ETV Bharat / sukhibhava

పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది? - buttermilk benefits

Curd Vs Buttermilk: ప్రతి ఒక్కరూ పెరుగు తింటారు. మజ్జిగ తాగేస్తారు. కానీ.. ఈ రెండిటి మధ్య తేడా చాలానే ఉంటుందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు! మరి.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Curd Vs Buttermilk
Curd Vs Buttermilk
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 5:19 PM IST

Curd Vs Buttermilk: పెరుగు, మజ్జిగా.. రెండూ పాల ఉత్పత్తులే. పెరుగులో నీళ్లు కలిపితే తయారయ్యేదే మజ్జిగ. కానీ.. ఈ రెండింటిలో తేడాలు చాలానే ఉన్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు:

  • ప్రోబయోటిక్స్ సమృద్ధిగా: పెరుగు తినడం వల్ల ప్రోబయోటిక్స్ శరీరానికి అందుతాయి. పొట్టలో ఉన్న మంచి బాక్టీరియాకు ఇవి చాలా అవసరం. పొట్టలో మంచి బాక్టీరియా ఉంటేనే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. శరీరం పోషకాలను గ్రహించగలుగుతుంది.
  • ఎముకల ఆరోగ్యం: పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల బలాన్ని, దృఢత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఎముకల సమస్యలు ఉన్నవారు పెరుగును తరచుగా తీసుకోవడం చాలా మంచిది.
  • రోగనిరోధక శక్తి: పెరుగులో ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయి.

వండిన వాటి కంటే పచ్చి ఆహారం మేలైనదా?

  • జీర్ణక్రియ: పెరుగులోని ప్రోబయోటిక్స్.. మలబద్ధకం, అతిసార వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది పోషకాల శోషణను కూడా మెరుగుపరుస్తుంది.
  • గుండె ఆరోగ్యం: పెరుగులో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుదలకు కూడా సహాయపడుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • చర్మ సౌందర్యం: పెరుగులో లాక్టిక్ యాసిడ్.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది ముఖాలపై మచ్చలు, మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది.
  • ఇతర పోషకాలు: పెరుగులో విటమిన్ B12, విటమిన్ D, రిబోఫ్లేవిన్, పొటాషియం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్​ ఫాగ్"​ ఉన్నట్టే!

మజ్జిగ ఆరోగ్య ప్రయోజనాలు:

  • జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: పెరుగు మాదిరిగానే మజ్జిగలో కూడా ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సులభతరం చేసి, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
  • ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మజ్జిగలో కాల్షియం, విటమిన్ D పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి, ఎముకల సమస్యలైన ఆస్టియోపొరోసిస్ నివారించడంలో సహాయపడతాయి.
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మజ్జిగలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

మైక్రో​ ఓవెన్లతో మనుషులకు క్యాన్సర్​ వస్తుందా? - WHO ఏమంటోంది?

శరీరాన్ని చల్లబరుస్తుంది: మజ్జిగ తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే డీహైడ్రేషన్‌ను నివారించడంలోనూ సహాయపడుతుంది.

  • బరువు తగ్గడానికి సహాయపడుతుంది: మజ్జిగ కొవ్వు పరిమాణం తక్కువ, కేలరీలు తక్కువ. అందువల్ల బరువు తగ్గించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దీనిని తాగడం వల్ల కడుపు నిండింది అనే భావన కలుగుతుంది. అనవసరపు ఆకలిని తగ్గిస్తుంది.
  • ఇతర ప్రయోజనాలు: పెరుగు వలె మజ్జిగ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొదిస్తుంది.

ఈ రెండింటిలో ఏది మంచిది: ఆయుర్వేదంలో పెరుగు, మజ్జిగ... రెండింటికీ ఉన్నతమైన స్థానం ఉంది. రెండూ ఆరోగ్యానికి మంచి చేసేవే. అయితే కొన్ని సందర్భాల్లో పెరుగు కన్నా మజ్జిగ మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. జీర్ణవ్యవస్థకు మజ్జిగ అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే అధిక చలిలో పెరుగు తింటే మంచిది. అదే అధిక వేడి వాతావరణంలో మజ్జిగ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పొట్టలో ఇబ్బందులా? - మీ దంతాలే కారణం కావొచ్చని తెలుసా!

చలికాలంలో మలబద్ధకం ఇబ్బందిపెడుతోందా? - ఈ 5 అలవాట్లు మానుకోవాల్సిందే!

విటమిన్ D లోపం వల్లే ఆ సమస్యలు - ఏమైందో అని భయపడుతుంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.