Constipation Problem: కడుపుబ్బరం తరచూ చూసే సమస్యే. అందరూ ఎప్పుడో అప్పుడు దీంతో ఇబ్బంది పడ్డవారే అన్నా అతిశయోక్తి కాదు. దీనికి ప్రధాన కారణం అతిగా తినటం. అనారోగ్యకర ఆహారం, గబగబా తినటం, బద్ధకంగా కూర్చోవటం వంటివీ కడుపుబ్బరానికి దారితీయొచ్చు. తేలికైన మార్పులు, చిట్కాలతో దీని బాధలను తగ్గించుకోవచ్చు.
- బాగా నమిలి తినటం: ఆహారాన్ని ఆస్వాదిస్తూ, బాగా నమిలి తినటం ఎవరికైనా మంచిదే. ఇది తృప్తిని కలిగించటమే కాదు.. ఆహారం బాగా జీర్ణం కావటానికీ తోడ్పడుతుంది.
- తక్కువ తక్కువగా తినటం: ఒకేసారి ఎక్కువెక్కుగా తింటే కడుపు ఉబ్బి ఇబ్బంది కలిగిస్తుంది. అదే తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తింటే కడుపు తేలికగా ఉంటుంది. తిన్నది బాగా ఒంట పడుతుంది.
- పప్పులు నానబెట్టటం: కందిపప్పు వంటి వాటిని వండటానికి ముందు నానబెట్టటం మంచిది. దీంతో పప్పులు త్వరగా ఉడుకుతాయి. తేలికగా జీర్ణమవుతాయి. కడుపుబ్బరమూ తగ్గుతుంది.
- పెరుగు, మజ్జిగ: ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. ఇలా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి తోడ్పడతాయి.
- పీచు తగినంత: పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. తిన్నది బాగా జీర్ణమైతే కడుపుబ్బరమూ తగ్గుతుంది.
ఇదీ చదవండి: రోజంతా కీబోర్డ్పైనే పని చేస్తారా? వేళ్లతో ఈ వ్యాయామం చేయండి!