ETV Bharat / sukhibhava

అమ్మ ఒడిలో ఉండగానే బిడ్డకు ఆరోగ్యం నూరిపోద్దామిలా! - baby massage in telugu

పసితనంలోనే ఆరోగ్యాన్ని నూరిపోసే పురాతన అభ్యాంగన పద్ధతిని పాటిస్తేనే శిశువుల కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అప్పుడే పుట్టిన పిల్లల పెరుగుదలకు దోహదపడే ఆరోగ్యకరమైన, ఆయుర్వేద పద్ధతి గురించి తెలుసుకుందాం రండి...

body-massage-for-a-healthier-babyhow-to-m
అమ్మ ఒడిలో ఉండగానే బిడ్డకు ఆరోగ్యం నూరిపోద్దామిలా!
author img

By

Published : Aug 14, 2020, 10:30 AM IST

కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి.. అమ్మ చెంత హాయిగా నిద్రిస్తున్న పసిపాపను చూసి.. 'ఎంత అదృష్టం ఈ వయసులో వీరికి నిద్రపోవడం తప్ప మరో పనే ఉండదు అనుకుంటాం.' కానీ, అలా గంటల తరబడి వెల్లకిలా బజ్జుండే బుజ్జాయికి మాత్రమే తెలుస్తుంది అందులోని ఇబ్బందేంటో. విపరీతమైన ఒళ్లు నొప్పులు, చర్మం మంట, జీర్ణక్రియ సమస్యలు. ఇలా ఒకటీ, రెండూ కావు. ఆ సున్నితమైన శరీరంపై పెద్దయ్యాక కూడా వీటి ప్రభావం ఉంటుంది. అందుకే ఈ సమస్యలన్నింటీకీ 'అభ్యాంగ'(మసాజ్)తో చెక్ పెట్టమంటున్నారు ఆయుర్వేద నిపుణులు, ఆయుర్వేద మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి. శిశువు పుట్టిన వారం రోజుల తర్వాత నుంచి సున్నితంగా మసాజ్ ప్రక్రియ ప్రారంభించాలంటున్నారు.

లాభాలు

  • అలసట నుంచి ఉపశమనం
  • రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
  • వర్షాకాలంలో బలహీనంగా ఉండే జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
  • చర్మం పొడిబారకుండా.. మెరిసేలా చేస్తుంది.
  • జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
  • ఎముకలు, కీళ్లు, కండరాలు దృఢమవుతాయి.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
body-massage-for-a-healthier-babyhow-to-m
అమ్మ ఒడిలో ఉండగానే బిడ్డకు ఆరోగ్యం నూరిపోద్దామిలా!

ఎలా చేయాలి..

మసాజ్ ఎలా పడితే అలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం చేస్తేనే ఫలితం ఉంటుందంటున్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి. కింద సూచించిన వరుస ప్రకారం మర్దన చేయాలంటున్నారు.

  • తల
  • పాదాలు
  • కాళ్లు
  • ఉదరం, ఛాతీ
  • వెన్ను

ఈ క్రమంలో రోజూ మర్దన చేయాలి. అయితే, అక్టోబర్ నుంచి జనవరి వరకు వారానికి ఏడు రోజులూ మసాజ్ చేస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారట.

గుర్తుంచుకోవాల్సినవి..

  • ఉదరం, ఛాతీ భాగాలను మసాజ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఎందుకంటే అన్ని ముఖ్యమైన అవయవాలు ఆ ప్రాంతంలో ఉంటాయి మరి.
  • ప్రతిరోజూ కనీసం 10-15 నిమిషాలు మసాజ్ చేస్తే మంచిది.
  • పాలు పట్టించిన వెంటనే మసాజ్ చేయొద్దు. పాలు పట్టించాక కనీసం ఓ గంటసేపటి తర్వాతే మర్దన చేయాలి.
  • శిశువు దగ్గు, జలుగు, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే.. కొద్దికాలం మర్దన మానేయడమే మంచిది.
  • మర్దనకు గోరువెచ్చని నూనె వాడితే ఫలితం ఎక్కువ ఉంటుంది.
  • శిశువు శరీరంపై నూనెతో మర్దన చేసిన ఓ గంటసేపటి తర్వాతే స్నానం చేయించాలి.

ఏ నూనె వాడాలి?

  • నువ్వుల నూనె
  • కొబ్బరి నూనె
  • బాల అశ్వగంధ తైలం
  • చందన్ బాల తైలం
  • లక్షది తైలం
  • మంజిస్తది తైలం

అయితే, మీ శిశువు చర్మానికి నప్పే నూనె ఏదో తెలుసుకోడానికి ఆయుర్వేద నిపుణులను సంప్రదించొచ్చు. అయితే, స్నానానికి ముందు ఈ మర్దన ప్రక్రియ పిల్లలకే కాదు.. పెద్దలూ పాటించొచ్చు. నూనెతో శరీర కణాలను ఉత్తేజపరిచే మర్దన దినచర్యలో భాగంగా చేసుకోవాలంటోంది ఆయుర్వేదం.

ఇదీ చదవండి: పసి పళ్లను పదిలంగా చూసుకోండిలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.