ETV Bharat / sukhibhava

బూస్టర్ డోసు.. మహమ్మారిని ఎదుర్కొనే కొత్త ఆయుధం!

Covid Booster Dose: కొవిడ్‌-19 నియంత్రణలో టీకాల ప్రాధాన్యం ఎనలేనిది. అనతికాలంలోనే రూపుదిద్దుకొని, అందరికీ అందుబాటులోకి రావటం ఒక ఎత్తయితే.. వీటిని తీసుకున్నవారికి జబ్బు తీవ్రం కాకపోవటం, జబ్బు వచ్చినా త్వరగా తగ్గటం మరో విశేషం. కాకపోతే టీకాలతో పుట్టుకొచ్చిన యాంటీబాడీలు 6-9 నెలల్లోనే  తగ్గిపోవటమే కలవరం కలిగిస్తోంది. మరెలా? అని మథన పడుతున్న తరుణంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త (ప్రికాషనరీ) మోతాదుకు అనుమతించటం కొత్త భరోసా కల్పించింది. బూస్టర్‌.. కొవిడ్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు కొత్త ఆయుధంగా తోడ్పడుతుందనటం నిస్సందేహం. అయితే ఈ విషయంపై ఇతర దేశాల అనుభవాలు చెబుతున్న సత్యమిదే.

Corona Booster Dose News
బూస్టర్ డోసు
author img

By

Published : Jan 4, 2022, 10:35 AM IST

Covid Booster Dose: సుదూర పందెంలో పరుగెడుతున్నారు. మధ్యలో కాస్త ఆయాసంగా అనిపించింది. కొద్దిగా వేగం తగ్గింది. అంతలో పక్కనుంచి ఎవరో నీళ్ల సీసా అందించారు. ఒక్క గుటక తాగగానే ప్రాణం లేచి వచ్చింది. వేగం తిరిగి పుంజుకుంది. కొవిడ్‌ జబ్బును ఎదుర్కోవటంలో మనం ఇలాంటి స్థితిలోనే ఉన్నాం. రెండేళ్లుగా సుదీర్ఘంగా పోరాడుతూనే వస్తున్నాం. టీకాల తోడ్పాటుతో ముందుకు దూసుకుపోతున్నాం. ఇప్పుడు బూస్టర్‌ టీకాతో మరింత బలం సంతరించుకోబోతున్నాం. ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నాం కదా. మరి ఇంకో మోతాదు ఎందుకనే అనుమానం రావొచ్చు. టీకాల బలం క్షీణిస్తున్న సమయంలో మరింత అదనపు శక్తిని సంతరించుకోవటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. బూస్టర్‌ టీకా ఉద్దేశమూ ఇదే. సాధారణంగా టీకా తీసుకున్నప్పుడు వ్యాధి కారకాన్ని (యాంటీజెన్‌) ఎదుర్కోవటానికి మన రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను పుట్టిస్తుంది. ఇవి వైరస్‌, బ్యాక్టీరియా వంటి వాటి మీద నేరుగా దాడి చేసి నిర్మూలిస్తాయి. అయితే టీకాలన్నీ ఒకటి కావు. కొన్ని టీకాల ప్రభావం కొద్ది నెలలే ఉండొచ్చు. కొన్ని కొన్నేళ్ల పాటు పనిచేయొచ్చు. కొన్ని జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు హెపటైటిస్‌ బి టీకా ఒకసారి తీసుకుంటే చాలు. జీవితాంతం రక్షణ కల్పిస్తుంది. అదే టెటనస్‌ (టీటీ) టీకా పదేళ్లు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత దీని ప్రభావం తగ్గుతూ వస్తుంది. అందుకే మళ్లీ అదనపు టీకా తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ దీన్ని ఎదుర్కోవటానికి యథాస్థితికి వస్తుంది. పోలియో, రేబిస్‌ వంటి జబ్బులకూ ఇలా బూస్టర్‌ టీకాలు ఇవ్వటం చూస్తూనే ఉన్నాం. కొవిడ్‌-19 ముందుజాగ్రత్త టీకా కూడా ఇలాంటిదే.

బూస్టర్‌ అవసరమా?

