల్ని కలిగి ఉంటుందని అనేక అధ్యయానాలు పేర్కొన్నాయి.
- కరివేపాకు రసం కొలెస్ట్రాల్ స్థాయుల్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది.
- కరివేపాకు తినటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
- అల్జీమర్స్ వ్యాధి లాంటి న్యూరో డీజెనెరేటివ్ పరిస్థితుల నుంచి కాపాడే పదార్థాలు ఇందులో ఉన్నాయి.
- ఇందులో ముఖ్యమైన యాంటీ క్యాన్సర్ సమ్మేళనాలున్నాయి.
- కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి ఉపశమనం కలిగించే ప్రభావాలు సైతం ఉన్నాయి. అయితే వీటిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరముంది.
2. నష్టాలు
Curry leaves side effects :
- అలెర్జీ ఉన్న వాళ్లు కరివేపాకును వాడకపోవడం మంచిది.
- గర్భిణులు, బాలింతలు కరివేపాకు తినే విషయంలో వైద్యుల్ని సంప్రదించాలి.
- కరివేపాకు కాయలు విషపూరితమైనవి. కనుక వాటికి దూరంగా ఉండాలి.