Cancer causes: మనకు రోజూ ఎదురయ్యే పరిస్థితులు... మనం తరచూ చేసే పనులు... మన అలవాట్ల కారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టు వింటూ ఉంటాం. అది మన ఆహారం వల్ల కావచ్చు. మన జీవనశైలి వల్ల కావచ్చు. మన ప్రమేయం లేకుండా మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల కూడా కావొచ్చు. అయితే అలాంటి వాటిల్లో నిజమెంతో మనకు తెలియదు. ఏది అపోహ? ఏది శాస్త్రీయంగా రుజువైందనేది కూడా తెలియకుండానే మనం నమ్మేంతగా ఆ ప్రచారాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి.
Does X ray cause Cancer?
క్యాన్సర్ విషయంలో ఎక్కువగా ప్రచారం జరిగేది ఎక్స్‌రేల గురించే. ఎక్స్‌రేలో ఉపయోగించే రేడియేషన్ ఎక్కువైతే క్యాన్సర్‌కు దారి తీయొచ్చని అంటుంటారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. పాతకాలంలో ఎక్స్‌రే యంత్రాలు ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేసేవని, ప్రస్తుతం ఆ స్థాయి తగ్గిందని స్పష్టం చేశారు. అయితే, ఇప్పటికీ ఎక్స్‌రేల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరీ ఎక్కువగా ఎక్స్‌రేలు తీయించుకోవద్దని సూచిస్తున్నారు.
సెల్ఫోన్లు?
ఎక్స్‌రేల తర్వాత ఎక్కువగా ప్రచారంలో ఉన్న క్యాన్సర్ కారక సాధనం సెల్‌ఫోన్. ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన కారణంగా ఈ హెచ్చరిక ఎక్కువగా వినపడుతోంది. టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్‌కు తోడు ఫోన్ నుంచి కూడా రేడియేషన్ వెలువడుతుంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, సెల్‌ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ నేరుగా క్యాన్సర్‌కు దారితీస్తుందా అనేది నిర్దిష్టంగా రుజువు కాలేదు. కానీ, వీలైనంత వరకు ఫోన్‌ను పరిమితంగా ఉపయోగించడం, ఫోన్ మాట్లాడితే హెడ్‌ఫోన్, ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది.
ఆర్టిఫీషనల్ స్వీట్నర్లు
బీపీ రోగులు ఉపయోగించే ఆర్టిఫీషియల్ స్వీట్నర్ల వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని నిపుణులు స్పష్టం చేశారు. మరోవైపు, వాటర్ బాటిళ్లు, సెంట్లు, గ్రిల్ చేసిన మాంస ఉత్పత్తుల వల్ల కొన్నిరకాల క్యాన్సర్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే కింది వీడియో చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: మద్యంతో కాలేయంతో పాటు ఇతర అవయవాలకూ క్యాన్సర్.. !