ETV Bharat / sukhibhava

Best Fiber Foods In Telugu : ఫైబర్​ ఫుడ్​తో గుండె జబ్బులు, క్యాన్సర్​ దూరం! - పీచు పదార్థాలతో బరువు తగ్గుతారా

Best Fiber Foods In Telugu : మీరు బరువు తగ్గుదామని అనుకుంటున్నారా? మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా పీచు పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అందుకే ఏయే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఫైబర్​ (పీచు పదార్థం) ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Is There Fibre In Your Diet
Best Fiber Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 7:29 AM IST

Best Fiber Foods In Telugu : మనకు ఆరోగ్యాన్నిచ్చే పోషకాల్లో (పీచు పదార్థాలు) ఫైబర్​ది ప్రత్యేకమైన స్థానం. ఫైబర్ మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అనేక రకాల అనారోగ్యాలను నివారించి, మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. మలబద్ధకం ఉన్నవారికి ఫైబర్ ఉన్న ఆహారం అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. గుండె వ్యాధుల నుంచి క్యాన్సర్ల వరకూ ప్రమాదకరమైన అనారోగ్యాలను నివారించే శక్తి ఫైబర్​కు ఉంది. రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఫైబర్​ పొందే అవకాశం ఉంటుంది. అందుకే ఫైబర్​ పుష్కలంగా ఉండే.. ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు
Is There Fiber In Your Diet : ఫైబర్ కంటెంట్​ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం నుంచి మనల్ని కాపాడటంలో ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ముడి ధాన్యాలు, పప్పు దినుసులు, కొన్ని రకాల కూరగాయలు, పళ్లు, నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా.. మన శరీరానికి అవసరమైన ఫైబర్​ను పొందవచ్చు. వీటిలోని పీచు పదార్థాలు.. మన శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ ఎంతగానో తోడ్పడతాయి. బాగా పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా ముడి, చిరు ధాన్యాలను తినడం వలన, మనకు అవసరమైన పీచు ఉన్న పిండి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

వాస్తవానికి క్యారెట్, బీట్‌రూట్, బంగాళాదుంపలు, బ్రకోలీ, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, బఠాణి, శెనగలు లాంటి వాటిలో ఎక్కువగా పీచు పదార్థాలు (ఫైబర్​) ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. అలాగే భోజనం చేసే ముందు కూరగాయలను, కూరగాయలతో చేసిన సూప్​లను తీసుకోవాలి. వీటి ద్వారా కూడా పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది.

ఆహారంలో ఫైబర్ భాగం కావాలి!
మన భోజనంలో కచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే.. రైస్​, ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్​ను ఆహారంగా తీసుకోవాలి. అయితే సులభంగా కరిగిపోయే సాలిబుల్ ఫైబర్స్​; సులువుగా కరగని ఇన్​-సాలిబుల్ ఫైబర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే ప్రధానంగా సాలిబుల్ ఫైబర్స్ తీసుకోవడం వల్ల ఫలితాలు బాగుంటాయి.

Fiber Health Benefits : డయాబెటిస్, ఒబెసిటీ, ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు.. ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం మంచిది. వాస్తవానికి మనం తీసుకునే పళ్లు, కూరగాయల్లో ఫైబర్ అధికంగా లభిస్తుంది. వీటిని జ్యూస్​లాగా కాకుండా, నేరుగా తినడం వల్ల ఎక్కువ పీచు పదార్థాలు లభిస్తాయి. అవకాడో కాయలో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. పియర్ పండులో కూడా పీచు అధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజు పియర్ పండు నుంచి 5.5 గ్రాముల పీచుని పొందవచ్చు. పప్పు ధాన్యాలు ఎక్కువగా తినేవారికి కూడా పీచు అధికంగా లభిస్తుంది. వీటిలో పీచుతోపాటు విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శాఖాహారులకి పప్పు ధాన్యాల నుంచి ప్రోటీన్లు, ఇనుము హెచ్చు స్థాయిలో దొరుకుతాయి. 100 గ్రాముల పప్పు ధాన్యాల్లో 10 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది.

రోగాలు అదుపులో ఉంటాయి!
మధుమేహం, కొవ్వు, షుగర్​ లెవెల్స్ అధికంగా ఉన్నవారు కచ్చితంగా.. లాంగ్ స్టాండింగ్ ఉండే.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. శరీరంలోని కొవ్వు కూడా క్రమంగా తగ్గుతుంది. ఓట్స్​, బీన్స్​, ఆకుకూరలు, కూరగాయల్లో ఇన్​-సాలిబుల్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని ఆహారంగా తీసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గాలంటే..
బరువు తగ్గాలనుకునేవాళ్లు.. తమ భోజనంలో సూప్స్​, నట్స్​, సీడ్స్​, బ్రౌన్​ రైస్ తీసుకోవాలి. దీని వల్ల బరువుతో పాటు.. గ్యాస్​ సమస్యలు కూడా తగ్గుతాయి.

ప్రోటీన్స్ కూడా లభిస్తాయి!
గింజలు, విత్తనాలు ఎక్కువగా తినడం వల్ల పీచుతో పాటు ప్రోటీన్లు కూడా లభిస్తాయి. చియా గింజల్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. 28 గ్రాముల చియా గింజల్లో 10 గ్రాముల వరకూ ఫైబర్​ లభిస్తుంది. వాస్తవానికి ఆహారంలో పీచు పదార్థాలను పెంచుకోవాలంటే కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో చాలా వరకూ చిరు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.