ETV Bharat / sukhibhava

మిరియాలు- ఘాటైన రుచే కాదు, గమ్మత్తైన హెల్త్ బెనిఫిట్స్​ కూడా! మిస్​ అయ్యారంటే అంతే!

Black Pepper Benefits: మిరియాలు పేరు వింటేనే ఘాటు నషాళానికి ఎక్కిందా..? ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఆయుర్వేదంలో వ్యాధులను నయం చేయడానికి మిరియాలను ఔషధంలా వాడతారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 2:03 PM IST

Black Pepper Benefits
Black Pepper Benefits

Black Pepper Health Benefits in Telugu: నల్ల మిరియాలు ప్రతి ఒంటింట్లో కచ్చితంగా ఉంటాయి. మిరియాలు ఏ వంటకంలో వేసినా దాని టేస్ట్‌ను డబుల్‌ చేస్తాయి. మిరియాల చారు అయితే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జలుబు చేసినప్పుడు ఇదే గొప్ప మెడిసిన్‌లా పని చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాల కారణంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా.. నల్ల మిరియాలను శతాబ్దాలుగా మన వంటల్లో వాడుతున్నాం. మిరియాలను ‘బ్లాక్‌గోల్డ్‌’ అని కూడా పిలుస్తారు.

వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలను మన రోజూవారీ డైట్‌లో కొంచెం చేర్చుకున్నా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చూసేయండి.​

నిద్రపోయేప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? జాగ్రత్త- మొటిమల సమస్య అధికమవుతుంది!

  • బరువు తగ్గడం : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఇబ్బందిపడేది బరువుతో. అయితే నల్ల మిరియాలలోని కాంపోనెంట్ పెపరిన్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇది కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా ఊబకాయాన్ని నిరోధించడంలో తోడ్పడుతుంది.
  • క్యాన్సర్‌ను నివారిస్తుంది : నల్ల మిరియాలు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. నల్ల మిరియాలు ప్రధాన ఆల్కలాయిడ్ భాగం పైపెరిన్, వివిధ క్యాన్సర్లలో యాంటీట్యూమర్ కార్యకలాపాలను కలిగి ఉంటుంది.
  • డయాబెటిస్‌ రాకుండా రక్షిస్తుంది..: మిరియాల్లోని ‘పెపరిన్‌’ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగవు. ఫలితంగా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • గుండెకు మంచిది: నల్ల మిరియాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది.

మీరు పడుకునే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? - ఆ నష్టం గ్యారెంటీ!

  • జీర్ణసమస్యలు చక్కటి ఔషధం: పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి. పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగిస్తాయి. మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి రుచి మొగ్గలను ఉత్తేజితం చేయడం వల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. భోజనంలో పావుచెంచా వాము, రెండుమూడు మిరియాలు, నెయ్యి, ఉప్పుతో కలిపి మొదటి ముద్ద తింటే అజీర్ణం తగ్గుతుంది.
  • 15 మిరియాలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేడి నీళ్లల్లో కాచి కొంచెం కొంచెంగా తాగితే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతాయి.
  • నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి తీసుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది.
  • మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్‌ని అదుపులో ఉంచుతాయి.
  • పాలల్లో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.

బీట్‌రూట్‌ ఇలా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు దూరం!

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.