కరివేపాకులో అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరొటిన్, ఇతర మైక్రో న్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శిరోజాలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. జుట్టు రాలే సమస్య ఉన్నవారు పావులీటరు కొబ్బరినూనెలో చెంచా మెంతులు, శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు రెండు కప్పులు, ఐదారు మందార పూలు వేసి మరగనివ్వాలి. అది సగం అయ్యాక తీసి చల్లార్చి సీసాలో భద్రపరుచుకుని తరచూ వాడుతుంటే ఫలితం ఉంటుంది.
- కరివేపాకును మెత్తగా నూరి, దానిలో చెంచా ఆలివ్‌నూనె, కప్పు పెరుగు కలిపి తలకు ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాలయ్యాక తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారానికోసారి చేస్తే చుండ్రు సమస్య వదిలిపోతుంది.
- జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు కరివేపాకు హెయిర్‌ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. కప్పు కరివేపాకు పేస్టులో రెండు చెంచాల చొప్పున క్యారెట్, బీట్‌రూట్ గుజ్జు, పావుకప్పు పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసి ముడిపెట్టేయాలి. దీనికి షవర్ క్యాప్ పెట్టి పావుగంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు మృదువుగా నిగనిగలాడుతుంది.
ఇదీ చదవండి: రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే.?