చాలా రోజులుగా ఇంటికే పరిమితమవటం వల్ల స్త్రీలలో హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. వ్యాధి కలుగుతుందనే భయం వల్ల మెదడులో ఉండే పిట్యుటరీ గ్రంధి అండాశయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. కరోనా వ్యాధి బారిన పడి కోలుకున్న వారిలో రెండు విషయాలను వైద్యులు గుర్తించారు.
1. కొ చికిత్సలో భాగంగా రక్తాన్ని పలుచగా చేసే ఔషధాలను తీసుకున్న స్త్రీలలో రెండు, మూడు నెలల పాటు బహిష్టు సమయంలో ఎక్కువ రక్త స్రావం జరిగింది. 6 మాసాల అనంతరం బహిష్టు స్రావం సాధారణ స్థితికి చేరుకుంది.
2. కరోనా టీకా తీసుకున్న తరువాత రుతు స్రావంలో అసాధారణత కనిపించినా అది తాత్కాలికమే. వ్యాధి నిరోధక శక్తికి.. రుతు చక్రానికి సంబంధం లేదు. కొవిడ్ బారిన పడిన వారు సానిటరీ ప్యాడ్స్ ను ఇదివరకటి లాగానే పారవేయవచ్చు. కరోనా రక్తం ద్వారా వ్యాపించదు.
సుదీర్ఘ కాలం ఇంట్లోనే ఉండటం, వ్యాయామం లేకపోవటం, ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల ఊబకాయం కలిగి హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి దీనికి తోడై పీసీఓఎస్ కలగవచ్చు. సాధారణ వైద్య పరీక్షలకు ఆస్పత్రులకు వెళ్లే స్త్రీలు కొవిడ్ భయంతో దూరంగా ఉంటున్నారు. దీనివల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. ఆసుపత్రుల్లో కరోనా రోగుల సేవలు వేరుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. మెనోపాజ్ లక్షణాలతో ఉన్న స్త్రీలు క్రమం తప్పకుండా వైద్యున్ని కలవాలి. ఈ సమయంలో తక్కువ రక్త స్రావం, రక్తహీనత, పొత్తి కడుపు నొప్పి, మనసిక ఉద్వేగం కలుగుతాయి.
గుర్తుంచుకోవలసిన అంశాలు:
40ఏళ్ల వయసు సమీపిస్తున్న మహిళలు క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి ఏ వయసులోనైనా హర్మోన్ల స్రావకాన్ని తగ్గించవచ్చు. అధిక రుతుస్రావం, నొప్పి, శరీరం బరువు పెరగటం మొదలైన లక్షణాలు కనిపించినపుడు తగు పరీక్షలు చేయించుకోవాలి. ప్లాస్టిక్ వాడకం పెరగటం వల్ల, కర్మాగారాల కాలుష్యం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత కలగవచ్చు. అందువల్ల 6 నెలలకొకసారి పరీక్షలు చేయించుకోవాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు టీకా తీసుకోరాదు. ఇతర మహిళలు, వృద్ధులు తప్పక టీకా తీసుకోవాలి.