ఎలాంటి జబ్బులూ లేని ఆరోగ్యవంతులకు కొవిడ్‌ టీకాలతో మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. అదే రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వృద్ధులకు, స్టిరాయిడ్‌ మందులు వాడేవారికి, క్యాన్సర్‌ చికిత్సలు తీసుకునేవారికి టీకా ఇచ్చినా యాంటీబాడీలు అంతగా పుట్టుకురావు. ఇలాంటివారికి అదనపు మోతాదులు అవసరం. అందుకే చాలాదేశాల్లో ఇప్పటికే కొవిడ్‌ బూస్టర్‌ టీకాలు ఇవ్వటం మొదలెట్టారు. నిజానికి రెండో మోతాదునే ఒకరకంగా బూస్టర్‌ టీకా అనుకోవచ్చు. ఒక మోతాదుతో పూర్తి రక్షణ లభించకపోవటం వల్లనే రెండో మోతాదు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీని ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉండకపోవటం మూలంగానే మూడో మోతాదు ఇవ్వటం మీద దృష్టి సారించారు. కొవిడ్‌ టీకాలతో పుట్టుకొచ్చిన యాంటీబాడీల సంఖ్య వేగంగా క్షీణిస్తూ వస్తోంది మరి. కొవిడ్‌ కారక వైరస్‌ను రోగనిరోధక వ్యవస్థ గుర్తుపెట్టుకునే సామర్థ్యమూ తగ్గుతోంది. చాలామందిలో.. ముఖ్యంగా వృద్ధుల్లో ఇలాంటి ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటోంది. వేగంగా కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఇవి టీకాల ప్రభావాన్ని తట్టుకునే విధంగానూ మారిపోతున్నాయి. కాబట్టే బూస్టర్‌ టీకాల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. ఆ మాటకొస్తే కొవిడ్‌ టీకాల రక్షణ ప్రభావం రెండో దశలోనే బయటపడింది. మనదేశంలో మొదట్లో ముందుగా ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ టీకాలు ఇవ్వటం తెలిసిందే. డెల్టా రకం వైరస్‌ విజృంభించినప్పుడు డాక్టర్లు, నర్సుల్లో చాలా తక్కువ మంది దీని బారినపడటం చూశాం. దీనికి కారణం సహజ ఇన్‌ఫెక్షన్‌తో పాటు టీకాలతో పుట్టుకొచ్చిన రోగనిరోధకశక్తే. బూస్టర్‌ టీకాల ప్రాధాన్యమేంటో ఇది చెప్పకనే చెబుతోంది.

ఎవరికి ఇస్తారు?

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే అరవై ఏళ్లు పైబడ్డవారికి.. అలాగే వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల వంటి వారికి ముందుగా బూస్టర్‌ టీకాలు ఇవ్వనున్నారు. రెండో టీకా తీసుకున్న 9 నెలల (39 వారాలు) తర్వాత బూస్టర్‌ మోతాదు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ 6 నెలల తర్వాత తీసుకోవటమే మంచిది. ఇతర దేశాల్లో ఈ విధానాన్నే పాటిస్తున్నారు. ఎందుకంటే టీకా తీసుకున్నాక పుట్టుకొచ్చిన యాంటీబాడీలు 6 నెలల వరకే ఉంటున్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి ఆర్నెల్ల తర్వాత తీసుకుంటే టీకా మరింత సమర్థంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు.

ఇతర దేశాల అనుభవాలతో

ఇజ్రాయెల్‌, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇప్పటికే బూస్టర్‌ టీకాలు ఇవ్వటం ఆరంభించారు. వీటిని తీసుకున్నవారిలో కొత్తగా ఇన్‌ఫెక్షన్‌ రావటం, ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టటం, ఇన్‌ఫెక్షన్‌తో తలెత్తే దుష్ప్రభావాలు తలెత్తటం తక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం విజృంభిస్తున్న ఒమిక్రాన్‌ రకం వైరస్‌ సోకినవారిలో చాలామందికి పెద్దగా లక్షణాలు ఉండటం లేదన్నది నిజమే అయినా అసలే టీకాలు తీసుకోనివారిలో సమస్య తీవ్రంగా మారుతోంది. టీకాలు తీసుకోనివారికి, తీసుకున్న వారికి.. ఒక మోతాదు తీసుకున్నవారికి, రెండు మోతాదులు తీసుకున్నవారికి.. అలాగే రెండు మోతాదులు తీసుకున్నవారికి, అదనంగా బూస్టర్‌ టీకా తీసుకున్నవారికి మధ్య తేడా చాలా ప్రస్ఫుటంగానే కనిపిస్తోంది.

  • అసలే టీకాలు తీసుకోనివారిలో చాలామందికి సమస్య విషమిస్తోంది. అత్యవసర చికిత్స విభాగంలో చేర్చి, ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తోంది. కొందరు చనిపోతున్నారు కూడా.
  • ఒక మోతాదు తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా వస్తోంది. వీరికి ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడుతోంది. బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి వస్తోంది.
  • రెండు మోతాదులు తీసుకున్నవారిలో చాలామందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తప్పుతోంది. బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదు. మరణాలూ సంభవించటం లేదు.
  • అదే బూస్టర్‌ టీకా తీసుకున్నవారు కొవిడ్‌ బారినపడ్డా చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించటం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా ఒక మాదిరిగానే ఉంటున్నాయి. మామూలు జలుబు మాదిరిగానే ఉంటోంది. ఒకప్పటిలా తీవ్రం కావటం లేదు.

- ఇవన్నీ బూస్టర్‌ టీకా ప్రయోజనాలను గట్టిగా నొక్కి చెబుతున్నాయి. కాబట్టి ఇది మనకూ ఉపయోగకరమే.

టీకాలు పాతవే అయినా..

