ETV Bharat / sukhibhava

సెక్స్​పై ఆసక్తి తగ్గిందా? ఇలా చేస్తే సరి...

author img

By

Published : Jul 4, 2021, 4:21 PM IST

మనిషికి లైంగిక ఆరోగ్యం ఎంతో కీలకం. అందులో సమస్యలు వస్తే జీవితంలోని ఇతర విషయాలపైనా కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇటీవలి కాలంలో అనేకమంది పురుషుల్లో లైంగిక వాంఛ తగ్గిపోతోంది. కొందరు దీనిని తీవ్రంగా పరిగణించి భయపడుతున్నారు. అయితే కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇది కూడా ఒక సైడ్​ఎఫెక్ట్​ అని వైద్యులు అంటున్నారు.

lack of physical intimacy
లైంగిక వాంఛ

శృంగారంలో ఎప్పుడూ చురుకుగా ఉండే మీలో ఇప్పుడు లైంగిక వాంఛ తగ్గిందా? లైంగిక ఆరోగ్యంపై అనుమానాలతో.. ఏం జరుగుతోందో అర్థంకాక లోలోపల కుంగిపోతున్నారా? భయపకండి.. ఈ కొవిడ్​ కల్లోల కాలంలో ఇది కూడా ఓ సైడ్​ఎఫెక్ట్​ అయ్యి ఉండొచ్చు!

లాక్​డౌన్​తో చిక్కులు...

కరోనా.. అందరి జీవితాలతో ఏదో ఒక విధంగా ఆడుకుంటోంది. ముఖ్యంగా లాక్​డౌన్​ కారణంగా.. అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత నష్టాలతో కొందరు మానసికంగా బాధపడుతున్నారు. అదే సమయంలో పురుషుల్లో సెక్స్​కు సంబంధించి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. లాక్​డౌన్​లో పురుషుల్లో లైంగిక ఆరోగ్యం దెబ్బతినడానికి నాలుగు కారణాలు ఉన్నాయని ఆండ్రోకేర్​- ఆడ్రాలజీ ఇన్​స్టిట్యూట్​కు చెందిన ఆండ్రాలజిస్ట్​ డా. రాహుల్​ రెడ్డి తెలిపారు.

అవి..

  • ఒత్తిడి
  • శరీరానికి వ్యాయామం లేకపోవడం
  • మితిమీరిన మద్యం అలవాటు
  • విటమిన్​ డీ లోపించడం

లాక్​డౌన్​ కారణంగా పురుషుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. అయితే ఇక్కడ తెలియని ఒక విషయం ఉంది. ఒత్తిడి వల్ల పురుషుల్లో ఉండే టెస్టోస్టీరాన్​ హార్మోన్​ తగ్గిపోతుంది. అదే సమయంలో ప్రొలాక్టిన్​ స్థాయి పెరుగుతుంది. ఇదే పురుషుల్లో లైంగిక వాంఛ తగ్గిపోవడానికి కారణమవుతుంది.

ఇదీ చూడండి:- టీన్‌ ప్రెగ్నెన్సీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?!

లాక్​డౌన్​ వల్ల అన్నీ మూతపడ్డాయి. జిమ్​లు కూడా పనిచేయలేదు. అందువల్ల చాలా మంది వ్యాయామాలకు దూరంగా ఉన్నారు. లైంగిక ఆరోగ్యానికి, వ్యాయామానికి బంధం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల పురుషులు, మహిళల్లో లైంగిక వాంఛ పెరుగుతుంది. వ్యాయామాలు లేకపోవడం, అసలు శరీరాన్ని కదిలించకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుంది.

ఖాళీ సమయంలో మద్యాన్ని సేవించేందుకు చాలా మంది మొగ్గుచూపుతారు. ఇక లాక్​డౌన్​ వల్ల, వర్క్​ ఫ్రం హోం సమయాన్ని మినహాయిస్తే.. చాలా వరకు ఖాళీ సమయం దొరికింది. దీంతో కొందరు పురుషులు మద్యాన్ని ఎక్కువగా సేవించడం మొదలుపెట్టారు. ఇది కూడా శృంగార జీవితానికి నష్టం కలిగించేదే.

మహిళల సెక్స్​ హార్మోన్​ అయిన ఈస్ట్రోజెన్​.. పురుషుల్లోనూ కొంత శాతం ఉంటుంది. మితిమీరిన మద్యం అలవాటు వల్ల పురుషుల్లో ఆ స్థాయి పెరిగే అవకాశముంది. ఇది పురుషుల్లో ఎరక్టైల్​ డిస్​ఫంక్షన్​(ఈడీ)కి దారితీస్తుంది.

కరోనా భయం, వర్క్​ ఫ్రం హోం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అందువల్ల అనేకమందిలో విటమిన్​ డీ లోపం కనపడింది. ఈ కారణంగా కూడా లైంగిక వాంఛ తగ్గిపోతుంది.

ఏం చేయాలి?

ఈ సమస్య నుంచి బయటపడానికి డా. రాహుల్​ కొన్ని సూచనలు చేశారు. సరైన డైట్​ పాటించడం, వ్యాయామం చేయడం, మంచి నిద్రతో సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో కొన్ని చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- లైంగిక విద్యపై తొలగని అపోహలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.