ETV Bharat / sukhibhava

పిల్లలకు ఇంకా పెరుగన్నమేనా? అలా చేస్తే ఆరోగ్యంపై ప్రభావం! - best food for children growth in telugu

Best Health Tips for Kids in Telugu: పిల్లలకు ఒక వయసు దాటిన తర్వాత కూడా.. తల్లిదండ్రులు పెరుగన్నం మాత్రమే తినిపిస్తుంటారు. ఉప్పు, కారం తగలకుండా చూస్తుంటారు. దీనివల్ల పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Best Health Tips for Kids in Telugu
Best Health Tips for Kids in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 11:22 AM IST

Children Health and Food Tips in Telugu : పిల్లల ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఆహారం, బట్టలు ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడానికి ప్రతిరోజూ తగినంత పోషకాహారం అవసరం అవుతుంది. చిన్నపిల్లల విషయంలో ఇది ఎక్కువ అవసరం. ఎందుకంటే 6 నెలల వయస్సులో పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ శక్తి, పోషకాలు అవసరం అవుతాయి. ఆరు నెలల తర్వాత చిన్నపిల్లలకు పాలతోపాటు.. ఆహారం తినిపించడం ప్రారంభించాలని వైద్యులు సూచిస్తారు.

హై కొలెస్ట్రాల్ భయపెడుతోందా? - ఉదయాన్నే ఇవి తినండి - లేదంటే అంతే!

అలా వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆహారాన్ని ఓ మోతాదులో పెంచుకుంటూ తినిపించాలని సూచిస్తారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే.. వారు పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారు. అయితే.. కొద్దిమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు మూడు సంవత్సరాల వయసు వచ్చినా కేవలం పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి మెత్తగా చేసిన అన్నం పెడుతుంటారు. దానికి కారణం.. కారం పదార్థాలు ఇప్పటి నుంచే వద్దనే ఓ భావనలో ఉండిపోతారు. లేదంటే.. పిల్లలు తినట్లేదని వదిలేస్తారు. అయితే.. అది మంచి పద్ధతి కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

13 ఏళ్లొచ్చినా పక్క తడుపుతున్నారా? - ఇలా చేయండి!

Best Health Tips for Kids: పిల్లలకు ఏడాది దాటిన తర్వాత నుంచి.. పెద్దలు ఏ ఆహారం తింటున్నారో.. అదే వాళ్లకూ అలవాటు చేయాలి. ఈ సమయంలో అలవాటు చేయకపోతే కౌమార దశకు వచ్చేసరికి ఇబ్బందులు మొదలవుతాయి. కొత్త వ్యక్తులతో మనం ఎలా బెరుకుగా ఉంటామో.. పిల్లలు కూడా కొత్త ఆహారం అంటే అలానే ఆలోచిస్తారు. అలా కాకుండా ఉండాలంటే పప్పు దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నూనెలు, పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, ధాన్యాలన్నీ ఇవ్వాలి. కానీ.. పెద్దవాళ్లు తినేదాంట్లో ఐదో వంతు మాత్రమే పెట్టాలి.

దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ 4 మొక్కలు పెంచితే చాలు - అన్నీ ఔట్!

మన ప్రాంతంలో అన్నం ఎక్కువగా తీసుకుంటాం. అది కాస్త తియ్యగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం ఎక్కువ వేసి కూరగాయలు వండుకోవడం అలవాటు. పిల్లలకు వాటిని కాస్త తగ్గించి ఇవ్వాలి. ఇంకా.. మాంసకృత్తులు సరిపోతున్నాయా, విటమిన్లు, మినరల్స్‌, పీచు లాంటివి అందిస్తున్నామా లేదా? అనేది చూసుకోవాలి. ఎప్పుడూ అన్నమే పెట్టకుండా.. తృణధాన్యాలతో చేసిన చపాతీ, రాగి ముద్ద, జావ, ఉడికించిన గుగ్గిళ్లు పెట్టొచ్చు. పండ్లు తినడం మంచిదే.

వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్​తో యంగ్​గా కనిపించండి!

పెద్దవుతున్న కొద్దీ శరీరానికి పోషకాల అవసరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్దగా కారం ఉండని కిచిడీ, పొంగల్‌, పాలకూర పప్పు, వెజిటబుల్‌ రైస్‌ వంటివి తినిపించాలి. ఇలా చేస్తే పిల్లలకు మైక్రోన్యూట్రియంట్స్‌, ఐరన్‌, విటమిన్‌ బీ, ఏ, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు లభ్యమవుతాయి. బొప్పాయి, దానిమ్మ, మామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌, రేగిపండ్లు వంటివి పెడుతూ ఉంటే ఆ రంగులకి ఆకర్షితులవుతారు. మనం కూడా తింటే మనల్ని గమనించి వాళ్లూ తింటారు. కూరగాయలు కొనేటప్పుడు, వంట చేస్తున్నప్పుడూ వాళ్లనూ వెంట ఉంచుకుంటే ఆహారం పట్ల ఆసక్తిని పెంచుకుంటారు.

మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ తెచ్చుకుంటే చూడాలనుందా? - తల్లిదండ్రులుగా మీరు ఇవి చేయాలి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.