ETV Bharat / sukhibhava

ఆ చర్మ వ్యాధులతో జాగ్రత్త! - skin diseases

ప్రస్తుతం హాస్టళ్లలో ఉండటం.. లేదంటే నలుగురైదుగురు కలిసి అద్దెగదుల్లో ఉండటం ఎక్కువైంది. తెలిసో తెలియకో చాలామంది ఒకరి వస్తువులు (సబ్బుల వంటివి) మరొకరు వాడుకుంటుంటారు. దీంతో పలు చర్మ రోగాలు తలెత్తే అవకాశముంది. గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు సంక్రమించవచ్చు. అవి రాకుండా ఏం చేయాలి?

Careful with skin allergies like fungal infection
ఆ చర్మ వ్యాధులతో జాగ్రత్త!
author img

By

Published : Nov 18, 2020, 10:47 AM IST

స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లల్లో చర్మ సమస్యలు.. ముఖ్యంగా గజ్జి, తామర తరచుగా కనబడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత పరిశుభ్రత లోపించటం. ప్రస్తుతం హాస్టళ్లలో ఉండటం.. లేదంటే నలుగురైదుగురు కలిసి అద్దెగదుల్లో ఉండటం ఎక్కువైంది. తెలిసో తెలియకో చాలామంది ఒకరి వస్తువులు (సబ్బుల వంటివి) మరొకరు వాడుకుంటుంటారు. ఒకరి దుస్తులు మరొకరు వేసుకుంటుంటారు. దీంతో ఎవరికైనా గజ్జి, తామర వంటి సమస్యలుంటే ఇతరులకూ వ్యాపిస్తాయి. అమ్మాయిల్లో పేల సమస్య కూడా ఎక్కువే. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.

గజ్జి

దీని బారినపడ్డవారిలో చేతి వేళ్ల మధ్య, గజ్జల్లో, తొడల్లో, జననాంగ భాగాల్లో సన్నటి కురుపులు బయలుదేరతాయి. ఇది దురదతో తీవ్రంగా వేధిస్తుంది. రాత్రిపూట దురద మరింత ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. గజ్జితో బాధపడేవారికి పర్‌మెత్రిన్‌ లోషన్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒళ్లంతా రాసుకోవాలి. శరీరంలో ఒక్క చోట గజ్జి ఉన్నా కూడా మెడ నుంచి కాళ్ల వరకు అంతటా రాసుకోవాలి. దీన్ని 12 గంటల సేపు అలాగే ఉంచుకొని.. తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే ఆరోజు వేసుకున్న దుస్తులన్నింటినీ గంటసేపు వేడి నీటిలో నానబెట్టి ఉతుక్కోవాలి. పర్‌మెత్రిన్‌ పూత మందు ఒంటికి రాసుకున్నా పైకేమీ కనబడదు, వాసన కూడా రాదు. కాబట్టి బయటి వాళ్లకు తెలిసే అవకాశమేమీ లేదు. కొందరికి దురద తగ్గటానికి యాంటీహిస్టమిన్‌ మందులు అవసరపడొచ్చు. ఒకవేళ కురుపులు చీము పట్టి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తితే యాంటీబయోటిక్స్‌ కూడా వాడాల్సి ఉంటుంది.

నివారణ

  • ఎవరి సబ్బులు వారే వాడుకోవాలి. ఇతరుల దుస్తులను ధరించొద్దు.
  • గజ్జి ఉన్నవారి చేతులు తాకకుండా చూసుకోవాలి.

నీనీ పేలు

హాస్టళ్లలో ఉండే అమ్మాయిల తలలో పేలు పడటం తరచుగా చూసేదే. ఇవి దువ్వెనలు, తువ్వాళ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటాయి. పేలకు పర్‌మత్రిన్‌ లోషన్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తల పొడిగా ఉన్నప్పుడే రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకూ అంటుకునేలా మందు రాసుకొని.. తలకు గుడ్డ చుట్టుకోవాలి. గంటసేపు అలాగే ఉంచి.. తర్వాత మామూలు షాంపూతో తలస్నానం చేయాలి. వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడే పేల దువ్వెనతో తల దువ్వుకోవాలి. ఇది చాలా కీలకం. దీంతో పేల గుడ్లు పడిపోతాయి. లేకపోతే గుడ్లు అలాగే ఉండి మళ్లీ మళ్లీ పేలు వచ్చే అవకాశముంది. ఇలా పదిహేను రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు మందు రాసుకుంటే సరిపోతుంది. కొందరికి పేలతో తలలో పుండ్లు పడొచ్చు. అలాంటివాళ్లు యాంటీబయోటిక్‌ మందులు వాడాల్సి ఉంటుంది.

నీనీ తామర

దీనికి మూలం ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌. ఇది గజ్జల్లో, తొడల మీద రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి తామరాకు మాదిరిగా కనబడుతుంటుంది. ఒకరి దుస్తులు ఒకరు వాడుకోవటం, దుస్తులు కలిపి ఉతకటం, కలిపి ఆరేయటం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఫంగస్‌ బీజకణాలు దుస్తుల్లో చాలాకాలం అలాగే ఉండిపోతాయి. దుస్తులను వేడి నీటితో ఉతికితేనే ఇవి చనిపోతాయి. మనం చాలావరకు దుస్తులను చన్నీళ్లతోనే ఉతుకుతుంటాం. అందువల్ల తామరతో బాధపడేవారు వేసుకునే దుస్తులను మరొకరు వేసుకుంటే ఇతరులకూ వ్యాపిస్తుంది. దీని బారినపడ్డవారికి క్లోట్రైమజాల్‌, మైకోనజాల్‌, కీటోకొనజాల్‌ పూతమందులతో మంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తామర ఉన్నచోట రోజుకు రెండు సార్ల చొప్పున మూడు నెలల పాటు రాసుకోవాలి. చాలామంది ఒకట్రెండు రోజులు వాడి చర్మం నున్నగా అవగానే మానేస్తుంటారు. ఇది తప్పు. కంటికి కనబడనంత మాత్రాన తామర పూర్తిగా తగ్గినట్టు కాదు. ఫంగస్‌ క్రిములు చర్మం పొలుసుల్లో చాలాకాలం జీవించి ఉంటాయి. కనీసం మూడు నెలలు పూత మందులు వాడితేనే సమస్య పూర్తిగా నయమవుతుంది. కొందరికి గోళ్లకు, వెంట్రుకలు కూడా తామర వ్యాపిస్తుంటుంది. అలాంటప్పుడు గ్రీజోఫల్విన్‌, టెర్బినఫిన్‌, ఐట్రకోనజోల్‌ వంటి మాత్రలూ వేసుకోవాల్సి ఉంటుంది.

నివారణ

  • ఇతరుల దుస్తులను.. ముఖ్యంగా వేరేవాళ్ల జీన్స్‌ దుస్తులను ధరించొద్దు.
  • ఫుల్‌ బనియన్లు, ఫుల్‌ డ్రాయర్లు వాడుకోవాలి. వీటిని ఇతరుల లోదుస్తులతో కలిపి ఉంచొద్దు, కలిపి ఉతకొద్దు.

ఇదీ చూడండి: చలికాలం చర్మాన్ని మరింత అందంగా మార్చండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.