sleep apnea: వెల్లకిలా పడుకొని ఉంటే ఊపిరి ఆడటం లేదా? అదే ఒకవైపు తిరిగి పడుకుంటే శ్వాస బాగా తీసుకోగలుగుతున్నారా? అసలు ఏమిటీ సమస్య. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులు ఏమంటున్నారంటే..
"దీనికి ముఖ్యకారణం ఒబెసిటి. ఊబకాయం, షార్ట్ నెక్, టంగ్ వెనుక భాగంలో ఎక్కువ ఫ్యాట్ చేరి ఉన్నవారు.. వెల్లకిలా పడుకున్నప్పుడు.. టంగ్ వెనక్కు పడిపోయి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు. అదే పక్కకు తిరిగి పడుకున్నప్పుడు టంగ్ వెనక్కు పడిపోయే సమస్య అంతగా ఉండదు కాబట్టి.. ఈజీగా నిద్రపోగలరు. దీనిని స్లీప్ ఆప్నియా అంటారు." అని వైద్యులు చెప్పారు.
స్లీప్ ఆప్నియా లక్షణాలు..
- స్లీప్ ఆప్నియాలో.. ఊబకాయంతో పాటు గురకపెట్టడం, నిద్రపోతూ పోతూ ఉలిక్కిపడి లేవడం, ఛాతి మీద బరువు పెట్టినట్టు, పీకను పిసికేసినట్టు అనిపిస్తుంది.
- ఉదయం లేచాక ఆరేడు గంటలు నిద్రపోయినా.. ఫ్రెష్‌గా అనిపించకపోవడం, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండని అనిపించడం
- ఏ పని లేకుండా గమ్మున కూర్చొని ఉంటే తెలియకుండానే నిద్ర రావడం
- కొద్ది దూరం నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసపడటం
- కోపం, చిరాకు
sleep apnea treatment: పరిష్కారం..!
ఈ సమస్య ఒస్తే ఊపిరితిత్తుల డాక్టర్ లేదా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలి. సమస్య ఉంటే ఊబకాయం తగ్గించుకోవాలి. ముక్కు లోపల కండరాలుంటే సరిచేసుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: స్నానం శుభ్రత కోసం మాత్రమే కాదు!