కంటికి ఇంపైన రంగు, తియ్యని రుచితో నోరూరిస్తుంది బొప్పాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే గర్భం దాల్చిన వారు దీన్ని తింటే అబార్షన్(Papaya abortion) అవుతుందన్న అపోహ చాలా కాలం నుంచి ఎంతో మందిలో ఉంది. ఇది నిజమో కాదో తెలియనప్పటికీ గర్భిణీలకు దీన్ని తినిపించరు. కడుపులోని బిడ్డకు ప్రమాదం జరుగుతుందని వారి భయం. అలాగే గర్భం వద్దనుకునేవారు కూడా పిండం కడుపులో పడకముందే లేదా కడుపులో ఉన్న తొలి దశలోనే బొప్పాయిని తీసుకుంటూ ప్రెగ్నెన్సీ పోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఈ పద్ధతి పాటించడం ద్వారా గ్యారంటీ లేదని అంటున్నారు నిపుణులు! వైద్య సలహా తీసుకోకుండా ప్రయత్నాలు చేస్తే నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"పచ్చి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ పండును తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. కానీ ఇందులో గ్యారంటీ లేదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే వయబులిటీ స్కాన్‌ను అడ్వైస్ చేస్తారు. ఆ స్కాన్‌లో పిండం ఏర్పడిందా? లేదా? ఒకవేళ ఏర్పడితే ఎన్ని వారాలు అయింది? అని నిర్ధరిస్తారు. ప్రెగ్నెన్సీ నిర్ధరణ అయితే.. తొలి ఏడు లేదా ఎనిమిది వారాల్లో మెడికల్ మెథడ్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వారా వైద్యపర్యవేక్షణలో సురక్షితంగా అబార్షన్ చేస్తారు. అలా కాకుండా ఇంట్లోనే ఉంటూ సమయం వృథా చేస్తే పిండం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు సర్జికల్‌గా డిఎన్సీ చేసి బేబీని తీస్తారు. ఈ విషయంలో వేరే హోమ్ మెథడ్స్ కాకుండా గైనిక్ డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది."
-డాక్టర్.
ఇదీ చూడండి: మర్మాంగాన్ని శుభ్రం చేసుకోకపోతే.. ప్రమాదమే!