కొవిడ్‌-19 ఆరంభంలో టీకాలు రూపొందించారు. వైరస్‌ ముల్లు ప్రొటీన్‌లో మార్పులు తలెత్తాయి కదా. మరి ఆ టీకాలు బూస్టర్‌గా పనిచేస్తాయా? అన్నది చాలామంది సందేహం. వైరస్‌లో ఒక్క ముల్లు (ఎస్‌) ప్రొటీనే కాదు, ఇతరత్రా ప్రొటీన్లు చాలానే ఉంటాయి. ఎన్వలప్‌ (ఇ) ప్రొటీన్‌, మెంబ్రేన్‌ (ఎం) ప్రొటీన్‌, ఓపెన్‌ రీడింగ్‌ ఫ్రేమ్‌ (ఓఆర్‌ఎఫ్‌) ప్రొటీన్‌, న్యూక్లియోక్యాప్సిడ్‌ (ఎన్‌) ప్రొటీన్‌.. ఇలా రకరకాల ప్రొటీన్లు ఉంటాయి. వీటిన్నింటికీ టీకాతో రోగనిరోధశక్తి పుట్టుకొస్తుంది. వైరస్‌ను నిర్వీర్యం చేసి, వాటి భాగాలతో తయారుచేసిన టీకాలు సమర్థంగా పనిచేస్తాయి. ముల్లు ప్రొటీన్‌లోనూ ఎన్నో రకాల అమైనో ఆమ్లాలుంటాయి. వీటిల్లో కొన్ని మారినా మిగతావి అలాగే ఉంటాయి. టీకా వీటి మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి వైరస్‌ ముల్లు ప్రొటీన్‌లో మార్పులు తలెత్తినంత మాత్రాన టీకాలు పనిచేయవని అనుకోవద్దు.

కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే

బూస్టర్‌ తీసుకున్న తర్వాతా ఇన్‌ఫెక్షన్‌ రాకూడదనేమీ లేదు. అయితే ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా తీవ్రం కాకపోవచ్చు. చాలామందిలో లక్షణాలే కనిపించకపోవచ్చు. ఒకవేళ లక్షణాలు తలెత్తినా తక్కువ స్థాయిలోనే ఉంటాయి. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రంగా జబ్బు మారదు. దాదాపు మరణాలు ఉండవనే చెప్పుకోవచ్చు. అలాగని విచ్చలవిడిగా ప్రవర్తించటం తగదు. బూస్టర్‌ తీసుకున్నవారిలో లక్షణాలు తలెత్తకపోయినా వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించొచ్చు. కాబట్టి మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం వంటి జాగ్రత్తలు పాటించాల్సిందే.

అపోహలు వద్దు

అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులున్నా.. ఇతరత్రా మందులు వాడుతున్నా బూస్టర్‌ టీకా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మందులు ఆపేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు వంటి కొవిడ్‌ లక్షణాలుంటే అవి తగ్గిన రెండు వారాల తర్వాత టీకా తీసుకోవాలి. రెండు టీకాలు తీసుకున్నా కొవిడ్‌ వచ్చి, తగ్గినవారూ నెల తర్వాత టీకా వేసుకోవచ్చు. పొగ, మద్యం అలవాట్లతో రోగనిరోధకశక్తి బలహీనమవుతుంది కాబట్టి టీకా తీసుకున్నాక రెండు వారాల వరకు వీటి జోలికి వెళ్లొద్దు.

బూస్టర్‌గా ఏ టీకా?

బూస్టర్‌ మోతాదుగా ఏ టీకా ఇవ్వాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వేరే టీకా తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదు. నిజానికి వేరే టీకా వేసుకుంటే (ఉదా: కొవిషీల్డ్‌ తీసుకున్నవారు కొవాగ్జిన్‌ వేసుకోవటం) మంచిదన్నది శాస్త్రవేత్తల భావన. అయితే వేరే టీకాలు తీసుకోవటం ఎంతవరకు సురక్షితం? ఏవైనా దుష్ప్రభావాలుంటాయా? అనే దానిపై మనదగ్గర ప్రస్తుతానికి అంత సమాచారం లేదు. ప్రస్తుతం మనదగ్గర ఒక వైద్య సంస్థలో చేపట్టిన ప్రయోగ పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కొవిషీల్డ్‌ వేసుకున్నవారు కొవాగ్జిన్‌, కొవాగ్జిన్‌ వేసుకున్నవారు కొవిషీల్డ్‌ తీసుకోవటం సురక్షితమేనని, దీంతో వైరస్‌ రకాలకు మరింత రక్షణ లభిస్తున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ వైరాలజీ నిర్వహించిన అధ్యయనం సూచిస్తోంది.

  • టీకా మోతాదు విషయంలోనైతే ఎలాంటి మార్పు లేదు. కాకపోతే స్పుత్నిక్‌ విషయంలో తక్కువ మోతాదుతో కూడిన లైట్‌ టీకాను బూస్టర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.

-డా. ఎం. వీ. రావు, యశోదా ఆసుపత్రి

ఇదీ చదవండి: Arvind kejriwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు కరోనా పాజిటివ్​

'గడువు తీరిన టీకాలు వాడట్లేదు.. 50% ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.