ETV Bharat / sukhibhava

Black Plums Benefits : లివర్​, షుగర్​, గుండె సమస్యలకు చెక్​.. నేరేడుతో ప్రయోజనాలెన్నో.. - plums diabetes cure

Black Plums Benefits : సాధారణంగా ఏదైనా పండు తింటే శరీరంలోని ఏదో ఒక అవయవానికి ఆరోగ్యం కలుగుతుంది. కానీ ఈ పండు తినటం వల్ల మన శరీరంలోని ప్రతి అవయవానికి మేలు జరుగుతుంది. అదే నేరేడు పండు. అద్భుత ఔషధ గుణాలు కలిగిన దీని వల్ల ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయంటే...

Black plums benefits for liver
లివర్ సమస్యలను సైతం పరిష్కరించగల నేరేడు
author img

By

Published : Jun 11, 2023, 7:25 AM IST

Black Plums Benefits : నేరేడు పండ్లు... అందాన్ని వర్ణించడానికి మాత్రమే కాదు తింటే మంచి ఆరోగ్యాన్ని అందించటానికీ ఉపయోగపడతాయి. కొన్ని పండ్లలో ఔషధ గుణాలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉంటాయి. నేరేడు పండు కూడా అదే కోవకు చెందినది. ఈ పండ్లు చూడటానికి చక్కని రంగుతో.. మిలమిలా మెరిసిపోతూ ఎంత రుచిగా ఉంటాయో.. అదే స్థాయిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఒక్క నేరేడు పండులో 1.41 మి.గ్రా ఐరన్, 15 మి.గ్రా కాల్షియం, 18 మి. గ్రా విటమిన్ - C ఉంటాయి. అంతే కాకుండా ఈ పండ్లలో విటమిన్ B సైతం మెండుగా ఉంటుంది. ఇవి మధుమేహంతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో పోరాడగలుగుతాయి. డయాబెటిస్​ను సమర్థంగా అడ్డుకునే ఆహారాల్లో నేరేడు కూడా ఒకటి. ముఖ్యంగా వీటి గింజలు.. చెక్కరని శక్తిగా మారుస్తాయి.

Health Benefits of Plums : అధిక దాహం, అధిక మూత్రం వంటి లక్షణాలను ఇవి తగ్గిస్తాయి. వీటిని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. పొట్టపై భాగంలో ఎడమ వైపు ఉండే ప్లీహం అనే అవయవం పెరిగినా, మూత్రం నిలిచిపోతున్నా ఈ సమస్యకి ఇది విరుగుడుగా పనిచేస్తుంది.

ఈ పళ్లల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చిరుతిళ్లుగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. జలుబు, దగ్గు లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకోవచ్చు.

ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారటం, దుర్వాసనను అరికడతాయి. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా, అధిక బరువుకు నిరోధకంగా పనిచేసే గుణం ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులోని పీచు పదార్థం రక్తంలో చక్కర స్థాయిలు తొందరగా పెరగకుండా నియంత్రిస్తుంది. వారంలో ఒకటి రెండు సార్లు తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం.

Black Plums Nutrition : ఈ పండ్లలో విటమిన్ - C, A లు ఎక్కువగా ఉంటాయి. C విటమిన్, ఐరన్​ల వల్ల.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఫలితంగా రక్తం శరీరంలోని అవయవాలకు మరింత ఆక్సిజన్ అందిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచే, కంటి ఆరోగ్యాన్ని పెంచే గుణాలు ఈ పండ్ల సొంతం. కాలేయానికి ఏదైనా హాని జరిగినా.. తిరిగి కోలుకోవడానికి సాయపడతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఓవరాల్​గా చెప్పాలంటే ఇందులోని ఔషధ గుణాలు అద్భుతం అని చెప్పాలి. అందుకే ఇవి దొరికే కాలంలో అస్సలు మిస్సవ్వకండి.

నేరేడు పండ్లతో మీ లివర్ సమస్యలు, మధుమేహం మటుమాయం

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.