ETV Bharat / sukhibhava

రాత్రిపూట ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు - Tips for good sleep

దైనందిన జీవితంలో నిద్రకు, ఆహారానికి విడదీయరాని సంబంధం ఉంది. పడుకునే ముందు తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు, ద్రావణాలు హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తే..మరికొన్ని మరింత నిద్రలేమిని ప్రేరేపిస్తాయి. అయితే రాత్రిపూట భోజనం చేయాలి? ఎలాంటి ద్రావణాలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

Food for good Sleep Pattern
మన ఆహరం నిద్రను ప్రభావితం చేయగలదా..
author img

By

Published : Feb 1, 2021, 3:24 PM IST

Updated : Feb 25, 2021, 2:50 PM IST

ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది ఒత్తిడి, చిరాకు, నిరుత్సాహంతో బాధ పడుతుంటారు. వారి ఆహారపు అలవాట్లు కారణంగా కూడా కొంత మందిలో నిద్ర సమస్యలు తలెత్తవచ్చు. ఆహారం, నిద్ర ఒక దానితో ఒకటి బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల టీ, కాఫీ, ఆల్కహాల్, ఇతర కెఫిన్ కలిగిన ఆహారాలు నిద్రకు ముందు తినకూడదని చెబుతారు. ఎందుకంటే అవి నిద్రకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే నిద్రను ప్రేరేపించే ఆహారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి మీకు రాత్రి పూట మంచి నిద్రను అందించడంతో పాటు, మరుసటి రోజు ఉదయాన్ని తాజాగా.. ఉల్లాసంగా మొదలుపెట్టడానికి సహాయపడతాయి.

  1. గోరు వెచ్చని పాలు : నిద్రపోయే ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగాలని మీ బామ్మ దగ్గర వినే ఉంటారు. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే, పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం, మెలటోనిన్ మరియు విటమిన్ డి ఉన్నాయి. ఈ నాలుగు నిద్రను ప్రోత్సహించే సమ్మేళనాలు. కొద్దిగా రుచి మరియు అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం పసుపును కూడా కలపవచ్చు.
  2. నట్స్: అన్ని నట్స్​లో మెలటోనిన్‌తో పాటు మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ మొదలైన ఖనిజాలు ఉంటాయి. కొన్ని అధ్యయనాలు ఇవి నిద్రలేమిని ఎదుర్కోవడంలో సహాయపడతాయని నిరూపించాయి.
  3. చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ: టీ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధమైనది చమోమైల్ టీ. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందటంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, అపిజెనిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున నిద్రలేమిని తగ్గించి హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
  4. కివి: విటమిన్ సి అధికంగా ఉండే పండు కివి. కేలరీలు తక్కువ, పోషకాలు అధికంగా ఉండే పండు. అందులో యాంటీఆక్సిడెంట్లు, మెలటోనిన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
  5. చేపలు: విటమిన్ డి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం కావడంతో పాటు, సాల్మొన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు సెరోటోనిన్​ను నియంత్రిస్తాయి. ఇది చక్కని నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నిద్రకు ముందు తినకూడనివి:

  • అధిక కొవ్వు, కారంగా ఉండే పదార్థాలు
  • త్వరగా జీర్ణం కాని పదార్థాలు
  • కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్
  • డార్క్ చాక్లెట్స్

ఇంకా?:

ఆయుర్వేద నిపుణులు హైదరాబాద్‌లోని ఏఎమ్‌డీ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాజ్యలక్ష్మి మాధవమ్ (ఎండీ ఆయుర్వేదం) చెప్పిన విధానం ప్రకారం..

  • పగలు నిద్రపోకుండా ఉండాలి.
  • ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేస్తూ ఒత్తిడిని దూరం చేసుకోవాలి. పగలు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండాలి.
  • పడక గది చీకటిగా.. ప్రశాంతంగా, చల్లగా, ఆహ్లాదకరంగా ఉండాలి.
  • నిద్ర నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరచడంలో మర్ధన బాగా ఉపయోగపడుతుంది. పడుకునే ముందు పాదాలను నువ్వుల నూనెతో మర్ధన చేసుకోవచ్చు.
  • అశ్వగంధ, జఠామాంసి, యష్ఠిమధు, బ్రాహ్మి, జాజికాయ, శంఖపుష్పి మొదలైనవి ప్రకృతిలో లభించే మత్తుమందులు. అయినప్పటికీ, వాటిని వైద్యుడి సలహాతో మాత్రమే తీసుకోవాలి.
  • మంచి సంగీతం వినడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, ఆందోళన లేకుండా జీవించడం ఎల్లప్పుడూ మంచిది.

అందువల్ల, పడుకునే ముందు నిద్ర మాత్రలు బదులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల.. వారు నిద్ర సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి. మంచి నిద్ర చక్కని రోగనిరోధక శక్తితో పాటు ప్రశాంతతకు కారణం అవుతుంది.

Last Updated : Feb 25, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.