ETV Bharat / sukhibhava

పేస్ట్​ వేసుకునే ముందు బ్రష్​ను తడుపుతున్నారా?.. అయితే మీరు తప్పు చేస్తున్నట్లే! - బ్రష్ చేసుకునే విధానం

Brushing Tips : బ్రష్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారట. బ్రష్ చేసేటప్పుడు సరైన నియమాలు పాటించకుండా ఎలా పడితే అలా చేస్తున్నారని డెంటిస్టులు చెబుతున్నారు. మరీ బ్రష్ చేసేటప్పుడు చేస్తున్న తప్పులు ఏంటో తెలుసుకుందామా?

brushing techniques
brushing techniques
author img

By

Published : Jun 21, 2023, 1:49 PM IST

Brushing Tips : దంతాలను శుభ్రం చేసుకునేందుకు బ్రష్ చేయడం గురించి మనకంతా తెలుసని అందరూ అనుకుంటారు. తాము చేసేది సరైందని నమ్ముతుంటారు. కానీ బ్రష్ చేయడానికి సంబంధించి తమకు అన్నీ తెలుసు అనుకొని చాలా మంది పెద్ద తప్పులు చేస్తున్నారట. ప్రముఖ డెంటిస్ట్ తాజాగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

పొద్దున లేవగానే అందరూ బ్రష్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సాయంత్రం కూడా దంతాలను శుభ్రం చేసుకుంటారు. ఎక్కువ మంది ఉదయం మాత్రమే శుభ్రపరుచుకుంటూ ఉంటారు. కానీ బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకునే సమయంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. బ్రష్ ఎలా ఉపయోగించాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి? అనే విషయాలు గురించి వైద్యులు కీలక విషయాలు బయటపెట్టారు.

బ్రష్‌ను నీళ్లతో తడుపుతున్నారా?
బ్రష్‌కు పేస్ట్ పెట్టుకునేముందు చాలామందికి బ్రష్‌ను నీళ్లతో తడిపే అలవాటు ఉంటుంది. నీళ్లతో తడిపిన తర్వాత పేస్టు వేసుకుని బ్రష్ చేస్తారు. కానీ ఇది చాలా తప్పు అని.. ఇలా చేయడం వల్ల పేస్ట్ పలుచన అవుతుందని వైద్యులు చెబుతున్నారు. టూత్ పేస్టులో నీటి శాతం ఎక్కువగా ఉంటుందని.. మళ్లీ నీటితో తడిపిన బ్రష్‌పై పేస్ట్ వేసి తొముకోవడం వల్ల నురుగ ఎక్కువగా వస్తుందని అంటున్నారు. దీని వల్ల త్వరగా ఉమ్మి వస్తుందని.. ఆ కారణంగా పేస్టు సరిగ్గా పళ్లకు పట్టదని వైద్యులు చెప్పారు.

ముందు వెనుక భాగం.. తర్వాత ముందు భాగం..
Brushing Techniques : వెనుక నుంచి మొదలుపెట్టి దంతాలను శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వెనుక భాగం కష్టతరమైన భాగమని.. ముందు నుంచి ప్రారంభించి శుభ్రం చేసుకోవడం వల్ల చివరికి వెళ్లేసరికి చాలామంది నిర్లక్ష్యం చేస్తారని తెలిపారు. వెనుక భాగాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకుండా అశ్రద్ధ వహిస్తారు. వెనుక భాగాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల పాచు ఏర్పడి పళ్లు పసుపు రంగులోకి మారతాయి. డెంటల్ ఫ్లాస్‌ను నిల్వ చేసుకునే బ్రష్​లకు బదులు ఇంటర్‌డెంటల్ బ్రష్‌లను ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటర్‌డెంటల్ బ్రష్‌లు ఫిట్‌గా ఉండటమే కాకుండా అనేక ఆకారాలు, పరిమాణాల్లో వస్తాయని చెపుతున్నారు.

డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెళ్లేటప్పుడు కూడా..
ఇక డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ కోసం వెళ్లేటప్పుడు దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. విలువైన లేదా మీరు సెంటిమెంట్‌గా భావించే దుస్తులను వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పంటికి చికిత్స చేసే సమయంలో వచ్చే నీళ్లు, మరకలతో దుస్తులు పాడైపోతాయి. ముదురు రంగు దుస్తులను ధరించడం మంచిది. డెంటిస్ట్ దగ్గరకు వెళ్లేటప్పుడు జిమ్, వర్కౌట్ల కోసం ఉపయోగించే దస్తులను ధరించడం ఉత్తమని చెబుతున్నారు.

బ్రష్​ చేసుకునేముందు..
అలాగే పళ్లు తోముకున్న తర్వాత మంచినీరు తాగాలా? లేక ముందే తాగాలా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. అయితే పళ్లు తోముకోవడానికి ముందే మంచినీరు తాగడం మంచిదని చెబుతున్నారు. నిద్రలేచిన తర్వాత మంచినీరు తాగితే శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు పోతాయని సూచిస్తున్నారు. దీంతో బ్రష్ చేయడానికి ముందే తాగడం మంచిదంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.