కావాల్సినవి: అర టీస్పూన్ మిరియాలు, పావుస్పూన్ జీలకర్రను బరకగా పొడిచేసి పెట్టుకోవాలి. పసుపు- పావుస్పూన్, బెల్లంపొడి- అర టీస్పూన్, పల్చటి చింతపండు రసం- పావుకప్పు, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- టీస్పూన్, టొమాటో- ఒకటి (మెత్తగా పేస్టు చేసి పెట్టుకోవాలి).
పోపుకోసం: కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి
తయారీ: గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి దీంట్లో టొమాటో పేస్టు, చింతపండు రసం, పసుపు, మిరియాలు, జీలకర్ర, బెల్లంపొడి, సరిపడా ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతుండగానే ఇంగువ, కొత్తిమీర తురుము వేసి కాసేపు చిన్నమంట మీద ఉంచాలి. కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడగానే రసంలో కలపాలి. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే గొంతు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.