ETV Bharat / sukhibhava

పుచ్చపండు లాంటి ఆరోగ్యం మీ సొంతమిలా! - health tips

ఎండకాలం వస్తోందనగానే అందరి చూపు పుచ్చపండ్ల మీదికి మళ్లుతుంది. ఎర్రటి గుజ్జుతో కూడి, చూడగానే నోరూరించే వీటిల్లో నీటిశాతం చాలా ఎక్కువ. సుమారు 95% వరకూ నీరే ఉంటుంది. పుచ్చపండులో బీటా కెరొటిన్, విటమిన్‌ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. అంటే రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయన్నమాట. పుచ్చపండు మాత్రమే కాదు.. తీయ దోస (హనీడ్యూ), ఖర్బూజా (క్యాంటలోప్‌) సైతం దీని కోవకు చెందినవే. ఖర్బూజాను ఒక ముక్క (80 గ్రాములు) తిన్నా ఆ రోజుకు అవసరమైన విటమిన్‌ సి, విటమిన్‌ ఎ మోతాదులో సగం వరకు లభిస్తాయి. వీటిల్లోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దామా.

benefits of watermelon in telugu
పుచ్చపండు లాంటి ఆరోగ్యం మీ సొంతమిలా!
author img

By

Published : Mar 24, 2021, 3:37 PM IST

కంటి చూపు మెరుగు:

పుచ్చపండు గుజ్జు ఎర్రటి రంగులో ఉండటానికి కారణం బీటా కెరొటిన్‌. ఇది చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్నకొద్దీ కంట్లోని రెటీనా మధ్యభాగం క్షీణించటం మూలంగా చూపు తగ్గిపోయే సమస్యనూ ఇది నివారిస్తుంది. ఖర్బూజాలోని ల్యూటీన్, జియాగ్జాంతీన్‌ సైతం కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

రక్త ప్రసరణ ఉత్తేజం:

పుచ్చపండు గుజ్జు, తొక్కలో సిట్రులిన్‌ అనే అమైనో ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది న్రైటిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తయ్యేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు విప్పారతాయి. అవయవాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది.

రక్తపోటు అదుపు:

పొటాషియం మూత్రం ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అందువల్ల పొటాషియం తగినంతగా లభించాలంటే పుచ్చపండు తింటే సరి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేలా చేసుకోవచ్చు. మరోవైపు దీనిలోని లైకోపేన్‌ గుండెజబ్బు ముప్పు తగ్గటానికీ తోడ్పడుతుంది.

పుండ్లు మాన్పుతుంది:

ఆర్జినైన్‌ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి కావటంలో పుచ్చపండులోని సిట్రులిన్‌ పాలు పంచుకుంటుంది. ఆర్జినైన్‌ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అలాగే పుండ్లు త్వరగా మానటానికీ దోహదం చేస్తుంది.

విషతుల్యాలు పోగొడుతుంది:

పుచ్చపండులో నీరు ఎక్కువగా ఉంటుంది కదా. పైగా ఇందులో ఖనిజాల పాళ్లు మెండు. అలాగే ఒంట్లో ఆమ్ల స్వభావాన్నీ తగ్గిస్తుంది. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. అందువల్ల ఒంట్లో పేరుకుపోయిన విషతుల్యాలు పోగొట్టుకోవాలని భావించేవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.

తక్షణ శక్తి:

పుచ్చపండు తేలికగా జీర్ణమవుతుంది. మంచి పిండి పదార్థాలు సైతం ఉండటం వల్ల తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల నీరసం, నిస్సత్తువ వంటివి వెంటనే తగ్గుతాయి. మానసికంగానూ మంచి హుషారు, ఉత్సాహం చేకూరుతాయి.

పలుకులూ మేలే:

పుచ్చకాయ గింజల్లోని పలుకుల్లో ఉండే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు సైతం మేలు చేసేవే. వీటిల్లో పీచు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసేవే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.